స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-111

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైదిక ధర్మం యజ్ఞ ప్రధానమైనది. యజ్ఞాన్ని విడిస్తే వైదిక ధర్మం నిస్తేజమూ - నిర్జీవమూ అయిపోతుంది. పూర్వమీమాసంకులు ధర్మానికర్థం యజ్ఞంగానే చెబుతారు. దీనిని బట్టి ధర్మమూ యజ్ఞమూ సమానార్థకాలే అని గ్రహించాలి. యజ్ఞ స్వరూపాన్ని గురించి శుక్ల యజుర్వేదం ‘యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్- ‘‘ఆధ్యాత్మిక తత్పరులైన మహర్షులు యజ్ఞం ద్వారా యజ్ఞపురుషుణ్ణి ఆరాధించారు. అదే ప్రధాన ధర్మమైనది’’ అని నిస్సంశయంగా వచించింది. అయితే యజ్ఞకర్మ ఎప్పుడారంభమైంది? అసలు యజ్ఞమంటే ఏమిటి?
యజ్ఞమంటే ఆత్మ సమర్పణయే. ఈ మంత్రం కూడా ‘యజ్ఞేన వర్ధత జాతవేదసమగ్నిమ్’- ‘‘యజ్ఞం ద్వారా అనగా ఆత్మ సమర్పణ ద్వారా సర్వజ్ఞుడైన పరమాత్మ మహిమను వృద్ధిపరచుము’’ అని ఇదే భావాన్ని అనువదిస్తూ ఉంది. భగవానుని మహిమ అజ్ఞేయం, అప్రమేయం, నిత్యం, ప్రవర్థమానం అయి యుండగా దానిని క్రొత్తగా వృద్ధిపరచడమేమిటి? అంటే- తాము ఆస్తికులుగా ఉండటమే కాక దైవ విద్వేషకులను, నాస్తికులను సహితం దైవ ప్రేమికులుగా, ఆస్తికులుగా చేయడమే భగవన్మహిమను ప్రవృద్ధం చేయడమనే దానికర్థం.
దీనిని బట్టి రాక్షస స్వభావాలను, నాస్తికులను అత్యాచారం మరియు క్రూర పద్ధతుల చేత గాక ప్రేమచే భగవత్ ప్రేమికులుగా చేయాలన్నదే వేదాభిమతంగా భావించాలి.
ఈ విధమైన యజ్ఞానికి అవసరమైన సాధన సామగ్రి ఏమిటి? ‘యజధ్వం హవిషా తనా గిరా’ - హవిస్సు, శరీరం, సంతానం మరియు వాక్కులు యజ్ఞ సామగ్రియే. వానితో యజ్ఞం చేయి అని వేదం పేర్కొంటూంది. యజ్ఞంలోని అగ్నికి సమర్పించబడేది హవిస్సు. ధనం కూడా ఈయబడగలిగేది కాబట్టి అది కూడా హవిస్సే.
పరోపకారార్థంగా ఇచ్చే ధనదానం కూడా యజ్ఞమే. ధర్మప్రచారం మరియు విద్య ప్రచారాలకు ధనాన్ని వ్యయం చేయడం కూడా యజ్ఞమే. లోకంలో ధనంమీద వ్యామోహమధికంగా ఉంటుంది. అందుకే అట్టి ధనాన్ని త్యాగం చేయడం ఒక యజ్ఞమే. యజ్ఞాన్ని గురించి మీమాంసలు ‘దేవతోద్దేశే్యన ద్రవ్యత్యాగో యాగః’ దేవతల నుద్దేశించి చేసే ద్రవ్య త్యాగం యజ్ఞమేనని నిర్వచించారు. అంటే యజ్ఞ కార్యంలో త్యాగభావనయే ప్రధానమైనదని భావం. ధనం రెండు విధాలు. స్థూల సాంయోగికం మరియు సూక్ష్మ సాంయోగికం అని. శరీర సంబంధమైనది స్థూల సాంయోగికం. ఆత్మ సంబంధమైనది సూక్ష్మ సాంయోగికం. ఇల్లు, వాకిలి, పశువులు, ధనం, వస్త్రం, సువర్ణం ఇత్యాదులు స్థూల సాంయోగిక ధనం. దీనిని కొంతవరకు సులభంగా త్యాగం చేయవచ్చు. ఈ విధంగా త్యాగశీలత అభ్యాసమయితే క్రమంగా దైహికమైన ఈ వస్తువుల కంటే ఆత్మ భిన్నమన్న జ్ఞానం స్థిరపడుతుంది. ఇది ఒక విశేషధనం. ఈ ధనాన్ని సహితం పరోపకారం మరియు ధర్మప్రచారాలకు వినియోగించేందుకు బుద్ధి త్యాగానికి సిద్ధపడుతుంది. అదే మహాత్యాగంగా ఆత్మ సమర్పణగా పరిణమిస్తుసంది. ఈ ఆత్మ సమర్పణమే యజ్ఞం.
ఈ విధంగా ధనంతోపాటు మాటను కూడా పరోపకారార్థంగా వినియోగించుట కూడా ఒక త్యాగమే. మనిషి ఒక్కొక్కప్పుడు అట్టి త్యాగం చేస్తాడు. కాని దానిని గురించి అందరి ఎదుట చర్చించడం అంటే శ్లాఘించడం మాత్రం త్యాగం చేయడు. అంటే చేసిన త్యాగాన్ని గూర్చి స్వయంగా అందరితో ప్రశంసాపూర్వకంగా చెప్పుకోవడం. దానిని మాని ఇతరులకు మేలు చేయడమే వాక్ త్యాగం. అంటే వాగ్యజ్ఞం. ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు