స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-136

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతుడిని మేమేవిధంగా పూజించగలం?
వివరణ:- భగవానుడు సర్వజ్ఞుడు. ఆయనకు ఎవరికేది అవసరమో ఎవరేయే చర్యలు చేస్తున్నారో తెలియకుంటుందా? జీవులకు భుక్తిమరియు ముక్తిని ప్రసాదించే బహుయజ్ఞ స్వరూపుడగు ఆ దైవం చేయని అద్భుత కార్యముంటుందా? అట్టి అద్భుత కార్యశీలి - మహోపకారి మరియు దయాళువుఅయిన లోకనాథుడిని ఏవిధంగా పూజించాలి? ఈ మంత్రంలో ఆ పూజావిధానాన్ని వివరించడం జరిగింది. అదేమంటే ‘ప్రేదు తా తే విదథేషు బ్రవామ’ ఆయన ఉత్తమ ఘనకార్యాలను సభలలో నోరార నుతించాలి’’ సభలలోనే కాదు ప్రతి వ్యక్తి సమక్షంలో నోరు నొవ్వే విధంగా శ్లాఘించాలి. ఋగ్వేదమే మరో సందర్భంలో-
అగ్నిం స్తోమేన బోధయ సమిధానో అమర్త్యమ్ (ఋ.5-14-1)
‘‘నీవు నిస్సంకోచంగా మనస్ఫూర్తిగా భగవానుని స్తోత్ర సముదాయంతో స్తుతించి ప్రసన్నుని చేసుకొమ్ము’’ అని పునరుద్ఘాటించింది. ఈ మంత్రమూ మరియు ‘ప్రేదు తా...’ అనే రెండు మంత్రాలలో చెప్పబడిన భగవంతుని యశోగానం సమానమే అయినా విశేషమేమంటే ఆ యశోగానం ‘సమిధానః’ ‘‘నిష్కపటంగా స్వేచ్ఛగా నీవంత నీవు భక్త్భివంతో ఉత్సాహంగా’’ భగవద్గుణ గానాన్ని చేయుమని విశేష సూచన చేయబడింది. మనుస్మృతిలో కూడ మనువు ఈ విషయానే్న ఇలా ప్రతిపాదించాడు.
ఫలం కతకవృక్షస్య యద్యప్యంబు ప్రసాదకమ్‌
న నామగ్రహణాదేవ తస్య వారి ప్రసీదతి॥ (మనుస్మృతి. 6-67)
ఇండుపగింజ (చిల్లగింజ) గంధం మురికి నీటిని తేటపరుస్తుంది. కాని దాని పేరునుచ్చరిస్తే నీరు తేటపడుతుందా?
ఇదే విధంగా భగవన్నామం పతితపావనమయినా కేవలముచ్చరణ మాత్రంచేత జీవులను పవిత్రంచేయదు. భగవద్గుణాల చేత పరవశుడై స్వయంగా పై మంత్రంలో చెప్పిన రీతిగా ‘సమిధానః’- స్వయంప్రభావితుడు (వివరణకు పై పేరా చూడుడు) కావాలి. తాత్పర్యమేమంటే జగన్నాథుని సహస్ర కల్యాణ గుణాలను గాంచి స్వయంప్రేరితుడవై ఆయనను ఆరాధించాలన్న భక్త్భివం కలిగేముందు ఆయన కల్యాణగుణాలనుగాంచి స్వయంప్రేరితుడవై ఆయనను ఆరాధించాలన్న భక్త్భివం కలిగేముందు ఆయన కల్యాణగుణాలను స్వయంగా అలవరచుకొనే కనీస ప్రయత్నం చేయవలసియుంది. అంటే ఆ సర్వేశ్వరుని అగణ్య కల్యాణ గుణాలను ఆంతరంగా పెంపొందించుకొనుటయందే మానవుల శ్రేయస్సు ఇమిడియుంది. ఆధునిక ఋషియైన దయానందులు సత్యార్థప్రకాశంలో హృద్యంగా ఈ విషయాన్ని వర్ణించి ఇలా చెప్పాడు.
‘‘మనిషి సర్వేశ్వరుణ్ణి భక్తితో ఏదికావాలని ప్రార్థిస్తాడో దానిని సాధించేందుకు అతడు ముందుగా తానెంత ప్రయత్నంచేయగలడో అంత ప్రయత్నమూ చేయాలి. అంటే ప్రార్థించే పనికెంత ప్రయత్నంచేయగలడో అంతాచేసిన తరువాతనే ప్రార్థనచేయాలి... ధర్మాచరణుడైన వానికి భగవంతుడేవిధంగా తోడ్పడతాడో అలాగే ప్రయత్నశీలికి లోకంలో అందరు సహాయపడతారు... ఆవిధంగా దైవం తనను ప్రార్థించేవారి ధర్మబద్ధమైన వాంఛితాలను తీర్చేందుకు ఉత్సాహపడతాడు. ‘‘బెల్లం తీయగా ఉంటుంది’’అని పలికేవాడికి బెల్లమూ మరియు దాని రుచి అనుభవమూ రెండూ లభించవు. కాని బెల్లంకోసం ప్రయత్నించి పొందినవాడికే బెల్లమూ మరియు రుచి రెండూ ప్రాప్తిస్తాయి.
సత్యార్థ ప్రకాశం 7వ సముల్లాసం.
ఈ చర్చవలన తెలిసే విషయమేమంటే- పదార్థాల స్వరూప, స్వభావ, గుణాలను తెలిసికోవడంచేత మాత్రమే ప్రయోజనం సిద్ధించదు. వానిని సంపాదించి అనుభవించినపుడు మాత్రమే ప్రయోజనముంటుంది. అదే విధంగా పరమాత్మ గుణజ్ఞానం మరియు గుణగణనమాత్రం చేత శ్రేయస్సు కలుగదు. ఆ కల్యాణధాముని అగణిత గుణ విశేషాలలో ఏ కొన్నింటినైనా మనవుడు జీవితంలో తాను అలవరచుకొన్నప్పుడే జీవన సాఫల్యం సిద్ధిస్తుంది. అదే నిజమైన భగవదారాధన అవుతుంది.
**
దైవమొక్కడే
సకల సృష్టి కార్యనిర్వాహకుడు
ఏతా విశ్వా చక్రువా ఇంద్ర భూర్యపరీతో జనుషా వీర్యేణ
యా చిన్ను వజ్రిన్ కృణవో దధృష్వాన్న తే వర్తా తవిష్య అస్తి తస్యాః॥
ఋ.5-29-14॥
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు