AADIVAVRAM - Others

కోపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరైనా ఏదైనా పని చేస్తే ఇతరులకి నచ్చదు. ఆ పని వల్ల ఆ ఊరికి మేలు జరుగుతున్నా ఆ పనిని మెచ్చని వ్యక్తులు ఆ ఊళ్లో ఉంటారు. ఆ మంచి పనివల్ల ఆ వ్యక్తికి కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయని వాళ్ల బాధ.
మా ఊళ్లో నా చిన్నప్పుడే హైస్కూలు వచ్చింది. ఇది యాభై సంవత్సరాల క్రింది మాట. ఆ బడి రావడానికి ప్రధాన కారకులు మా బాపు (నాన్న). అప్పుడు ఆయన్ని విమర్శించినవారు ఎందరో. ఏదో కారణం చెప్పి అతన్ని విమర్శించారు. మా బాపు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆ వ్యక్తులు వచ్చి అప్పుడు తాము తప్పు చేశామని మా బాపుతో చెప్పారు. గతంలో మాదిరిగానే ఆయన ఓ చిన్న చిరునవ్వు నవ్వాడు.
‘అనవసరంగా విమర్శించినందుకు అప్పుడు వాళ్లని ఎందుకు కోపగించుకోలేదు’ అని మా బాపుని అడిగాను వాళ్లు వెళ్లిపోయిన తరువాత.
వాళ్లతో గొడవపడితే బడి కట్టడం పూర్తయ్యేది కాదు. అంతేకాదు. దానివల్ల నా సమయం వృథా అయ్యేది. నీకు బాధ కలిగించిన వ్యక్తులని, కష్టం కలిగించిన వ్యక్తులని క్షమిస్తే నువ్వు సమయాన్ని మిగుల్చుకోగలవు. బాధపడి, వ్యాకులపడి కోపగించుకుంటే విలువైన సమయం కాస్త వృథా అవుతుంది. మన శక్తియుక్తులు నాశనమవుతాయి. అందుకని చిరునవ్వు నవ్వేవాడిని’ చెప్పాడు మా బాపు. మళ్లీ ఆ విధంగా చెప్పాడు.
‘కొన్ని కోపగించుకునే సందర్భాలు వస్తాయి. కానీ నీవు వాటి మీద నీ దృష్టి కేంద్రీకరిస్తే నీ సమయం వృథా అవుతుంది.
నినె్నవరైనా కష్టపెడితే, బాధపెడితే వాళ్లని క్షమించు. లేదంటే నీ విలువైన సమయం వృధా అవుతుంది. నువ్వు కోపగించుకోకపోతే ఆ విషయం అక్కడితో ముగుస్తుంది.
క్షమిస్తూ వెళితే నువ్వు అనుకున్నది సాధిస్తావు. ఆ బడిని నేను కట్టగలిగానంటే వాళ్లని నేను క్షమించాను. కనుకే వాళ్లతో ఘర్షణ పడితే ఆ బడి ఆ సంవత్సరం తయారయ్యేది కాదు.
ఒక్క విషయం గుర్తుంచుకో. ఒక్క నిమిషం నువ్వు కోపంగా ఉంటే నీ జీవితంలో నుంచి 60 సెకన్లు కాదు 60 నిమిషాలు కూడా వృథా అవుతాయి’ చెప్పాడు మా బాపు.
ఇది అమలు చేయడంలో అప్పుడప్పుడు అందరం విఫలమవుతూనే ఉన్నాం.