జాతీయ వార్తలు

కోచింగ్ సెంటర్ యజమానిపై కేసు, అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూరత్: ఇరవై మంది విద్యార్థులను బలితీసుకున్న కోచింగ్ సెంటర్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ భవంతిని నిర్మించిన హర్షల్ వకారియా, జిగ్నేష్‌లతో పాటు కోచింగ్ సెంటర్ యజమాని భార్గవ్ భూటానీలపై కేసు నమోదు చేశారు. ఈ భవనంపై ఓ షెడ్డు నిర్మించి అందులో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారనీ... ఈ నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా లేవా అన్నదానిపైనా విచారణ జరుగుతోందని ఉపముఖ్యమంత్రి నితిన్ భాయ్ పటేల్ పేర్కొన్నారు.