స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-120

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
సామాన్య జనులు వారిలోనెవరిని అనుసరించాలో బోధపడక తికమకపడుతున్నారు. ఆధ్యాత్మిక సాధకుల ముందున్న ఈ పరస్పర విరుద్ధ ఆధ్యాత్మిక మార్గాలను విభిన్న విధివిధానాలను బోధించే వాటిలో ముఖ్యంగా దేనిననుసరించాలో దేనిని విడిచిపెట్టాలో తెలియక అయోమయంలో పడిపోతున్నారు. ఇలా సామాన్యులేకాదు సత్యమైన వైరాగ్యభావనతో పుత్ర కళత్రాదులను విడిచి వైరాగ్య జీవనాన్ని అభిలషించే జ్ఞానమార్గానే్వషకుల సహితం ఈ అయోమయ పరిస్థితిలోనే పడిపోతున్నారు. అయితే సామాన్యులకంటె ఆత్మ జ్ఞానాభిలాషుల బుద్ధి సూక్ష్మమైనదికదా వారుమాత్రం ‘ఇంద్రమూతయే గుః’ ఆధ్యాత్మిక సన్మార్గోపదేశం కొఱకు పరదైవమైన ఇంద్రుని ఆశ్రయించారు. వారి విశ్వాసమేమంటే- ‘నూ చిత్తాన్ త్సద్యో అధ్వనో జగమ్యాత్’ తత్‌క్షణమ్ ఆయన సన్మార్గోప దేశికుడైన తన్మార్గాన్ని చేర్చగలడని. దేవతలు ససితం ఇదే విధంగా జగద్గురు స్వరూపుడైన దేవాధిదేవునే ఆశ్రయిస్తారు. ఆ పరదైవం ‘దేవాసో మన్యుం దాసస్య శ్చమ్నంతే’ చరణాశ్రయు-లైన దాసభక్తుల క్రోధాన్ని అనగా క్రోధంవలన జనించిన పాపజాలాన్ని అపహరించివేసాడు. దైవం దాసజనుల పాప సంహారుడన్నది అందరికి అనుభవంలోని విషయమేకదా. అలా దాసుల పాపసంహరణం చేయడం ఒకసారి కాదు దైవం ‘సా సహి’= మాటిమాటికి చేయడం ఆయన సహజ స్వభావం. ఆ ఆశ్రీత జనుల కల్యాణసిద్ధికొరకు దైవం వారి పూర్వజన్మ కృత అపరాధాలను స్మరింపక శుభప్రదుడై వారి లక్ష్యసిద్ధికై ఏరికోరి సన్మార్గ సాధనలను ప్రబోధిస్తాడు. అందుచేత ఆ పరదైవంతో నిత్య సత్సంగంగల దేవతలు సహితం ‘న ఆ వక్షన్ త్సువితాయ వర్ణమ్’ జీవుల కల్యాణసిద్ధికొఱకు తమ దయాస్వభావాన్ని వీడరు లేదా ఉత్తమ ఆధ్యాత్మిక ప్రబోధానికి మనమెంచుకొన్న సాధనాలనే వినియోగిస్తారు.
**
తద స్యేదం పశ్యతా భూరి పుష్టం శ్రదింద్రస్య ధత్తన వీర్యాయ
స గా అవిందత్సో అవింద దశ్వాన్‌త్స ఓషధీః సో అపః స వనాని॥
॥ ఋ.1-103-5॥
భావం:- ఓ మానవుడా! ఆ భగవంతుని జగత్పోషణశక్తిని చూడు. శక్తిసామర్థ్యాలకొఱకు దైవమైన ఇంద్రుని ఎడల శ్రద్ధాళువైయుండు. ఆ దైవం పృథివి, సూర్య మండలాదులను, ఓషధులను, వనాలను, జలాన్ని సకలజీవుల పోషణకై సిద్ధపరచును.
వివరణ:- సకల జీవులకు బలం- శక్తిసామర్థ్యాలు కావాలి? అవి ఎక్కడనుండి, ఎలా లాభిస్తాయి? అని అనే్వషించే వారిని ‘బలమసి, బలం మే దాః స్వాహా’ (అథర్వ వేదం.2-17-3) ఓ ప్రభూ! నిజంగా సత్యమైన బలస్వరూపుడవు నీవే. దయతో నాకు బలమిమ్ము అని దైవాన్ని ప్రార్థించమని అథర్వవేదం బోధిస్తూంది. అదే త్రోవలో ఋగ్వేదంకూడ ‘్భరిత ఇంద్ర వీర్యమ్’ (ఋ.1-57-5) ‘‘ఓ ఇంద్రా! నీ బలమనంతం’’. కాబట్టి మానవులారా! జ్ఞానులారా! ‘శ్రదింద్రస్య ధత్తన వీర్యాయ’ బలసమృద్ధికొఱకు ఇంద్రునిపై విశ్వాసముంచి ప్రార్థించండి’’ ఆ ఇంద్రుడు ఎంతటి బలసంపన్నుడు!! ‘అను తే ద్యౌర్బృహతీ వీర్యం మమ ఇయం చ తే పృథివీ నేను ఓజసే’ (ఋ.1-57-5) ఈ విశాలమైన ఆకాశం మరియు భూమి నీ అనంత బల సంపన్నతను అణచివేసేందుకు ప్రయత్నించింది. కాని అవి అసమర్థమై నీ ముందు మోకరిల్లాయి అని దైవ బల సంపత్తిని శ్లాఘించి ఆయనను ప్రార్థించమని ప్రబోధించింది ఋగ్వేదం.
ఋగ్వేదమే తాను వర్ణించిన అపార దైవ బలసంపన్నత విశ్వసనీయమైనదా అన్న సందేహం ఎవరికైనా కలుగుతుందేమోననే శంకతో కాబోలు ‘తస్యేదం పశ్యతా భూరి పుష్టమ్’ ఈ అఖండ విశ్వాన్ని అపార శక్తిసామర్థ్యాలతో పాలించే ఆ దైవపాలనా నిపుణతను మీరే చూడండి అంటూ నిర్ణయభారాన్ని వేద విశ్వాసులకే వదలివేసింది. ఔను నిజమే. పరిశీలిస్తే మనకే భగవచ్ఛక్తి సామర్థ్యాలు బోధపడతాయి. ఈ విశ్వమెంత విశాలమైనది! ఎంత మహత్తమమైనది! ఈ బ్రహ్మాండంలో వందల కోట్ల సౌర మండలాలున్నాయి. వాటి ఖచ్చితమైన సంఖ్య నేటివరకు కనుగొనలేకపోయారు. ముందు కాలంలో కూడ ఏమో! ఋగ్వేదంలో ‘సప్తదిశో నానా సూర్యాః’ (ఋ.9-114-3) ఈ సప్తదిశలలో అనంత సూర్య మండలాలున్నాయి. అని ఎప్పుడో కనుగొంది. ఈ అనంత సౌర మండలాలలో మనం నివసించే ఈ సౌరమండలం వైశాల్యమెంత అనేది ఇంతవరకు మనకు తెలియనే లేదు. ఈ అనంత బ్రహ్మాండాలలో ఎనె్నన్ని జీవులు! గణింప సాధ్యమా? ఈ అసంఖ్యాక జీవకోటి సంరక్షణ పాలన చూచే ఆ దైవభక్తి సామర్థ్యాలెంత మహత్తరమైనవో మనమే ఊహించుకోవాలి. మరి ఆ కోటానుకోట్ల జీవరాశుల నిత్యజీవితావసరాలెన్నో ఊహించగలమా? అన్నింటికి లోటు లేకుండ ఆ దైవమే ‘సగా అవింధత్సో...వనాని’ సకల జీవోపయోగకరంగా జలాలు, వనాలు, ఇలా ఎనె్నన్నో సమకూరుస్తున్నాడని శ్రుతి దర్శించి చెబుతూంది. అలా నిత్యమూ సమకూర్చేందుకు దృష్టిపెట్టే ఆ దైవమెంతటి మహత్తరమైనదో కదా!
- ఇంకావుంది...