స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-129

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ సర్వభూత నివాసుడు ‘ప్ర వీర్యేణ దేవతాతి చేకితే’ (ఋ.1- 55-3) సర్వశక్తిమంతుడు కావడంవలన దేవతలకంటె, మహాదానవీరుల కంటె మరియు దివ్యగుణసంపన్నుల కంటె మిన్నగా పరిగణింపబడతాడు. అం దుచేత
అధా చ న శ్రద్ధ్ధతీ త్విషీమత ఇంద్రాయ (ఋ.1-53-5)
జ్ఞానక్రియాబల తేజఃసంపన్నుడైన భగవానుని ఎడల భక్తికలిగి ఏకాంతంగా ఆయనను భజించి నీలోని బల- వీర్య- పరాక్రమ- జ్ఞాన- ధ్యానాదులకు యోగ్యమైన జ్ఞానోపదేశాన్ని గ్రహించు.
ఓ ఐశ్వర్యాభిలాషీ! నీ దేహమనేక కర్మల సుక్షేత్రం!
అంటే అప్రక్షితం వసు బిభర్షి హస్తయోరషాళ్హం సహస్తన్వి శ్రుతో దధే
ఆవృతాసో- వతాసో న కర్తృభిస్తనూషు తే క్రతవ ఇంద్ర భూరయః॥
ఋ.1-55-8॥
భావం:- జీవితంలో ఐశ్వర్యాన్ని కోరుకొనేవాడా! నీ చేతుల నిండుగా నశింపని అపార ధనముంది. అట్లే నీ శరీరంలో ఇతరులుచేత పరాజితం కానట్టి శక్తిసంపన్నత ఉంది. రక్షకులచేత సంరక్షింపబడుతున్న నిధులవలె నీ శరీరంలో కర్మలు అనేక మావరింపబడియున్నాయి.
వివరణ:- ఓ ఐశ్వర్యాభిలాషీ! ధనంకోసం అక్కడాఇక్కడ వెదుకుతావెందుకు? చూడు ‘అప్రక్షితం వసు బిభర్షి హస్తయోః’ నీ చేతులనిండా నశింపని అపార ధనముంది. నీలా చేతినిండా ధనమున్నవాడు ‘అయం మే హస్తో భగవాన్’ (ఋ.10-60-12) ‘‘నా చేయియే ఐశ్వర్యవంతమైనది’’అని అంటున్నాడు విన్నావా? అందుచేత చేయి విదిలించు ధనవర్షం కురుస్తుంది. అయితే శక్తిలేదు. చేతిని ఎలా విదిలించను అంటావా? అరే! ఇది నీకు తెలియదా?
‘అషాళ్హం సహస్తన్వి శ్రుతో దధే’ నీ ఒంట్లో ఇతరులచేత పరాజితం కానట్టి అపారమైనశక్తి ఉందని? నీవెప్పుడైనా చూచుకున్నావా? ‘ఆవృతాసో- వతాసో న కర్తృభిస్తనూషు తే క్రతవ ఇంద్ర భూరయః’ నీ శరీరంలోగల కోశాలన్నింటిని సంరక్షిస్తున్న పలు కార్యకర్తలు చాలామంది పనిచేస్తూ ఉన్నారని, చూడు. ఎప్పుడూ తెరచియుంచి కళ్లు పనిచేస్తూ ఉన్నాయి. చెవులు రిక్కించి నిలిచి వింటూ ఉన్నాయి. ముక్కు మూసుకోకుండా వాసనను గ్రహిస్తూనే ఉంది. చర్మం క్షణం విశ్రాంతి తీసుకోకుండా స్పర్శను తెలుపుతూనే ఉంది. నాలుక ఏమరుపాటు లేకుండా రుచిని తెలుపుతూనే ఉంది. ప్రాణాలు క్షణం తీరికలేకుండా శరీరంలో సంచారంచేస్తూనే ఉన్నాయి. మనస్సు అలసిపోకుండ క్షణక్షణం ఏదో ఆలోచిస్తూనే ఉంటుంది. ఆలోచించి చూడు. ఇవన్నీ ఎప్పుడూ పనిచేస్తున్నాయా? లేదా? ఈ సందర్భంలోనే శుక్ల యజుర్వేదం ‘సప్త ఋషయః ప్రతిహితాః శరీరే సప్తరక్షంతి సదమప్రమాదమ్’ (శు.య.వే.34-55)
శరీరమనే గృహంలో సప్తర్షులు కూర్చుని అజాగ్రత్తలేకుండా గృహాన్ని సంరక్షిస్తున్నారని అలంకారికంగా వివరించింది. వారు కేవలం పనిచేసే కార్యకర్తలు మాత్రమేకాదు. ద్రష్టలు. అంటే-చూచేవాళ్లు మరియు దారి చూపేవాళ్లు కూడ. మహామహులైన ఋషులచేత సంరక్షింపబడుతున్న నీవు సంరక్షింపబడకుంటే మరెప్పుడు ఎవరిచేత రక్షింపబడతావు? రక్షింపబడాలంటే ‘తనుషు తే క్రతవ ఇంద్ర భూరయః’ నీ శరీరంలో అనేక కార్యక్షేత్రాలున్నాయి. వాటిని సంరక్షించుకో. పాడుచేసుకోవద్దు. ఈ శరీరంతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా ఈ శరీరం భోగానికి ప్రధాన సాధనంగా ప్రసిద్ధం. అలా భోగంతోబాటుగా మోక్షానికి కూడ ఈ శరీరమే ద్వారమని అందరు అంగీకరిస్తారు. సావధానంగా ఈ దేహాన్ని వినియగించుకొని ప్రయోజనాన్ని పొందు.
**
ప్రాణ సంచారాన్ని ఎవరైనా విన్నారా?
యద్ధ యాంతి మరుతః సం హ బ్రువతే- ధ్వన్నా
శృణోతి కశ్చిదేషామ్‌॥ ఋ.1-37-13॥
భావం:- శరీరంలో ప్రాణాలు సంచారంచేస్తున్న సమయంలో అవి తమ మార్గాన్ని తెలుపుతూ ఉంటాయి. కాని ఆ మార్గాన్ని ఎవరో కొద్దిమంది మాత్రమే గుర్తిస్తారు.
వివరణ:- ఈ విశ్వం విచిత్రాలకు పుట్టినిల్లు. అలాగే ఈ మానవ శరీరం కూడ సర్వాలంకృతమైన ఈ అద్భుతాలయం. శరీరంలోని కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ప్రతి ఒక్కటి ఏదో ఒక వస్తువుమీద ఎంతో ఆసక్తి కలిగియుంటాయి. కళ్లకు రూపంమీద వ్యామోహం. చెవులకు శబ్దాలపైన ఆసక్తి. నాలుకకు రుచుల మీద అభిరుచి. ముక్కుకు సుగంధం మీద ప్రీతి. చర్మానికి యోని మీద ఆశ. ఈ విధంగా రూపాదులు నేత్రాది జ్ఞానేంద్రియాలను ప్రలోభ పరచి వాటికిగల ప్రధానకర్తవ్యాల నుండి పతనానికి గురిచేస్తాయి. ప్రాణాలు మాత్రం వీనివలె వేరే వస్తు- ద్రవ్యాలమీద ఆసక్తి కలిగి యుండవు.
అత్యంత సుందర రూపాలు, మధురమధుర శబ్దాలు తీయతీయని పదార్థాలు, సుకుమారమైన స్పర్శ, మనోరంజకమైన సువాసనలు ఇవేవీ ప్రాణాలకు గల విధ్యుక్త కర్తవ్యాలనుండి ప్రక్కకు మరలించలేవు. దీనిని వివరించే ఒక సుందర కథనం శుక్లయజుర్వేదంలో ఇలా చెప్పబడింది.
‘తత్ర జాగృతో అస్వప్నజౌ సత్రసదౌ చ దేవౌ’ (శు.య.వే.34-55)
‘‘నిద్రించువారి శరీరంలోని సప్తర్షులను (ఐదు జ్ఞానేంద్రియాలు బుద్ధి మనస్సు) ఎన్నడూ నిద్రింపని ప్రాణ- అపానములనబడే ప్రాణదేవతలు సంరక్షిస్తూ ఉంటారు. ‘‘కళ్లు కునుకుపాట్లవలన మూతపడతాయి. నాలుక రుచులు చూచి చూచి విసిగిపోతుంది. ఇలా జ్ఞానేంద్రియాలన్ని అలసటకు గురిఅవుతాయి. కాని ప్రాణాలో! అలయక సొలయక సదా జాగరూకమై సంచారంచేస్తూనే ఉంటాయి. అవి నిజంగా శరీరానికి చాలా బలిష్ఠమైన కాపలాదారులు. జీవుల కాప్రాణాలెంత హితకారులంటే-
యద్ధయాంతి మరుతః సం హ బ్రువతే- ధ్వన్నా!
శరీరంలోని తమ సంచారాన్ని జీవులకు ఎప్పటికప్పుడు తెలుపుతూనే ఉంటాయి.
నిద్రిస్తున్న ఒక పసిబిడ్డను గమనించండి. ఆ బిడ్డ ప్రాణాలెక్కడనుండి యెక్కడకు సంచరిస్తున్నాయో తెలుస్తుంది. నాభివరకు వచ్చి తదుపరి ఊర్ధ్వముఖంగా ప్రాణసంచారం జరుగుతున్నట్లు స్పష్టంగా కనబడుతుంది. ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు