కాలం నా ప్రేయసి అంటున్న సూర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ స్టార్ హీరోగా వెలుగొందుతున్న సూర్య హీరోగా విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో గ్లోబల్ సినిమాస్, 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ పతాకాలపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా సమర్పిస్తున్న చిత్రం ‘24’. ఈ చిత్రంలోని ఒక పాటను ఆదివారం విడుదల చేశారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్న ‘కాలం నా ప్రేయసి’ అనే పాటను రచయిత చంద్రబోస్ రాశారు. సూర్య సరసన సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా అజయ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తమిళ, తెలుగు భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమా గురించి నిర్మాతలు వివరాలు తెలియజేస్తూ, ఇటీవలే విడుదలైన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని, టైమ్ ఆధారంగా నడిచే కథతో హీరో సూర్య విభిన్నంగా కనిపిస్తాడన్నారు. ఇప్పటివరకు ఇలాంటి కథల్ని మనం చూళ్లేదని, సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అందరికీ నచ్చేలా దర్శకుడు తెరకెక్కిస్తున్నారని, ఈరోజు పాటను విడుదల చేయడం ఆనందంగా వుందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. త్వరలోనే ఆడియోను విడుదల చేసి, సమ్మర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తామని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, కెమెరా: కె.తిరునావుక్కరుసు, ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, సమర్పణ: జ్ఞానవేల్‌రాజా, నిర్మాత: సూర్య, దర్శకత్వం: విక్రమ్ కె.కుమార్.