ఆంధ్రప్రదేశ్‌

భూమి చదును ఘటనలో ముగ్గురి సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 10: కేంద్ర రాజధాని లింగాయపాలెంలో రైతు రాజేష్‌కు సంబంధించిన 7.30 ఎకరాల అరటి తోటను చదును చేసిన వ్యవహరంలో విఆర్‌ఓ, విఆర్‌ఎ, సూపర్‌వైజర్‌లను సస్పెండ్ చేయటమే కాకుండా డెప్యూటీ కలెక్టర్‌ను బదిలీ చేసినట్లు సిఆర్‌డిఎ అధికారి చెన్నకేశవరావు తెలిపారు. గురువారం సిఆర్‌డిఎ అధికారి చెన్నకేశవరావు మాట్లాడుతూ ఘటనకు బాధ్యులైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవటం జరిగిందన్నారు. లింగాయపాలెం పరిధిలో సిఆర్‌డిఎ డెప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న కె సీతారామమూర్తిని బదిలీ చేయటం జరిగిందన్నారు. విఆర్‌ఓ జి వెంకటేశ్వరరావు, విఆర్‌ఎ జి ఆనందరావు, సూపర్‌వైజర్ ఎ సుబ్రహ్మణ్యంలను సస్పెండ్ చేయటం జరిగిందన్నారు. ఆర్‌డిఓ భాస్కరనాయుడు, తాహశీల్దార్ సుధీర్‌బాబు విచారణ జరిపి నివేదిక ఇచ్చిన తరువాత చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. గురువారం రైతు రాజేష్ సిఆర్‌డిఎ అధికారి చెన్నకేశవరావును కలిసి తనకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కోరారు. ఉద్యానవన శాఖాధికారులు అంచనా వేసిన తరువాత నష్టపరిహారంపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని తెలిపారు.