స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-148

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుచ్ఛ్వాన్ కామాన్ కరతే సిష్విదానః’ బహిరంగాంగా ప్రేమిస్తూ ఆంతరంగా దురాలోచనలను చేసేవాడు అని రుూ ఋగ్వేదమంత్రం చెబుతోంది.
ఆహార నిద్రా మైథునాలు మానవులలోనే కాదు పశుపక్ష్యాదులలో కూడా సహజం. మానవ జన్మనెత్తి ఆ వాంఛలనే చక్రభ్రమణంలో పడిపోతే ఇక ఆ వ్యక్తి మానవుడనిపించుకొంటాడా! మానవ శరీరమే అతడికి వ్యర్థమని దైవమిక దానిని అనుగ్రహంచడు. అట్టి నీచ స్వభావులు నీచ భావాలనే ప్రచారంచేసి మానవ సమాజాన్ని పతనంచేస్తారు. అట్టివారి నుండి అన్ని విధాలుగా మానవ సమాజానికి రక్షణ కల్పించాలి. ‘సమానశీల వ్యసనేషు సఖ్యమ్’ సమాన స్వభావుల మధ్య, సమాన బాధలుకలవారి మధ్య మిత్రత్వమేర్పడుతుంది. ఈ నీతివాక్యానుసారం లోకానికి హానికలిగించే రాక్షసులకు సహాయపడేవారు సహితం రాక్షసులే. ఈ దృష్టితో ఈ మంత్రాన్ని పరిశీలిస్తే రాక్షసుల స్వరూప స్వభావులంటే ఏమిటో అర్థమవుతుంది. చేతనులయినా అచేతనమైన వయినా, జీవ సమాజ ప్రగతి నిరోధకులందరు రాక్షుసులే.
**
వారు చూచింది మాత్రమే చెబుతారు
యాదృగేవ దదృశే తాదృగుచ్యతే సం ఛాయయా దధిరే సిధ్రయాప్స్వా
మహీమస్మభ్యమురుషామురు జ్రయోబృహత్సువీర మనపచ్యుతం సహః॥ ఋ.5-44-6॥
భావం:- ఉత్సాహవంతుడైన ఏ సజ్జనుడు మాకొఱకు తన మాటలలో నీడలా అనుసరించివచ్చే సరళత్వమూ- శుభప్రదాయకత్వమూ కలిగియుంటాడో; అట్లే ఏ మహావీరుడు మా రక్షణకొఱకై అక్షీణబల సంపన్నత కలిగియుంటాడో అతడు ఏ విధంగా చూస్తాడో దానినే తు.చ. తప్పక నోటితో చెబుతాడు.
వివరణ:- విద్వాంసులు, ధార్మికులు, సజ్జనుల శక్తి మనిషిని వెన్నంటి వచ్చే నీడలా వారి కర్మలలో ప్రకటింపబడుతుంది. ‘సం ఛాయయా దధిరే సిధ్రియాప్స్వా....సహః’ వారు తమవెంట అనుసరించివచ్చే నీడలా మంగళమయత్వాన్ని తమ కర్మలలో వహిస్తారు. అట్టి మహాపురుషుల కర్మలలో బలముంటుంది. వారి మాటల్లో శక్తిఉంటుంది. ఇక వారి పనులలో ఆకర్షణ ఉంటుందని చెప్పాలా? అంతేకాదు. అవర్ణనీయమైన వారి బలంతోబాటు శాంతిప్రదాయిని అయిన శోభ కూడ మిళితమైయుంటుంది. అంటేవారి ప్రతికార్యం పైన శుభదాయక ప్రకాశముంటుంది. ఎందుకంటె వారి ప్రతిమాట ‘అస్మభ్యమ్’ మాకొఱకు కాబట్టి. స్వార్థాన్ని వీడి లోకోపకార భావనచే ప్రేరితులై తమ బలం, పరాక్రమం, తనువు, మనస్సు, ధనం ప్రజాసేవకు సమర్పిస్తారో వారి కర్మల వెంట ‘సిధ్రయా ఛాయయా’ శుభదాయక ఛాయ అనుసరించి వస్తుంది.
ఎవరు లోక హితార్థం ప్రయత్నపరులై ఉంటారో లోకమంతా వారివెంట నడుస్తుంది. అందువల్ల వారి బలం ‘ఉరు బృహత్ సువీరమనపచ్యుతమ్’ ‘‘విశాలమై, మహత్తరమై, వీరోచితమై, అక్షయమైయుంటుంది. వారి వెంట నడిచే-మిత్రుల సంఖ్య దినదినమూ పెరుగుతూ ఉంటుంది.’’ ఆ రీతిగా పెరిగినవారంతా ఉత్తములు, శ్రేష్ఠులు, సజ్జనులు, ‘సువీరులు’ కావడంచేత ‘అనపచ్యుత’ అక్షీణ బలసంపన్నులౌతారు. వారికావైభవం సిద్ధించిన దానికి ప్రధాన కారణం ‘యాదృగేవ దదృశే తాదృగుచ్యతే’ ‘‘దేనిని చూస్తారో దానినే వారు నోటివెంట పలుకుతారు.’’ ఆ విధంగా వారు సత్యధనాఢ్యులవుతారు. అంటే వారు కేవలం విన్నదానినే పూర్తిగా విశ్వసించక మాటలలోని లోతులదాకా పరిశీలించి యథార్థాన్ని తెలిసికొనేందుకు ప్రయత్నిస్తారు. ఈ విధంగా వారి ప్రవరన్తవలన సత్యస్వరూపం కూడ బోధపడుతూంది. అదేమంటే సత్యాన్ని మాత్రమే పలకాలని నిశ్చయించుకొనేవారు ముందుగా సత్యజ్ఞానాన్ని క్షుణ్ణంగా శోధించాలి. ఎందుకంటే జ్ఞానమే సత్యవంతం కాకుంటే ఆడిన మాట సత్యమెలా అవుతుంది? సత్యం చాల మహత్తరమైనది.
**
పవిత్రమైన బుద్ధిగల వాని
మనస్సు స్థిరంగా ఉంటుంది
సముద్ర మాపామవ తస్థే అగ్రిమా న రిష్యతి సవనం యస్మిన్నాయతా
అత్రా న హార్ది క్రవణస్య రేజతేయత్రా మతిర్వద్యతే పూతబంధనీ ఋ.5-44-9
భావం:- సముద్రమే సమస్తజనులకు ఆదర్శనీయ ప్రభువు. పవిత్రతతో పరిశుద్ధమైన బుద్ధి ఎక్కడ ఎవనిలో ప్రవృద్ధమై ఉంటుందో ఆయా విషయాలలో ఎవరికి హృదయంలోని భావాలు చంచలంగా కాకుంఢా స్థిరంగా ఉంటాయో అట్టివారి యజ్ఞం లేదా పురుషార్థకార్యాలు ఎన్నడూ నిష్ఫలం కావు.
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు