స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-150

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్ఞాన- కర్మేంద్రియాల వలె ఈ జంటలోని ప్రాణం బయటనుండి లోపలికి ప్రవేశిస్తుంది. అపానం లోపలినుండి బయటకు వెళుతూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాణ-అపానాలు కూడ జ్ఞాన- కర్మేంద్రియాల జంటవలె ‘యమ్యా’ జంటయే. ఈ జంట కూడ మొదటి జంటవలె భిన్న స్వభావయుక్తమైనదయినా శరీరాన్ని సదా రక్షిస్తూ ఉంటుంది.
ఈ రెండు జంటల తల్లి ‘సంకల్పమే’ (ప్రకృతి) అయితే వీని క్రియాకలాప పరిణామం మాత్రం భిన్నభిన్నం. ఇలా ఆలోచిస్తే ఈ మానవ శరీరంలో ఇట్టి జంటలు ఎనె్నన్నో పనిచేస్తున్నట్లు ‘ద్వేయదీం... సంబంధూ’అని మంత్ర ద్వితీయవాక్యం కంఠోక్తంగా పేర్కొంది. (గ్రంథ విస్తరణ భీతి చేత ఆ జంటలు ఇచ్చట ప్రస్తావించబడలేదు.)
**
తల్లులు బిడ్డల బుద్ధిని
వికసింపచేస్తారు
వి తన్వతే ధియో అస్మా అపాంసి వస్త్రా పుత్రాయ మాతరో వయంతి
ఉపప్రక్షే వృషణో మోదమానా దివస్పథా వధ్వోయంత్యచ్ఛ॥ ఋ.5-47-6॥
భావం:- తల్లులు తమ బిడ్డల బుద్ధులను, వారి కర్మలను ప్రతిభావంతంగా తీర్చిదిద్దుతారు. కన్యలు ప్రసన్నమనస్కులై సంగమనిమిత్తం వీర్యసేచన సమృద్ధిగల యువకులను తెలివిగా చక్కని సంప్రదాయ మార్గాన పొందుతున్నారు.
వివరణ:- ఏ బిడ్డలైనా తమ తల్లిదండ్రుల ఆచారాలకు, ఆలోచనలకు, ఆహార-విహారాలకు, సంస్కారాలకు ప్రతిబింబాలుగా ఉంటారు. కారణం వారిపై వారి తల్లిదండ్రులు ప్రభావమధికంగా ఉండటమే. అయితే తల్లి ప్రభావం మాత్రం బిడ్డలమీద చాల అధికంగానే ఉంటుంది.
తల్లి బిడ్డలను శూరులుగా గాని, ధీరులుగా గాని, గంభీర స్వభావులుగాగాని, ధర్మాత్ములుగా గాని, మహాత్ములుగాగాని, విద్వాంసులుగా గాని, యోగిగా గాని ఏవిధంగానైనా చేయగలదు. అలాగే తల్లి భీరువుగాగాని- చపలునిగా గాని- పాపాత్ముడిగాగాని - మూఢునిగా గాని కూడచేయగలదు. ఎందుకంటె బిడ్డల జీవన తొలి సంధ్య తల్లి ఒడిలోనే ఆరంభమవుతుంది కాబట్టి.
తల్లి మాట, చేష్ట, నడతలన్నీ ఎంత బలహీన సంతానమైనా అనుకరిస్తుంది. ఆ విధంగా తల్లి తన బిడ్డల ప్రవర్తనను అన్నివిధాల తీర్చిదిద్దగలుగుతుంది. ఈ విషయ బాహుళ్యాన్ని అంతా వేదం సమీక్షించి ‘‘వితన్వతే ధియో అస్మా అపాంసి వస్త్రా పుత్రాయ మాతరః’’ ‘‘తల్లులు తమ బిడ్డల బుద్ధులను- కర్మలను తీర్చిదిద్దుతారు’’అని సూత్రీకరించి చెప్పింది. దానితోబాటు వేదం ‘వస్త్రా పుత్రాయ మాతరో వయంతి’ ‘‘తమ సంతానంకోసం తల్లులు వస్త్రాలను నేస్తారు’’అని కూడ మరో ముఖ్యాంశాన్ని కూడ ప్రస్తావించింది. స్థూలంగా ఈ విషయం సామాన్యంగా కనబడినా ఇందులో ఒక మహత్తర సూచన ఉంది.
నిజానికి తల్లి ఆనాటి సంప్రదాయం ప్రకాశం బహు సంతానంతో గృహ నిర్వహణ బాధ్యతను నిర్వహిస్తూ కూడ పిల్లలకు అవసరమైన బట్టలు నేయడమనే మరో కార్యభారాన్ని నిర్వహించటం ద్వారా పరోక్షంగా తమ పనిని తామే చేసుకోవాలని, అది న్యూనతగా- అధిక కార్యభారంగా తలంచరాదన్న సందేశం కూడ బిడ్డలకు అందించి వారిలో కార్యనూతనతా భావం (జశజఆక యఛి జ్ఘఇ్యఖూ) తొలగించడమే కాకుండా వృత్తి నైపుణ్యాన్ని కూడ నేర్పాలన్న ఆదర్శంకూడ వేదమాత సూచించింది.
ఇక మంత్రంలోని ద్వితీయార్థంలో కన్యల మనోగతం స్పష్టంగా వివరింపబడింది. సాధారణంగా ‘కన్యావరయతే రూపం’=(నీతిశాస్త్రం) ‘‘కన్యలు వరుని సుందరరూపాన్ని కోరుకొంటార’’ని భావిస్తారు.
కాని వేదం వీర్యవంతుడయిన పురుషుణ్ణి కోరుకొంటారని ‘వృషణః’శబ్దం ద్వారా వరుని ఎన్నికలో కన్యలు చాలా తెలివిగా, సంప్రదాయమార్గాన్ని అనుసరిస్తారని ‘ఉపప్రక్షే... యంత్యచ్ఛ’అన్న వాక్యంద్వారా స్పష్టపరచింది. ఈ విధంగా వీర్యవంతుడయిన పురుషుణ్ణి తెలివిగా సంప్రదాయమార్గంలో వరించడం ఏనాటి కన్యకయినా ఆచరణీయమైన మార్గాన్ని వేదం ఈ మంత్రంలో సూటిగా సూచించింది. ఈ సూచనను అనుసరించే కన్యలను నిరోధించని సమాజమెప్పుడు వస్తుందో.
**
జీవిత లక్ష్యం జీవన సంగ్రామమే
స వావశాన ఇహ పాహి సోమం మరుద్భిరింద్ర సభిభిః సుతం నః
జాతం యత్త్వా పరి దేవా అభూషన్మహే భరాయ పురుహూత విశే్వ॥ ఋ.3-51-8॥
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు