రాష్ట్రీయం

102 లక్షల ఎకరాలకు సాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 11: నదుల రాష్ట్రంగా పేరున్న ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది డిసెంబర్ వరకు సాగునీటి ప్రాజెక్టుల ద్వారా 102.71 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించినట్లు సామాజిక, ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు. 2015-16 సంవత్సరానికి విడుదల చేసిన సామాజిక, ఆర్థిక సర్వేలో భారీ సాగునీటి ప్రాజెక్టుల కింద 64.56 లక్షల హెక్టార్లు, మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టుల కింద 5.52 లక్షల హెక్టార్లు, మైనర్ ఇరిగేషన్ కింద 25.60 లక్షల హెక్టార్లు, ఏపిఎస్‌ఐడిసి కింద 7.03 లక్షల హెక్టార్లకు సాగునీరు అందుతోందని వెల్లడైంది. మొత్తం ఏడు ప్రాజెక్టులను ప్రాధాన్యత కింద చేపట్టారు.
వీటిని 2018లోగా పూర్తి చేస్తారు. పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం, తోటపల్లి బ్యారేజి ప్రాజెక్టు, హంద్రీ, నీవా సుజల స్రవంతి, గాలేరు-ననగరి సుజల స్రవంతి మొదటి దశ, బిఆర్‌ఆర్ వంశధార ప్రాజెక్టు, పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు, గుండ్లకమ్మ ప్రాజెక్టులను చేపట్టారు. తోటపల్లి, పోలవరం కుడి మెయిన్ కాల్వవ, గాలేరు నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులను ఈ ఏడాది జూన్ లోపల పూర్తి చేస్తారు. వంశధార రెండవ దశ, పోలవరం ఎడమ మెయిన్ కాల్వ, వెలిగొండ ప్రాజెక్టులను వచ్చే ఏడాది జూన్‌లోగా, పోలవరం ప్రాజెక్టు మొదటి దశను 2018 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చే ఏడాది బడ్జెట్‌లో పోలవరంకు రూ.3380 కోట్లు, తాడిపూడికి రూ.55 కోట్లు, పుష్కరంకు రూ.54 కోట్లు, చింతలపూడికి రూ. 91 కోట్లు కేటాయించారు.వచ్చే ఏడాది బడ్జెట్‌లో సాగునీటి రంగానికి మొత్తం రూ.7325 కోట్లు కేటాయించారు. ఇందులో భారీ నీటిపారుదలకు రూ. 6386.66 కోట్లు, మధ్య తరహా నీటిపారుదలకు రూ.100.62 కోట్లు, చిన్న నీటిపారుదల రంగానికి రూ.679.62 కోట్లు, ఆయకట్టు అభివృద్ధికి రూ.137 కోట్లు కేటకాయించారు.