జాతీయ వార్తలు

కేంద్రానికి సుప్రీం నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత పరూఖ్ అబ్దుల్లా ఆచూకీపై వివరణ ఇవ్వాలంటూ సుప్రీం కోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. జమ్మూలో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ముందు జాగ్రత్తలలో భాగంగా అక్కడి రాజకీయ నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై జయంతి సందర్భంగా తమిళనాడులో జరిగే కార్యక్రమానికి ఫరూక్ అబ్దుల్లా రావాల్సి ఉంది. ఆయన ఆచూకీ కోసం ఎండీఎంకే అధినేత వైగో ప్రయత్నించగా లభించలేదు. దీంతో ఆయన సుప్రీం కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీన్ని ఈ రోజు విచారించిన జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఫరూక్ ఆచూకీపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర, జమ్మూ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది.