జాతీయ వార్తలు

అయోధ్య స్థలం రామజన్మభూమి న్యాస్‌కు అప్పగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలంపై అత్యున్నత న్యాయస్థానం చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. అయోధ్యలోని వివాదాస్పదమైన 2.77 ఎకరాల స్థలాన్ని రామజన్మభూమి న్యాస్‌కు అప్పగించాలని కోర్టు తీర్పునిచ్చింది. అంతేకాదు మసీదు నిర్మాణానికి వక్ఫబోర్డుకు ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని తీర్పు నిచ్చింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పును వెలువరించింది. కేంద్రం లేదా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మసీదు నిర్మాణానికి స్థలం కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొంది. వివాదాస్పద స్థలంలోనే ఆలయం నిర్మించాలని కూడా ధర్మాసనం తీర్పులో పేర్కొంది. ఆలయం నిర్మాణం, ట్రస్ట్ విధి విధానాలపై కేంద్రం మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని కోరింది. వివాదాస్పద స్థలాన్ని ట్రస్ట్ ఆధీనంలో ఉంచాలని కూడా స్పష్టం చేసింది. భూకేటాయింపునకు కేంద్రం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని కోరింది. జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ బాబ్డే, జస్టిస్ అశోక్‌భూషణ్, జస్టిస్ నజీర్, జస్టిస్ చంద్రచూడ్‌లతోకూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఒకే తీర్పును ఇవ్వటం జరిగింది. వక్ఫ్‌బోర్డు, అఖాడా వాదనలు న్యాయస్థానం తోసిపుచ్చింది. యాజమాన్య హక్కులు కోరుతూ వక్ఫ్ బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. మసీదు కూల్చివేత చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించింది.