స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-137

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
ఓ ఇంద్ర! నీవొక్కడవే సృష్టిలోని సమస్తకార్యాలను సహజమైన నీ శక్తి- సామర్థ్యాలతో అనేక రీతులుగా చేసావు. ఓ వజ్రధారీ! ఏ కార్యాలను నీవు ఏ శక్తిసామర్థ్యాలతో శీఘ్రంగా చేసావో వానిని ఎవరూ కూడ పూర్తిగా స్వాధీనపరచుకోలేదు. మరియు అణచిపెట్టలేదు.
వివరణ:- భగవంతుడు ఊహాతీతమైన, అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించి ప్రతి దినమూ ఎనె్నన్నో నూతన వస్తు- పదార్థ జాలాన్ని సృష్టిస్తున్నాడు. దీనినంతా ఆయనొక్కడే ఏ ఒక్కరి సహాయ- సహకారాలు లేకుండా నిర్వహిస్తున్నాడు. ఆ దైవంలో ఉన్న అపార విశ్వనిర్మాణశక్తి ఎవరిచేత అణచివేయబడరానిది. మరియ స్వాధీనపరచుకొన శక్యంకానిది. అని భగవానుని అపారశక్తి సామర్థ్యాలను వర్ణించిన ఋగ్వేదమే చాలా సందర్భాలలో ఇలా వర్ణించింది.
తువి సుష్మ తువిక్రలో శచీవో విశ్వయామతే ఆ ప్రప్రాథ మహిత్వనా॥ (ఋ.8-68-2)
భావం:- ‘‘ఓ మహాబలా! మహాకర్మిష్ఠీ! ఓ బుద్ధిశాలీ! ఓ మహాజ్ఞానీ! నీవు నీ శక్తిసామర్థ్యాలచేత సృష్టిని బహుధా వ్యాపింపచేస్తావు.’’
విశ్వస్మా దింద్ర ఉత్తరః (ఋ.10-86-1)
‘‘దైవం అన్నింటికంటె అందరికంటె మహత్వపూర్ణుడు’’
నకిరస్య శచీనాం నియంతా సూనృతానామ్‌ నకిర్వక్తా న దాదితి॥ (ఋ.8-32-15)
‘‘్భగవంతుని సత్యమైన, రమణీయమైన శక్తులను నియంత్రించేవాడు గాని, ఆయనకు సమకూర్చేవాడుగాని, చెప్పగలిగినవాడు గాని లేడు.’’
భగవచ్ఛక్తి సత్యమైనది. అంటె కాలగమనం చేత నశించేది కాదు. భూత- భవిష్యత్ - వర్తమానాలలో ఏకరీతిగా సమర్థవంతమై యుండునది. ఆ కారణంచేత ఆ శక్తినెవడూ నియంత్రించజాలడు. శక్తి అపారమైనది కావడం కారణంగా దానినెవరు నోటితో ఇట్టిదని చెప్పజాలరు. ఔను. జీవుడు అల్పజ్ఞుడు. మరణశీలుడు. అట్టివాడు అనంతశక్తి ధరుడిని ఎలా వర్ణించగలడు?
ఋగ్వేదమేకాదు అథర్వణవేదం కూడ ఆదిదేవుని శక్తిసామర్థ్యాలను గురించి ఇలా వర్ణించింది.
న మే దసో నార్యో మహిత్వావ్రతం మీమాయ యదహం ధరిష్యే॥ అథర్వ.5-11-3
‘‘నేను పూనికతో చేసే ఏ వ్రతాన్ని అయినా(కార్యమైనా) నా మహత్వశక్తి కారణంగా ఏ దాసుడు గాని, ఏ ఆర్యుడు గాని నివారింపలేడు.’’
కాబట్టి లోకనాథుడు తాను చేయదలంచిన పని మంచిదయినా, చెడుదయినా ఆయన తప్ప మరెవ్వడు చేయజాలడు. ఆయన మాత్రమే చేయగలడు. ఇట్టి విశ్రుతాత్ముని అనుపమశక్తి వైభవాన్ని అథర్వవేదమిలా పేర్కొంది.
న తత్తే అన్నో అనువీర్యం శకన్న పురాణో మఘవన్నోత నూతనః॥ అథర్వ.20-17-5
‘‘ఓ ఇంద్రా! పూర్వుడు గాని నవీనుడు గాని నీ శక్తిని అనుకరించజాలరు.’’
విశ్వాధారుని ఇట్టి శక్తిసామర్థ్యాలను ‘వర్తా’ఎవరూ స్వాధీన పరచుకొనజాలరని చెప్పినమాట చాల గంభీరమైనది. భగవానుడు వహించే అపార దయాగుణాన్ని, శక్తిసామర్థ్యాలను సాధు- సంత జనులుకూడ వహింపలేరని వేదాంత దర్శనంలో వేదవ్యాసుడు (్భరతకర్త కాదు)-
భోగమాత్ర సామ్యలింగాచ్చ (వే.ద.4-4-21) ‘‘ముక్తజీవుడికి భగవంతునితో సమానమైన ఆనందానుభవం లేదు’’అని చెప్పాడు. ఇక సామాన్య లౌకిక జనుల మాట చెప్పేదేముంటుంది?
ప్రశ్న ఏమంటే- ముక్తజీవుడు సమస్త సాధనోపాయాలనుండి విముక్తుడయితే అతడు భగవంతుడుగా గాని, భగవంతుడితో సమానుడుగా గాని ఏల పరిగణింపబడడు? అని. వ్యాసుడు దీనికి సమాధాన మీవిధంగా ఇచ్చాడు- నిజమే జీవుడు ముక్తినిపొందిన తత్‌క్షణమే కర్మబంధన రహితుడయ్యాడు. కాని కర్మబంధనాల శూన్యత ఆరంభమైన కారణంగా ఎప్పుడో ఒకప్పుడు వాటి పూర్తి నాశనం జరిగే అవకాశం సంభవించవచ్చు. ఆ దశలోగూడ ఆ జీవుడింకా అల్పజ్ఞుడు. అల్పసామర్థ్యంకలవాడు కావడంచే అతడు పరమాత్మ నిష్ఠుడై పరమాత్మ సంబంధమైన ఆనందాన్ని అనుభవించేందుకు అధికారి కావచ్చుగాని భగవానునిలోని ఆనందత మరియు సృష్టి రచనాది శక్తిసామర్థ్యాలు మాత్రం పొందేందుకు ఎన్నడూ సమర్థుడుకాడు. కాబట్టి భగవదపారగుణగణాలు ఎంతటివారైన కూడ స్వాధీనపరచుకొనజాలని అజేయగుణాలే.
**
ఆత్మ ఎక్కడ? దానినెవడు చూసాడు?
క్వ స్య వీరః కో అపశ్యదింద్రం సుఖరథమీయమానం హరిభ్యామ్‌
యో రాయా వజ్రీ సుత సోమమిచ్ఛంతదోకో గంతా పురుహూత ఊతీ॥
ఋ.5-30-1॥

ఇంకావుంది...