రాష్ట్రీయం

జనవరిలో 11 లక్షల కొత్త రేషన్‌కార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వరద బాధితుల సాయంలో నిర్లక్ష్యం వహించిన డీలర్లపై వేటు..
* రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత
కడప : జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల కొత్త రేషన్ రేషన్‌కార్డులు పంపిణీ చేస్తామని, చౌక దుకాణాల డీలర్లు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత హెచ్చరించారు. అలాగే వరద బాధితులకు 25 కిలోల బియ్యం, కిలో పంచదార ఇవ్వకపోవడంతో జిల్లాకు చెందిన కోడూరు శెట్టిగుంట డీలర్‌ను సస్పెండ్ చేస్తూ ఆమె ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదివారం కడప జిల్లాలోని రైల్వేకోడూరు, రాజంపేట అసెంబ్లీ సెగ్మెంట్లలో విస్తృతంగా పర్యటించి నిత్యావసరాల పంపిణీపై లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.