అంతర్జాతీయం

ఉమ్మడి శక్తిని చాటాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడే సార్క్ ఆర్థిక యూనియన్ ఏర్పాటు సాధ్యం
37వ వార్షిక మంత్రుల సమావేశంలో సుష్మ పిలుపు

పొఖారా, మార్చి 17: మారుతున్న ప్రపంచ పరిస్థితులు నేపథ్యంలో సార్క్ దేశాలు తమ ఉమ్మడి శక్తిని నిరూపించుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ గురువారం ఇక్కడ పిలపునిచ్చారు. దక్షిణాసియా ఆర్థిక సమాజం మరింత సంఘటితం కావాలని, అనుసంధానం కావల్సిన అవసరం ఎంతో ఉందని స్పష్టం చేశారు. రైలు, మోటారు వాహనాలకు సంబంధించి ఒప్పందాలపై వేగవంతంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ దేశాల మధ్య ఆర్థిక బంధం మరింత బలపడుతుందని తెలిపారు. సార్క్ దేశాలు వేటికవి అన్ని విధాలుగా శక్తివంతం అవుతున్నప్పటికీ ఇప్పటి వరకూ తమ ఉమ్మడి బలాన్ని, శక్తిని ఉపయోగించుకోలేక పోయాయని సుష్మా స్వరాజ్ అన్నారు. దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(సాప్టా), దక్షిణాసియా సర్వీసుల వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం అత్యంత కీలక పరిణామమని వెల్లడించిన సుష్మా ఈ ఒడంబడికలు మరింతగా సంఘటితం కావల్సిన అవసరం ఎంతైనా ఉందని అప్పుడే దక్షిణాసియా సమాజా లక్ష్యాన్ని సాధించగలుగుతామని తెలిపారు. సార్క్ దేశాల మంత్రులు 37వ సమావేశాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. వృద్ధి, సంపద విషయంలో దక్షిణాసియా ప్రాంతం వేగంగా పురోగమిస్తోందని, అలాగే ప్రపంచంలోనే మిగతా ప్రాంతాలకంటే వేగవంతంగా అభివృద్ధిని సాధించిందని ఆమె అన్నారు. ఇంతగా విజయాలను నమోదు చేసుకుంటున్నా, ఈ దేశాల మధ్య ప్రాంతీయ సమగ్రత అంటే అన్ని అంశాల్లోనూ సంఘటితం కావడం అన్నది లోపించిందని ఆమె తెలిపారు. ‘ప్రపంచ గణాంకాలను బట్టి చూస్తే ప్రపంచ వాణిజ్యంలో దక్షిణాసియాకు కేవలం రెండు శాతం వాటానే ఉంది. అలాగే ప్రపంచ ఎఫ్‌డిఐలో 1.7శాతం మాత్రమే ఈప్రాంతానికి అందుతోంది. ప్రపంచ వాణిజ్య పరిమాణంతో పోలిస్చే సార్క్ దేశాల మధ్య వాణిజ్యం 6 శాతం లోపే ఉంది. అలాగే మొత్తం ఎఫ్‌డిఐ ప్రవాహంలో ఈ ప్రాంత దేశాల మధ్య ఎఫ్‌డిఐ కేవలం 3 శాతమే’అని సుష్మా లెక్కలు చెప్పారు.
విద్య, ఆరోగ్యం, గ్రామీణ అభివృద్ధి వంటి రంగాల్లో బలమైన పురోగతిని సార్క్‌దేశాలు సాధించినప్పటికీ ఇప్పటికీ ప్రపంచంలో పేదరిక రేఖ దిగువున్న వారి సంఖ్య దక్షిణాసియాలోనే ఎక్కువన్నారు. ఆహార భద్రత, ఆరోగ్యం, పౌష్టికాహార కల్పన వంటి అంశాల్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నామని చెప్పారు. దీన్ని బట్టిచూస్తే వ్యక్తిగతంగా ఈ ప్రాంతంలోని దేశాలు అభివృద్ధి సాధిస్తున్నా పరస్పర సహకారం పెంపొందించుకోలేక పోతున్నాయన్న విషయం స్పష్టమవుతోందని విదేశాంగ మంత్రి అన్నారు. (చిత్రం) పొఖారాలో గురువారం జరిగిన సార్క్ దేశాల మంత్రుల 37వ సమావేశంలో పాల్గొన్న భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్