జాతీయ వార్తలు

చిన్నారుల మరణాలపై వివరణ ఇవ్వండి:సుప్రీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: చిన్నారుల మరణాలపై వివరణ ఇవ్వాల్సిందిగా అత్యున్నత న్యాయస్థానం కోరింది. బీహార్‌లోని ముజిఫర్‌వాసులు అక్యూట్ ఎన్సిఫాలిటిస్ సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్న విషయం విదితమే. ఇప్పటికే ఈ వ్యాధిబారిన పడి వందమంది చిన్నారులు మృతిచెందారు. ఏఈఎస్ వ్యాధిని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని మనోహర్ ప్రతాప్, ఎస్. అజ్మినీ అనే ఇద్దరు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు రాష్ట్రంలోని వైద్య సదుపాయాలు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియజేస్తూ వారం రోజుల్లో అపఢివిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇవే అదేశాలు చేసింది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగరాదని, వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివరణ ఇవ్వాలని కోరింది.