స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం -- 22

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
(22)

తన వద్దగల ధనంతో ధనపతియైన భగవంతుడు ఏమి చేసుకొంటాడు? ఇంత మాత్రం కూడ దాచుకోకుండా సర్వమూ తాను సృష్టించిన జీవులకే త్యాగం చేస్తాడు. అలా త్యాగం చేయడం కారణంగానే భగవంతుడు ధనపతి- బ్రహ్మణస్పతి అయ్యాడు. భగవంతుడైనా లోభగుణం చేత దాని నెవరికీ దానం చేయకుంటె అతడు దుఃఖాలను పొందుతాడు. ఆకలిగా ఉంది. అంగడిలో ఎన్నో పండ్లున్నాయి. కాని లోభి ధనాన్ని వెచ్చించి వానిని కొని తినలేడు. అప్పుడేమవుతుంది? ధనముండి కూడ ఆకలితో నకనకలాడి బాధపడవలసినదేగా! ధనమిచ్చి పండ్లు కొను. కొని తిను. ఆకలి తీరుతుంది. శాంతిగా ఉంటుంది. ధనాన్ని త్యాగం చేస్తేనే శాంతి లభిస్తుంది. కాబట్టి భగవదారాధకులు ‘‘స ఇజ్జనేన... భరతే ధనా’’ దానిని పరోపకారానికి వెచ్చించేందుకే ధనాన్ని సంపాదించి తమవద్ద భద్రపరచుకొంటారు. అంటే ‘తమ సర్వస్వమూ పరులకే త్యాగం చేస్తారు’అని భావం.
అట్టి త్యాగికే పుత్ర పౌత్రాదులు, ధన ధాన్యాలు, సుందర భవనాలు సమకూరతాయి. అట్టి దాతవద్దకు దేశాధిపతులు సహితం వచ్చి ఆశ్రయిస్తారు. అతడు కేవలం తన ధనానే్న కాదు పుత్ర- పౌత్రాదులను కూడ పరోపకార నిమిత్తమై త్యాగంచేస్తాడు. అలా త్యాగం చేసేందుకే ధనం సంపాదిస్తాడు. కాళిదాసు ‘‘త్యాగాయ సంభృతార్థానామ్’’ (రఘువం.1-7) అని చెప్పింది ఇదే. బ్రహ్మణస్పతి (పరమాత్మ)వలన ధనమే కాదు జ్ఞానం కూడ లభిస్తుంది. భక్తుడి కాయన దానిని కూడ అనుగ్రహిస్తాడు. అలా భగవద్భక్తులకు ప్రసాదింపబడిన పరిజనం, ధనం, జ్ఞానం వారి స్వార్థానికికాక పరార్థం కొఱకు మాత్రమే. ఈ విషయాన్ని ఈ క్రింది మంత్రంలో మరింత విస్పష్టంగా వివరింపబడింది.
యో అస్మై హహవ్యైర్ఘృ తవద్భిరవిధత్ప్ర తం ప్రాచా నయతి బ్రహ్మణస్పతిః
ఉరుష్యతీమంహసో రక్షతీ రిషోంహోశ్చిదస్మా ఉరుచక్రిరద్భుతః॥ ఋ.2-26-4.
శ్రద్ధాయతుడైన ఏ జ్ఞాని త్యాగబుద్ధితో ప్రవర్తించే ఉత్తమ పురుషుణ్ణి సమాదరిస్తాడో ఆ జ్ఞానిని భగవంతుడు ముందుండి అతనిని అభ్యుదయ మార్గంవైపు నడిపిస్తాడు. అతనికి పాప చింతన నుండి నిత్యమూ రక్షణ కల్పిస్తాడు. ఆ విధంగా ఆ జీవుని రక్షించే కార్యంలో కార్యసాధకుడైన ఆ మహాపురుషుడు అతనిని కుసంస్కారంనుండి సంరక్షించి తీర్చిదిద్దుతాడు. భగవంతుడు జీవులందరిని అగ్రగాములుగా తీర్చిదిద్దుతాడు. ఎవరు భగవంతుని ఆరాధిస్తారో వారు నిజంగా ఉన్నతిని పొందగలరు.
మానవుల అంతరంగంలో పాపచింతన ప్రబలంగా కలుగుతూ ఉంటుంది. హింసాప్రవృత్తి కూడ మొలకెత్తుతూ ఉంటుంది. అట్లే హీనమైన కోరికలు కూడ పుడుతూ ఉంటాయి. వారి బారిన పడకుండ పరమాత్ముడే రక్షిస్తూ ఉంటాడు. అట్లు రక్షింపబడినవారు పాపవిముక్తులే. ఎవరు భగవంతుని శరణువేడుకొంటారో వారు విముక్తులు కాగలరు. అంటే దుఃఖాల నుండి విడివడగలరు. దుఃఖమంతటికి కారణం పాపమే. దుఃఖాల నుండి విముక్తులు కావాలని ఎవరు కోరుకోరు? దుఃఖాల నుండి దూరం కావాలంటె పాపకార్యాచరణ వీడాలి. అసలు పాపానికి మూల మజ్ఞానమే.

ఇంకావుంది...