స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-141

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యా తే తనూర్వాచి ప్రతిష్ఠితా యా శ్రోత్రే యా చ చక్షుషి
యా చ మనసి సంతతా శివాం తాం కురు మోత్క్రమీః॥
(ప్రశ్నోపనిషత్తు. 2-12)

భావం:- ‘‘ఆత్మా! విస్తారమైన ఏ నీ శక్తి నాలుకలో, చెవులలో, కళ్లలో మరియు మనస్సులో వ్యాపించి వారిని కల్యాణకారకమైనవిగా చేస్తున్నదో ఆ శక్తితో నీవు ఈ శరీరంనుండి నిష్క్రమిస్తే ఇంద్రియాలకు శరీరంలో స్థానమేది?’’ నిజానికి చక్షు-శ్శోత్ర- జిహ్వాదులకు సహజమైన శక్తి ఎక్కడుంది? ఉన్నదనుకొన్న శక్తి ఆత్మనుండి వచ్చింది. కాబట్టి శరీరమూ మరియు ఇంద్రియాల శక్తి అంతా ఆత్మ శరీరంలో ఉన్నంతవరకు మాత్రమే. ఈ సత్యాన్ని తెలుసుకొంటే ఆత్మ శక్తిసామర్థ్యాలెట్టివో సులభంగా బోధపడుతుంది. అప్పుడే ఆత్మకు శరీరం, ఇంద్రియాలు ఎందుకు భయపడతాయో అర్థమవుతుంది.
**
ఆత్మయే పాపాన్ని నశింపచేస్తుంది
తుభ్యే దేతే మరుతః సుశేవా అర్చంత్యర్కం సున్వంత్యంధః
అహిమోహాసమప ఆశయానం ప్ర మాయాభిర్మాయినం సక్షదింద్రః ॥

భావం:- ఓ సూర్య సమానమైన ఆత్మా! శరీరంలో ఉండే సుఖదాయకమైన ప్రాణాలు నినే్న సదా పూజిస్తూ ఉంటాయి. అవి నీకు అన్నభోగాన్ని కల్పిస్తూ ఉంటాయి. నిరంతరమూ సన్మార్గాన్ని వీడి-ఏవేవో దుష్కర్మలలో వ్యాపకమై హింసాప్రవృత్తికలిగిన బుద్ధినుండి పాపస్వభావాన్ని దెబ్బకొట్టి పారద్రోలివేస్తావు.

వివరణ:- ‘మరుత్’శబ్దానికి ప్రధానమైన అర్థం ‘చచ్చేది, చంపేది’అని. ఇంక ప్రాణం, ఋత్విక్కు, సైనికుడు, వాయువు ఇలా ఎన్నో లాక్షణికార్థాలున్నాయి. ఆత్మకు- సదా పాపంతో యుద్ధం తప్పదు. అందుకు దానికి పోరాట పటిమగల సైన్యమవసరం.
ఆ సైన్యం ప్రాణసమూహమేనని వేదం ‘తుభ్యే దేతే మరుతః సుశేవాః అర్చంతి’ ‘‘ప్రాణాలు నిన్ను సదా పూజిస్తున్నాయి’’అని రమణీయంగా చెప్పింది. సత్యమేమంటే ప్రాణాలున్నవి ఆత్మ సేవ కొఱకే. ఆ సేవలో భాగంగా ప్రాణాలు ఆత్మకు సమస్త భోగ సామగ్రిని సమకూరుస్తున్నాయి.
ఎలాగంటే- జీవులేవేవి తిని, త్రాగుతాయో వాటినన్నింటిని శరీరానికి అవసరమైన ధాతువులుగా ప్రాణాలే తయారుచేస్తాయి. ఈ విషయానే్న ప్రశ్నోపనిషత్తు రెండవ ప్రశ్నలో రమణీయంగా ఇలా వర్ణించింది.

తుభ్యం ప్రాణ ప్రజాస్త్విమా బలిం హరంతి యఃప్రాణైః ప్రతితిష్ఠసి॥ 7॥
వయమాద్యస్య దాతారః పితా త్వం మాతరిశ్వనః 11॥

భావం:- ‘‘ప్రాణాధారమైన ఓ ఆత్మా! నీవు ‘‘ప్రాణాలతో కూడ శరీరంలో ఉన్నంత కాలమూ జనులందరు నీకు కానుకలర్పిస్తారు. నీవు అనుభవించదగిన సమస్త భోగాలను సమకూరుస్తారు. ప్రాణ స్వరూపమైన ఆ వాయువునకు నీవు తండ్రివి.’’ దీనినిబట్టి ఆత్మప్రాణాలతో కూడి శరీరంలో ఉన్నంతవరకూ ఆత్మకు భోగ సంపద లభ్యమవుతుంది. ఆత్మప్రాణాలను వీడినంతనే అవి నిరాశ్రయమవుతాయని స్పష్టమైనది.
పాపభావన మనిషి కర్మలలో చొరబడి యుంటుంది. మన నడవడిలో దుర్మార్గత గుప్తంగా ఉంటుంది. లోక వ్యవహారం చాల చిత్రంగా ఉంటుంది. లోకంలో ప్రతి మనిషి అహింస గొప్ప ధర్మమని అంటాడు. దానితోబాటు మారణాయుధాలను గూడ ఎన్నింటినో సమకూర్చుకొంటాడు. అవి ఎందుకురా?
అని ప్రశ్నిస్తే ప్రపంచంలో శాంతి స్థాపించాలంటే ఈ పాటి మారణాయుధాలు అవసరమని చెబుతాడు. అహింసా స్థాపనకు హింసయే అవసరమయితే ‘హింసా తు పరమో ధర్మః’ హింస పరమ ధర్మమని సమ్మతింపవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. పాపభావం చాలా మాయావి. ధూర్తమైనది. పుణ్యరూపాన్ని ధరించి మనుషుల మనసులలో ప్రవేశిస్తుంది. దానిని గుర్తించి చంపగలిగినది ఒక్క ఆత్మ మాత్రమే. ‘అహిమోహానమప.... .... సక్షదింద్రః’ ‘‘సన్మార్గాన్ని వీడి, దుష్కర్మలలో వ్యాపకమైన ధూర్తమైన పాప స్వభావాన్ని దండించి దాన్ని ఆత్మబుద్ధినుండి తరిమివేయగలదు’’అని వేదం ఆత్మశక్తిని ప్రకటించింది.
మనస్సునుండి పాపాన్ని తరిమివేసే ఉపాయాన్ని యోగదర్శనం ప్రతిపక్ష భావన అని వ్యవహరించింది. ‘వితర్క బాధనే ప్రతిపక్ష భావనమ్’ (యో.ద.2-33) అన్న సూత్ర వ్యాఖ్యలో వ్యాసదేవుడీ విధంగా వివరించాడు.
1. ఏవ మున్మార్గప్రవణవితర్కజ్వరేణాతి దీప్తేన బాధ్యమాన స్తత్ప్రవిపక్షాన్ భావయేత్‌
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు