స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం -- 24

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు

యూయం గావో మేదయథా కృశం చిదశ్రీరం చిత్‌కృణుథా సుప్రతీకమ్‌
భద్రం గృహం కృణుథ భద్రవాచో బృహద్వోవయ ఉచ్యతే సభాసు॥ అథర్వ. 4-21-6::
‘ఆవులు బలహీనుణ్ణి కూడ బలశాలిగా చేస్తాయి. కళావిహీనుణ్ణి సహితం సుందరునిగా తీర్చిదిద్దుతాయి. బారవాలుచేసే ఆవులు గృహాలను శుభప్రదంగా చేస్తాయి. పండిత సభలలో గోమహాత్మ్య తథా ప్రశంసింపబడుతూ ఉంటుంది’అని కీర్తించింది. ఇలా కీర్తించిన అథర్వణవేదం గోపాలన గురించి కూడ ప్రస్తావించింది.
ప్రజావతీః సూయవసే రుశంతీః శుద్ధా
అపః సుప్రపాణే పిబంతీః॥ అథర్వ. 4-21-7॥
దూడలతోకూడిన గోవులు మంచి గోసంరక్షకుని పోషణలో పుష్టిగా ఉంటాయి. అవి మంచి ప్రదేశాలలోని నీటినే త్రాగుతూ ఆరోగ్యంగా ఉండాలి.
నేడు గోసంరక్షకు లీ వేదోపదేశాన్ని విస్మరించారు. ఇప్పుడు గోవులకు మంచి గోపాలురు లేరు. మంచినీరు లభించే వ్యవస్థలేదు. ఈ రెండూ గోవులకు లభించాలి. ‘స్వ ఆ దమే సు మఘా యస్య ధేనుః’’ (ఋ.2-35-7) మన గృహంలో, సమాజంలో మంచి పాలనిచ్చే గోవులు ఉండాలని వేదం చెప్పింది.
గోక్షీరం వలన దుర్బలులు బలవంతులుగా, కళావిహీనులు సుందరులుగా కాగలరు. నిజమే అట్టి ప్రయోజనాలను పొందదలచినవారు ఆవులకు తమ ఇండ్లలో మంచి పోషణ కల్పించాలి. అట్లు సంరక్షింపబడిన ధేనువుల పాలను త్రాగి మనుషులు నీటిలోని విద్యుత్తు వలె ప్రకాశమానులై వెలిగిపోగలరని ఈ మంత్రం గోమహాత్మ్యాన్ని చాటుతూంది.
* * *
18. కార్యనిపుణుడే సృష్టికర్త
స ఇత్ స్వపా భువనేష్వాస య ఇమే ద్యావాపృథివీ జజాన
ఉర్వీ గభీరే రజసీ సుమేకే అవంశే ధీరః శచ్యా సమైరత్‌॥ ఋ.4-56-3.
ప్రతిపదార్థం:- యః = ఎవడు; ఇమే= ఈ; లోకాః= ప్రకాశమానమూ మరియు ప్రకాశ శూన్యమూ అయిన; లోకాః= లోకాలను (అధ్యాహార్యం); దదాన= సృష్టించాడో; తథా= అదే రీతిగా (అధ్యాహార్యం); ఉర్వీ= బలిష్ఠమైన పెద్దదియైన; గహరే= బాగా లోతైన; సుమేకే= అందమైనట్టి; అవంశే= పొడవైన కఱ్ఱతో చేయబడిన స్తంభమేదీ లేకుండ; రజసీ= ద్వావాపృథివీ లోకాలు రెండింటిని; ధీరః= బుద్ధివైభవం కలిగి; శచ్యా= స్వసామర్థ్యంతో, సమ్+ఏరత్= తగిన గతులనిచ్చి వాటిని తమ కక్ష్యలలో సంచరింపచేస్తున్నాడో, సః+ఇత్= అతడే; భువనేషు= సర్వలోకాలలో; సు+అపాః= స్వపాః= ఘనకార్య నిపుణుడై, అశి= ఉన్నాడు.
భావం:- ఎవడు ఈ ద్వావాపృథివీ లోకాలను సృష్టించి అవి సుస్థిరంగా నిలిచేందుకు క్రింది భాగాన ఆధారం బలంగా బాగా లోతుగా పాతబడిన పెద్దస్తంభమేదీ ఏర్పరచకనే వాటికి తగిన గతులను కల్పించి అవి తమ తమ కక్ష్యలలో (్యఇజఆఒ) సుస్థిరంగా తిరిగే విధంగా స్వసామర్థ్యంతో చేసాడో అతడే సర్వలోకాలలో గొప్ప ఘనకార్యాన్ని చేసిన భగవానుడై యున్నాడు.
వివరణ:- పరమాత్మ ఈ మంత్రంలో స్వపా=ఘనకార్య నిపుణుడుగా వర్ణించబడ్డాడు. ఎందుకంటె- స్వయంప్రకాశకమైన, ప్రకాశరహితమైన (ద్వావాపృథివీ) లోకాల నెన్నింటినో ఆయన సృష్టించాడు. కాని అవి తమ తమ పరిధులలో తిరగాలి కదా. మరి అలా తిరగాలంటె వాటి క్రింద ఏదైనా బలమైన ఆధారమేదైన ఉండాలి కదా! కాని భగవానుడారీతిగా కల్పించకనే అవి తమ తమ కక్ష్యలలో తిరిగే విధంగా ఏర్పరచాడు.

--ఇంకావుంది...