అంతర్జాతీయం

27న పఠాన్‌కోట్‌కు పాక్ దర్యాప్తు బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడి

పోఖరా, మార్చి 17: పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దాడి జరిగిన ప్రదేశాన్ని పాకిస్తాన్‌కు చెందిన సంయుక్త దర్యాప్తు బృందం (జెఐటి) ఈ నెల 27న సందర్శిస్తుందని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ గురువారం మీడియాకు చెప్పారు. నేపాల్‌లోని పోఖరాలో పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్‌తో సుష్మా స్వరాజ్ భేటీ అయిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ‘నేను, పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల సలహాదారు సమావేశమైనప్పుడు పఠాన్‌కోట్ అంశంపై చర్చించకుండా ఎలా ఉంటాం? ఆ అంశం చర్చకు వచ్చింది’ అని సుష్మా స్వరాజ్ అన్నారు.
సుష్మా స్వరాజ్‌తో భేటీ గురించి సర్తాజ్ అజీజ్ మాట్లాడుతూ ‘సార్క్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం చాలా సానుకూల వాతావరణంలో జరిగింది’ అని అన్నారు. భారత్, పాకిస్తాన్ ప్రధానమంత్రులు వాషింగ్టన్‌లో భేటీ అవుతారని తాము విశ్వసిస్తున్నామని ఆయన చెప్పారు. పఠాన్‌కోట్ వ్యవహారంలో ముందుకు సాగడం, ఈ అంశంపై సహకారం విషయంలో తాము సత్ఫలితాలు వస్తాయనే విశ్వాసంతో ఉన్నామని సర్తాజ్ అజీజ్ చెప్పారు.(చిత్రం) నేపాల్‌లోని పోఖరాలో పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్‌తో సుష్మా స్వరాజ్ భేటీ అయిన దృశ్యం