జాతీయ వార్తలు

సాధ్వి ప్రజ్ఞకు బెయిల్‌ నిరాకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: మాలెగావ్‌ పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న సాధ్వి ప్రజ్ఞ సింగ్‌ ఠాకూర్‌కుజాతీయ దర్యాప్తు ఏజెన్సీ(ఎన్‌ఐఏ) ప్రత్యేక కోర్టు మంగళవారం బెయిల్‌ నిరాకరించింది. సాధ్వి ప్రజ్ఞకు వ్యతిరేకంగా ఆధారాలు లభించకపోవడం వల్ల ఆమెపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని ఎన్‌ఐఏ వెల్లడించింది. ఆమె బెయిల్‌ పిటిషన్‌పైనా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఎన్‌ఐఏ జూన్‌ 6న స్పష్టంచేసింది. బెయిల్‌ దరఖాస్తుపై విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు దానిని తిరస్కరించింది. ఓ బాధితుడి తండ్రి సయ్యద్‌ నిసార్‌ అహ్మద్‌ ఆమె బెయిల్‌పై అభ్యంతరం వ్యక్తంచేస్తూ పిటిషన్‌ దాఖలు చేశారు. మహారాష్ట్రలోని మాలెగావ్‌లో 2008లో జరిగిన పేలుళ్లలో 8 మంది చనిపోగా, 100 మందికి పైగా గాయపడ్డారు.