క్రీడాభూమి

బిసిసిఐకి 'సుప్రీం' భయం !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి విచారణలో ఏం జరుగుతుందోనని ఆందోళన

న్యూఢిల్లీ, మార్చి 17: పాలనా వ్యవహారాలన్నీ పారదర్శకంగా జరగాలన్న ఉద్దేశంతో లోధా కమిటీ చేసిన సిఫార్సులను అమలుచేయడానికి ససేమిరా అంటున్న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కి సుప్రీం కోర్టు శుక్రవారం ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందోన్న భయం పట్టుకుంది. ఈనెల మూడో తేదీన బిసిసిఐ తరఫు లాయర్ చేసిన వాదనలపై న్యాయమూర్తులు టిఎస్ ఠాకూర్, ఇబ్రహీం ఖలీఫుల్లాతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. అంతేగాక, గత ఐదేళ్ల కాలంలో వివిధ రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు ఇచ్చిన మొత్తాలతోపాటు, వివిధ కీలక చెల్లింపుల వివరాలను కూడా సమర్పించాలని ఆదేశించింది. శుక్రవారం కోర్టు విచారణ మొదలైన వెంటనే బిసిసిఐ ముందుగా ఐదేళ్ల కాలానికిగాను జమాఖర్చులను సమర్పిస్తుంది. అయితే, లోధా కమిటీ సిఫార్సులపై బోర్డు వాదన ఎలా ఉంటుంది? దానిపై సుప్రీం కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది? అన్న ప్రశ్నలు ఆసక్తిని రేపుతున్నాయి. గత విచారణ సమయంలో సుప్రీం కోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు బోర్డును ఆత్మరక్షణలో పడేశాయి. ఈసారి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందోనన్న భయం బోర్డు అధికారులను వెంటాడుతున్నది.
ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
క్రికెట్‌కు సంబంధించిన వ్యవహారాల్లో మంత్రుల అవసరం ఏమిటని గత విచారణ సమయంలో బిసిసిఐని సుప్రీం కోర్టు ధర్మాసనం నిలదీసింది. బోర్డు కార్యవర్గంలో మంత్రులకు చోటు కల్పించవద్దని లోధా కమిటీ చేసిన సూచనను అమలు చేస్తే వచ్చే నష్టం ఏమిటని ప్రశ్నించింది. కోట్ల రూపాయల లావాదేవీలను ఎవరి జోక్యం లేకుండా స్వతంత్రంగా చూసుకోవాలని ఆలోచిస్తున్నారా? అని నిలదీసింది. లోధా కమిటీ సమర్పించిన నివేదికలోని పలు అంశాలు ఆచరణలో కష్టమని, వాటిని అమలు చేయడం అసాధ్యమని బిసిసిఐ పేర్కోవడాన్ని తప్పుపట్టింది. బోర్డు కార్యవర్గ సభ్యులకు గరిష్ట వయోపరిమితిని విధించాలని లోధా కమిటీ చేసిన సిఫార్సును ఎందుకు వ్యతిరేకిస్తున్నారని అడిగింది. కాగా, లోధా కమిటీ సిఫార్సులు ఇప్పటికే బహిర్గతమైనందువల్ల వాటిని అమలు చేయడంలో చాలా సమస్యలు తలెత్తుతాయని బిసిసిఐ లేవనెత్తిన అభ్యంతరాన్ని సుప్రీం కోర్టు ఏ విధంగా స్వీకరిస్తుందో చూడాలి. ఒక సంఘానికి ఒకే ఓటు వంటి సిఫార్సులను కూడా బోర్డు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. బెట్టింగ్‌కు చట్టబద్ధత కల్పించాలన్న సిఫార్సు కూడా ఆమోదయోగ్యంగా లేదని కూడా బిసిసిఐ వాదిస్తున్నది. మొత్తానికి లోధా కమిటీ సిఫార్సులను ఉన్నవి ఉన్నట్టుగా అమలు చేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది.
వివరణలతో బోర్డు సిద్ధం
లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయడం వల్ల తలెత్తే సమస్యలపై పూర్తి వివరణలను సుప్రీం కోర్టు ధర్మాసనం ముందు ఉంచడానికి బిసిసిఐ సిద్ధమైంది. అత్యధిక ఆదాయ వనరులతో ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న బిసిసిఐ ఎన్నో కొత్త హంగులను, ఆర్భాటాలను క్రీడలోకి జొప్పించింది. 2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)ను ప్రవేశపెట్టి, క్రికెట్‌ను కొత్త మలుపు తిప్పింది. అయితే, స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసుతో ఇరకాటంలో పడింది. విశ్రాంత న్యాయమూర్తి ముకుల్ ముద్గల్ నాయకత్వంలోని కమిటీ రెండు విడతలుగా విచారించి సుప్రీం కోర్టుకు వేరువేరుగా నివేదికలను సమర్పించింది. ఈ నివేదికల ఆధారంగా, దోషులకు శిక్షలను ఖరా చేసేందుకు లోధా నాయకత్వంలో అశోక్ భాన్, ఆర్వీ రవీంద్రన్ సభ్యులుగా ఉన్న త్రిసభ్య కమిటీకి అప్పగించిన విషయం తెలిసిందే. బిసిసిఐ పాలనా వ్యవహారాలు పారదర్శకంగా ఉండేందుకు సిఫార్సులను కూడా కోరింది. లోధా కమిటీ బోర్డు అధికారులతో 38 పర్యాయాలు సమావేశమై, 159 పేజీల నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించింది. ఈ నివేదికలోని సిఫార్సులను తు.చ తప్పకుండా అమలు చేయాలని సూచించిన సుప్రీం కోర్టు ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియచేసేందుకు బిసిసిఐకి అవకాశం ఇచ్చింది. అదే సమయంలో సిఫార్సులను అమలు చేయడం ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించింది. బోర్డు పాలనా వ్యవహారాలు పారదర్శకంగా ఉండాల్సిన అవసరం లేదా అని అడిగింది. ప్రజలకు జవాబుదారీ వహించాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోవడానికి వీల్లేదని వ్యాఖ్యానించింది. ఆ మాటలను గుర్తు చేసుకుంటే, శుక్రవారం బోర్డుకు మరోసారి సుప్రీం కోర్టు నుంచి చీవాట్లు తప్పకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. మొత్తం మీద సుప్రీం కోర్టులో ఏం జరుతుందోనని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బహుశా శుక్ర వారం రోజే సుప్రీం కోర్టు ఈ కేసుపై ఒక స్పష్టతని చ్చే అవకాశం ఉంది. ** విశ్రాంతి న్యాయమూర్తి ఆర్‌ఎం లోధా **