జాతీయ వార్తలు

కర్ణాటక ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: కావేరీ జలాల విడుదలపై ఇచ్చిన తీర్పును ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని కర్ణాటక ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. తీర్పును నిలుపుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తమిళనాడు రాష్ట్రానికి 15వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ఇచ్చిన తీర్పు నిలిపివేయాలని కర్ణాటక ప్రభుత్వం కోర్టును కోరింది. 15వేల క్యూసెక్కులు కాకుండా వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేసేలా తీర్పును సవరించాలని కర్ణాటక కోరింది. తీర్పును అమలు చేయకుండా పునఃసమీక్షించాలని కోరడం ఎంతవరకు సమంజసమని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సెప్టెంబర్‌ 20లోగా తమిళనాడుకు 12వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సిందేనని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను 20వ తేదీకి వాయిదా వేసింది. కోర్టు తీర్పును నిరసిస్తూ కర్ణాటక ప్రజల ఆందోళనలను న్యాయస్థానం తప్పుబట్టింది. కర్ణాటక, తమిళనాడు ప్రజలు చట్టాన్ని గౌరవించి సంయమనం పాటించాలని.. అధికారులు శాంతిభద్రతల కాపాడే విధంగా పనిచేయాలని సూచించింది.