స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-11

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
‘భగవానుణ్ణి దర్శించేందుకు అసలాయనకు రూపముంటే కదా? అందుకే ఆయన ఎవరి కంటికి కనబడడు’ అని పేర్కొంది. మరి మహర్షులెందరో ఆయనను దర్శించామని చెబుతారు కదా! వారి కది ఎలా సాధ్యమయింది? ఈ సందేహానికి సమాధానాన్ని అదే ఉపనిషత్తులో...
హృదా హృదిస్థం మనసా య ఏనమేవం విదుమతాస్తే భవంతి
పరమాత్మ ఉండే స్థానం జీవుల హృదయ కమలం. మనస్సు మరియు హృదయాలను అంతర దృష్టితో చూచినపుడే భగవద్దర్శనమవుతుంది అని సూచించింది. నిజమే కదా. హృదయంలో ఉన్నవానిని హృదయంలోనే అనే్వషించక బయట అనే్వషిస్తే ఎలా కానవస్తాడు? కాబట్టి మానవులారా! దైవాన్ని హృదయంలోనే అనే్వషించి దర్శించండి.
సమస్త సత్య విద్యలకు ఆదిమూలం భగవానుడే
దేవాశ్చిత్తే అసుర్య ప్రచేతసో బృహస్పతే యజ్ఞియం భాగమానశుః
ఉస్రా ఇవ సూర్యో జ్యోతిషా మహో విశే్వషామిజ్జనితా బ్రహ్మణామసి
భావం: సర్వజీవ ప్రాణాదారా! సర్వజనరక్షకా! జ్ఞానశ్రేష్ఠా! ఏ రీతిగా సూర్యుడు స్వయంగా ప్రకాశిస్తూ అంతట తన కిరణజాలాన్ని వెదల్లుతూ ఉంటాడో అదే రీతిగా జ్ఞానులకు వేద విజ్ఞానాన్ని విశేషంగా అనుగ్రహిస్తున్నావు. వివరణ: జ్ఞానప్రవాహానికి జన్మస్థానం భగవానుడే. ఈ విషయానే్న శుక్ల యజుర్వేదం- సప్రథమో బృహస్పతిశ్చికిత్వాన్- మహామహాలోకాలకు - లోకాంతరాలకు ప్రభువైన బృహస్పతి ప్రథముడు- ముఖ్యుడు అయిన మహాజ్ఞాని అని వర్ణించింది. ఈ అంశానే్న ప్రస్తుత వేద మంత్రం ‘విశేషా మిజ్జనితా బ్రహ్మణామసి’ సమస్త సత్య విద్యలకు మూలాధారం మరియు సర్వ వేదాలకు ప్రప్రథమ సృష్టికర్త భగవానుడేనని పేర్కొంది. అంటే ఆ భగవానుడే ప్రథమః చికిత్వాన్- మొదటి జ్ఞాని అయినపుడు సమస్త జ్ఞానాలకు మరియు వానికి మూలమైన వేదాలకు ప్రథమ జనకుడు ఆయనే కావడం సహజమని భావం.కాంతి కిరణాలు సమస్త లోకాలను ప్రకాశింపజేస్తాయి. కాని ఆ కిరణాలు ఎక్కడినుండి వస్తాయి?
సూర్యుని నుండియే కదా. అందుచేత సూర్యుడే కాంతి కిరణాలకు జనకుడు. కాంతి ఎక్కడెక్కడున్నా అది సూర్యునిదే. ఇదే రీతిగా జ్ఞానమెక్కడుందో అది పరమాత్మునకు చెందిందే. నిజానికి జ్ఞానం భగవానుని వరప్రదానం.
సూర్యుడు స్థిరంగా ఒక చోటనే ఉండి ప్రకాశిస్తూ ఉంటాడు. అందుచేత సూర్యునికి ఎదురుగా ఉన్న గ్రహాలు- ఉపగ్రహాలు సూర్యకాంతి చేత ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ విధంగా ఎదురుగా గాక పరాఙ్మఖంగా ఉన్న గ్రహాదులకు సూర్యకాంతి సోకక ప్రకాశించవు. భగవంతుడు సూర్యునివలె ఒక చోటనే ఉండి ప్రకాశించువాడు కాక అంతటా వ్యాపించి ప్రకాశించేవాడు కాబట్టి పరమాత్ముని జ్ఞానప్రకాశమంతట వ్యాపించియుంటుంది. ఎవరి మనస్సులోనైనా పాపం చేయాలనే భావం కలిగిన వెంటనే అది చేయరాదనే ఒక సందేశం అంతరంగికంగా పలుమార్లు ధ్వనిస్తూ ఉంటుంది. ఆ సందేశమెవరిదో కాదు. దైవానిదే. ఆ విధంగా జ్ఞాన ధ్వని దైవానికి ప్రతినిధిగా ప్రతి వ్యక్తిలో ధ్వనిస్తూ ఉంటుంది.
ఈ దృష్టితోనే దయానంద సరస్వతి తమ సత్యార్థ ప్రకాశములో ‘పాపకార్యాచరణకు పూనుకొన్న మనిషి హృదయంలో కలిగే భయం- శంక- సిగ్గు- మొదలైన భావాలన్ని స్వయంగా అతని హృదయంలో ఉండే భగవంతుడు వినిపించేవే’’ అని హెచ్చరించాడు.
..........................ఇంకావుంది