స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-146

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇది ‘అస్మై ఇత్ ఇంద్రాయ’ = అన్న ప్రస్తుత మంత్ర వచనానుసరం కేవలం ఈ జీవుని కొఱకు రచింపబడినదే. ఈ వేద కావ్యంలోని వచః= వచనాలు అంటే మంత్రాలు- సూక్తాలు అన్ని ఉక్థ= నోటితో చెప్పదగినవి. అంటే పఠన- పాఠనయోగ్యాలు. అందుచేత శంస్యమ్= ప్రశంసార్హమైనవి. ఏ జీవుడు (వ్యక్తి) తన సమస్త జీవితాన్ని వేదమయం చేసుకొంటాడో ‘తస్మా ఉ బ్రహ్మవాహసే గిరో వర్థంత్యత్రయః’ ఆ వేదమూర్తి- బ్రహ్మనిష్ఠుడు- జ్ఞాన స్వరూపుడి కోసమే మిథ్యా- పరుష- అసంబద్ధాలనే త్రిదోషరహితమైన వేదవచనాలు వర్ధిల్లుతూ ఉంటాయి. వేదం సమస్త వాక్కులకు మూల ప్రాణం. మొదటగా అది మానవుడికే లభించింది. వేదం ద్వారానే వాక్కు మరియు జ్ఞానం లోకంలో వ్యాపించింది. సమస్త వాక్కులకు మూలమైన వేదం మీద ప్రామాణికమైన అధికారాన్ని స్వాయత్తపరచుకొన్న వ్యక్తియే జగత్తులోని సర్వసంస్తుతులకు అర్హుడైన అధికారి అవుతాడు. అట్టివాని మహిమను సంస్తుతించేందుకే జనులందరు ఎప్పటికప్పుడు నవోనవోనే్మషమైన నూతన కావ్యాలను రచించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆ మహిమాన్వితుని కీర్తిని దూర- దూర తీరాలవరకు కీర్తిస్తూ సంచరిస్తారు. ఆస్తికుల వచనాలలో అప్పుడప్పుడు అసత్యం, కాఠిన్యం మరియు అసందర్భత అనే భాషణ దోషాలు సంభవిస్తూ ఉంటాయి. కాని బ్రహ్మనిష్ఠుల వచనాలకు ఈ త్రివిధ దోషాల స్పర్శ ఉండనే ఉండదు.
జ్ఞానమున్నవాడు దాని ద్వారా ధనధాన్యాల నార్జించగలడు. కాని బ్రహ్మవేత్త మాత్రం అసలు ధనం మీద ఆసక్తినే చూపడు. ఎందుకంటె బ్రహ్మమునే ధనంగా భావించే బ్రహ్మవేత్త దృష్టిలో లౌకికమైన ధనం ధనమే కాదు. బ్రహ్మధనాన్ని, లౌకిక ధనాన్ని ముందుంచి ఏది కావాలో బ్రహ్మవేత్తను కోరుకోమంటె తప్పక బ్రహ్మధనాన్ని మాత్రమే కోరుకొంటాడు. కారణం లౌకిక ధనం కూడ బ్రహ్మధన సంపాదనార్థమేనన్న జ్ఞానం హృదయమంతా అతడు నింపుకొన్నవాడు కాబట్టి. ఆ బ్రహ్మవేత్తకైనా శారీరక యాత్ర నడవాలంటె లౌకిక ధనమావశ్యకత ఉంటుంది. కాని అతడు బ్రహ్మధనాన్ని ఆపేక్షించినట్లు లౌకిక ధనాన్ని ఆపేక్షింపడు. కాని ఆ ధనమే అతడి వెంటబడి పరుగుపరుగున వస్తుంది.
వాస్తవానికి వేద సరస్వతి లక్ష్మీదేవిని విరోధిగా భావించదు. అంతరంగా ఈ సందేశమే ఈ మంత్రంలో ధ్వనిస్తూంది.
***
ఎవరి ధనం అందమైనది?
తవోతిభిః సచమానా అరిష్టా బృహస్పతే మఘవానః సువీరాః
యే అశ్వదా ఉత వా సంతి గోదా యే వస్తద్రాః సుభగాస్తేషు రాయః॥
ఋ.5-42-8॥
భావం:- ఓ బృహస్పతీ! ఎవరు నీ దయ పరిపూర్ణంగా కలిగి యుండి జీవితంలో విఘ్నాది బాధలు లేక పరహింసాది పీడలు లేక గొప్ప ధనవంతులై అశ్వదాతలై యున్నారో లేదా గోదానశీలురై, సుశిక్షితమైన వాక్చాతుర్యం కలిగి నిత్యమూ వస్తద్రానపరులై యున్నారో వారివద్ద నున్న ధనమే మిక్కిలి సుందరమైనది. సఫలమైనది. దైవస్వరూపమైనది.
వివరణ:- మానవుడి వద్ద ఏ ధనసంపత్తి- ఐశ్వర్యముందో అదంతా నిస్సందేహంగా దైవం ప్రసాదించిందే. బృహస్పతి శబ్దానికర్థం గొప్ప పరిపాలకుడని. లోకంలో గొప్పవాళ్లు రెండు విధాలుగా ఉంటారు. విద్య, వినయ సంపత్తి, సదాచారం మున్నగు సద్గుణాల వైభవంతో ప్రకాళించేవారు మొదటివారు కాగా రెండవవారు ధనం, ఐశ్వర్యం, అధికారం, కీర్తి మున్నగు వానిచేత గౌరవనీయులైన వారు. ఈ ఇద్దరికీ పరమేశ్వరుడే ప్రభువు. సమస్త ధనాలనుత్పత్తిచేసేవాడు, అందరకు సమానంగా ప్రదానం చేసేవాడు కూడ ఆ సర్వేశ్వరుడే. అట్టి మహదైశ్వర్యప్రదాతను స్తుతింపుడని ఋగ్వేదం మానవ సమాజానికి-
ఉపస్తుహి ప్రథమం రత్నధేయం బృహస్పతిం సనితారం ధనానామ్‌॥ ఋ.5-42-7
‘‘జగత్తులో మొట్టమొదటగా రత్ననిర్మాత (ఐశ్వర్య నిర్మాత). ధనోత్పాదకుడు జీవులకు దానిని సమానంగా ప్రదానం చేసే బృహస్పతిని మొదటగా సంస్తుతి చేయుడు’’ అని ప్రబోధించింది. లోకంలో దాతల మధ్య, విద్వాంసుల మధ్య పరస్పరం ఆదరాభిమానాలుండటం మనం గమినిస్తూనే ఉన్నాం. భగవానుడు ఒక మహాదాత. ఆయన ధనాన్ని పాత్ర- అపాత్రులను గుర్తించి యోగ్యతానుగుణంగా విభాగం చేసి వారికి దానం చేస్తారు. అందువల్ల పరదైవం ధనం సఫలవంతమైనది. ఇదే విధంగా మనిషి కూడ దైవం చేస్తున్న దానాన్ని పరిశీలించి పాత్రులైన వారికి ఆపేక్షితమైన దానిని దానం చేస్తే అట్టివారికి తప్పక భగవంతుని రక్షణ, ప్రీతి లభిస్తాయి.
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు