స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-142

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ విధంగా పొందిన శక్తివలన ‘దేదిష్టే ఇంద్ర ఇంద్రియాణి విశ్వా’ ‘ఆత్మ సర్వేంద్రియాలకు మార్గదర్శకమవుతుంద’ని ఈ మంత్రం వివరిస్తూంది. అంటే ఆత్మ ఇంద్రియాలను తనకిష్టమైన మార్గాల వైపునకు నడిపించుకొని వెళ్లగలదని భావం. కాకుంటే దుర్బలమైన ఆత్మను ఇంద్రియాలు తమ ఇష్టానుసారంగా ఎక్కడికైనా ఈడ్చుకొనిపోగలవు. బలీయమైన ఆత్మ ఆవిధంగా ఇంద్రియాలు లాగుకొనిపోయే ముళ్లబాటనెన్నడూ పట్టదు. అంతేకాక ఆత్మే ఆ ఇంద్రియాలకు-
ప్రాచోదయత్సుదుఘావవ్రే. ‘‘ఉత్తమ ప్రేరణనిచ్చి వానివలన ఉత్తమ ఫలాలననుభవిస్తుంద’’ని వేదం ఉద్ఘాటిస్తూంది. ఆ విధంగా సఫలమైన ఆత్మను సంబోధిస్తూ వేదం-
అంతర్వి జ్యోతిషా సంవవృత్వత్తమో- వః
‘‘ఆంతరంగా బలీయంగా వ్యాపించిన అజ్ఞాన తమస్సును జ్ఞాన ప్రకాశంచేత తరిమికొట్టు’’మని మహోపదేశమిస్తూ ఉంది. ఇదే ఉపదేశాన్ని శుక్ల యజుర్వేదం కూడ-
ఉద్వయం తమసస్పరి స్వః పశ్యంత ఉత్తరమ్‌
దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమమ్‌॥ శు.య.వే..20-21.
‘‘మేము అజ్ఞానాంధకారాన్ని విడిచి దానిద్వారా మహోన్నతమైన జ్ఞానజ్యోతిని పొంది ప్రకాశాలకే ప్రకాశకమైన విశ్వాత్మరూపమైన సర్వోన్నత భగవత్ప్రకాశాన్ని పొందెదముగాక’’అని విన్పించింది.
కాంతి చాల బలదాయకమైనది. ఎందుకంటే చీకటి భయాన్ని, వెలుగు నిర్భయాన్ని కలిగిస్తుంది. అందుకే కాంతి బలదాయకమైనది. కాంతులలో జ్ఞానకాంతి మిన్న. జ్ఞానప్రకాశాలలో ఆత్మజ్ఞానప్రకాశం సర్వోన్నతం. మనిషి శరీరందృష్ట్యా ఎలాంటి బలవంతుడు కాకపోయినా జ్ఞానబలం చేతనే ఏనుగు మొ. బలిష్ఠ జంతువులచేత- సింహం మొ. క్రూర జంతువులచేత ఇష్టానుసారంగా పనులను చేయించుకోగలుగుతున్నాడు. ఇదే విధంగా ఆత్మ జ్ఞాన సంపన్నుడు లక్షలాది మనుష్యులను తన వెంట త్రిప్పుకోగలుగుతున్నాడు. కాబట్టి మనిషి అన్నివిధాల బలాన్ని సంపాదించుకోవాలి. దానికోసం భగవానుణ్ణి ఆశ్రయించాలి.
**
నిన్ను కోరుకొనేవారే సంతృప్తులు
యే చాకనంత చాకనంత నూ తే మర్తా అమృత మో తే అంహ ఆరన్‌
వావంధి యజ్యూరుత తేషు ధేహ్యోజో జనేషు యేషు తే స్యామ॥
ఋ.5-31-13॥
భావం:- ఓ జీవనాధారా! ప్రభూ! ఎవరైతే నినే్న కోరుకొంటారో వారు మాత్రమే నిత్యసంతుష్టులు. వారు ఎన్నడు పాపాన్ని పొందరు. అట్టి యాజ్ఞికులనే లేదా భక్తులనే నీవు కోరుకొంటావు. మేమే భక్తుల లేదా యాజ్ఞికులతో కలిసి నీకు చెందిన వారమైపోతామో వారికి తేజస్సును శక్తిని ఇమ్ము.
వివరణ:- దీనబంధో! దయాసింధో! ప్రపంచంలోని సమస్త పదార్థాలను అనుభవించాను. వానిలో దేనియందు కూడ స్థిరమైన- శాశ్వతమైన రసం= ఆనందానుభూతి మాత్రం లేదు. నీయందు సదా భక్తిగలవారు ‘‘రసం హ్యేవాయం లబ్ధ్వా ఆనందీ భవతి’’(తైత్తిరీయ ఉపనిషత్తు 2-7) ‘‘మనిషి రసాన్ని పొంది ఆనందమగ్నుడవుతాడు’’ అని నాతో చెప్పారు. మరి నేనా రసాన్ని ఎక్కడనుండి పొందగలను? అప్పుడు నీ భక్తులు ‘రసో వై సః’(తై.ఉ.2-7) ‘‘పరమాత్మయే రసమ’’ని చెప్పారు. ప్రాణాలకు ప్రాణమైన పరమాత్మా! నీవు రసుడవు. నేనో నీరసుడను. అయ్యో! ఇదేమి మాట!! నాకు రసమే కావాలి. దైవమా!! నీవేమంటావు? ‘యే చాకనంత చాకనంత నూ తే’ నిన్ను కోరుకొన్నవారే సంతృప్తులు. మరి నాలో అట్టికోరికయే లేదా? నిజంగాలేదు. ఎందుకంటె నిన్ను కోరినవారు మాత్రమే కోరినవారు. నేనూ కోరుతున్నాను. కాని నిన్ను కాదు. ఈ సంసారాన్ని దయతో సంసారవాంఛను నాలోనుండి తొలగించు. ప్రభూ! ఈ సంసారానికి చెందిన సర్వకామనలను అంతంచేసావు. కాదు కాదు. మనసునే ఏ కామనలు లేని దానిగా చేసేసావు. అయినా మనస్సు తిరిగి పూర్వంవలె కోరికలలో నిమగ్నమయ్యింది. అవి నీకు సంబంధించినట్టివే. అందుకే నా మనస్సు రసాన్ని అందుకొని ఆనందమగ్నమయింది.
ఓ ప్రభూ! నామొర నొక్కదానిని విను. ‘మో తే అంహ ఆరన్’ ‘‘నీ భక్తులకు పాపాలు సంభవింపకుండుగాక’’, పాపఫలం దుఃఖమే. ఓ ప్రభూ! వారి దుఃఖమూలాన్ని ఉన్మూలనం (నాశనం) చేయి. ఓ దైవమా! మరియొక విన్నపం ‘వావంధి యజ్యూన్’ ‘‘నీ భక్తులను నీ యాజ్ఞాకులను అభిమానించు. దానివలన వారు నీ సత్సంగాన్ని వీడకుండా ఉంటారు. నీవు చూపే సన్మార్గానే్న అనుసరిస్తూ ఉంటారు. నీయందలి అచంచలమైన ప్రేమబంధంలో చిక్కుకొని వారు పాపఫలాలనుండి రక్షింపబడతారు.
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు