స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-117

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్యం దాని కర్తను సూచిస్తుంది. రచన ఎంత సుందరంగా ఉంటుందో దాని కర్త కూడ అంత సుందరుడని సులభంగా గ్రహించవచ్చు. లోకంలోని వస్తుజాలాన్ని విచారిస్తే ఈ ఆలోచనా సరళిలో తప్పక పడిపోతాం. ఒక్క భూమిని తీసుకోండి. ఎంత గొప్ప వైజ్ఞానికుడైనా నే నీ పృథివినంతా తెలుసుకొన్నానని చెప్ప సాహసింపగలడా? ఒక మట్టిగడ్డను నీటిలో వేయండి. అది వెంటనే కరిగిపోతుంది
. ఇది సహజ ధర్మం. భూమి చుట్టూ నీరుంది. అంతకుమించిన నీరునేల మీద- నేల లోపల కూడ ఉంది. కాని భూమి మునిగిపోతుందా? అగ్ని దహింపచేస్తుంది. కాని శరీరంలోని అగ్ని శరీరాన్ని బ్రతికిస్తుంది. ఆకును చూడండి. ఎంత సూక్ష్మమైన సృష్టి అది!!
మనిషి శరీరమెంత అద్భుతమైనది!! ఏ వైజ్ఞానికుడైనా ఈ శరీర రహస్యాన్ని సంపూర్ణంగా తెలుసుకోగలిగాడా? సృష్టిలోని ప్రతి పదార్థమూ ఒక దానినిమించి మరొకటి అద్భుతమైనవి. మరి వానిని సృష్టించినవాడు ఎంత బుద్ధివైభవం కలవాడు అయి ఉంటాడు? మనిషి దానిని ఊహించనైనా ఊహించలేడు. ఈ ఊహ చేసేందుకు ప్రయత్నిస్తే మనిషి విఫలుడు కావడం తథ్యం.
**
యజ్ఞ- ఉత్సవాలలో భగవత్సంకీర్తన
ఇమాం తే ధియం ప్ర భరే మహో మహీమస్య స్తోత్రే ధిషణా యత్త ఆనజే
తముత్సవే చ ప్రసవే చ సాహహిమింద్రం దేవాసః శవసామదన్నను॥
ఋ.1-102-1॥
భావం:- నీ శ్రేష్ఠమైన బుద్ధినుండి ఏ భగవన్నుతి విద్య జనించిందో దానిని భక్తుడవైన నీకు అనుగ్రహిస్తున్నాను. విద్వాంసుడైన జ్ఞాని ఆ స్తుతి విద్యతో సంతోష సమయాలలో మరియు యజ్ఞాలలో భగవంతుణ్ణి లక్ష్యంగా చేసికొని యథాశక్తిగా స్తుతించి ఆనందమగ్నుడవుతాడు.
వివరణ:- జ్ఞానులందరకు భగవంతుడే పెన్నిధి. ఆయన జ్ఞానులకే కాదు సమస్తమైనవారికి సన్నుతి, ప్రార్థన, ఉపాసనా రీతులను ఉపదేశిస్తాడు. భగవత్ కృపవలన ఏ భాగ్యశాలికి మహనీయమైన స్తుతి విద్య హృదయ గోచరమైనదో ఆతడు వౌనంగా ఉండజాలక దానిని ఇతరులకు ప్రీతితో ఉపదేశిస్తాడు. అట్టి భక్తుడికే ఘనమైన స్తుతి విద్యను అనుగ్రహిస్తానని భగవానుడే ‘ఇమాం తే ధియం ప్ర భరే మహో మహీమస్య స్తోత్రే’ అని స్వయంగా వాగ్దానంచేసాడు. స్వగృహంలోనే ఉన్నా భగవంతుడే స్వయంగా గురురూపంగా వచ్చి స్తుతివిద్యను అంటే భగవద్భక్తిని అనుగ్రహిస్తే ఆ వ్యక్తికంటె భాగ్యశాలి యెవడుంటాడు? భాగ్యశాలియైన ఆ విద్వాంసుడు ఆ విశ్రుతాత్ముణ్ణి సదా స్తుతిపూర్వకంగా గానం చేస్తూనే ఉంటాడు. ‘తముత్సవే...శవసామదన్నను’అని ఉత్సవాలలో, యజ్ఞాలలో యథాశక్తిగా ఆ భాగ్యశాలి త్రిలోకాత్ముని యశస్సును గానం చేస్తాడని ఆ భాగ్యశాలి సచ్చరిత్రను వేదం స్తుతించింది.
ఆ విధంగా భగవత్కృపచే స్తుతివిద్యను పొందిన ఆ భాగ్యశాలురు తమకు అబ్బిన వైభవమంతా ఆ విశ్వయోని అగ్రహించినదేనని భావిస్తారు. జీవితంలో హర్షామోద సందర్భాలు సంభవిస్తే అమృతవపుని కృపాదత్తమైనవన్న కృతజ్ఞతాభావంతో వినమ్రులైపోతారు. తత్‌క్షణం ప్రమత్తులు గాక దైవస్తుతి పరాయణులై తన్మయులవుతారు. భక్త్భివంతో ‘త్వాం దేవేషు ప్రథమం హవామహే’ (ఋ.1-102-9) ‘‘ఓ దేవా! దేవతలకే అధిదేవుడవైన నినే్న స్మరిస్తాము’’. ఎందుకంటె- ‘త్వం బభూథ పృతనాసు సాసహిః’ (ఋ.1-102-9) ‘‘మా జీవన సమరంలో శక్తివంతుడవైన నీవే మాకు సహాయకుడవు’’ అంటూ పలురీతులుగా ప్రశంసిస్తూ దైవం మ్రోల ప్రణమిల్లుతారు. ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు