స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం--26

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు

19. వేదకర్తను కీర్తించు
ఇంద్రాయ సామ గాయత విప్రాయ బృహతే బృహత్‌
బ్రహ్మకృతే విపశ్చితే పనస్యవే॥ సామవేదం ఉ.6-72-1 (1025).
ప్రతిపదార్థం:- బృహతే= మహా; విప్రాయ= మేధావియైన; బ్రహ్మకృతే= వేదకర్త అయినవాని కొఱకు; విపశ్చితే= మహోన్నత జ్ఞాన స్వరూపుడును; పనస్యవే= సర్వులచేత సమ్మతింపదగినవాడును; ఇంద్రాయ= అజ్ఞాన నివారకుడు మరియు దుఃఖ నాశకుడును అయిన భగవానుని కొఱకు; బృహత్=గొప్ప; సామ= స్తుతిని; గాయత=పాడుము;
భావం:- మేధావియైన వేదకర్తయూ, మహాజ్ఞాని, సర్వసన్నుతుడూ, అజ్ఞాన నివారకుడూ, దుఃఖనాశకుడూ అయిన పరమాత్మను విస్తారమైన స్తుతులతో గానంచేసి సంతృప్తిపరచండి.
వివరణ:- భగవానుడు సమస్త సన్నుతులకు పాత్రుడు. భగవత్ వైభవ గుణగణనం (గుణకథనం స్తుతిః) సన్నుతి. సన్నుతి పాత్రమైన గుణం దైవంలో ఏదైనా ఉందా? ఆయన సర్వగుణనిధి. ఆయన నేరీతిగా స్తుతించినా అది భగవత్ సన్నుతియే అవుతుంది. వేదకర్తగా భగవానుని ఈ మంత్రం స్తుతిస్తూంది. ఎలాగో మంత్రంలోని పదజాలాన్ని చూడండి.
పరమాత్మకు స్తుతి వాచకంగా మంత్రం ‘‘బ్రహ్మకృత్’’అని పేర్కొంది. మంత్రంలోని ఇతర పదాలన్ని ఆ బ్రహ్మకృత్ పదానికి విశేషణాలే. పరమాత్మకు స్తోత్రవాచకంగా ఉన్న రెండవ పదం ఇంద్ర. అంటే అంధకార నివారకుడని సామాన్యార్థం. సామాన్య అంధకారాన్ని సూర్యుడు తొలగించగలడు. అతడు భగవానునిచే సృష్టింపబడిన భౌతిక పదార్థం. కాని భగవద్వాచకమైన ఇంద్ర శబ్దం అంతమాత్రమే అర్థంగల శబ్దంకాదు. జీవుల అజ్ఞానాంధకారాన్ని తొలగించగల సమర్థతగల జ్ఞాన స్వరూపుడన్న విశాలార్థాం గల పదం.
ఇంద్ర శబ్దంతోబాటు వేదకర్తకు విశేషణంగా ‘విప్ర’శబ్దాన్ని కూడ మంత్ర ముట్టంకించింది. మహాబుద్ధిమంతుడని దాని యర్థం. లోకంలో బుద్ధిమంతులు చాలామంది ఉన్నారు. కాని వేదకర్త అట్టివారిలో ఒకడు కాదు. అందరికంటె సర్వోన్నతుడైన బుద్ధిమంతుడు(బృహత్). అందుకే సృష్ట్యారంభంలో మానవులు తమ విధులను శాస్ర్తియంగా నిర్వహించుకొనుటకు మరియు విశ్వమూ విశ్వపతి స్వరూప స్వభావాల విజ్ఞానం కలిగేందుకు మూలమైన సర్వవిద్యలను నిక్షిప్తంచేసి నిర్మాణం చేసిన వేదాన్ని వారికి అనుగ్రహించాడు. వేద మహిమ తెలిసిన సకల వేదర్షులు వేదాన్ని ‘‘వేదేషు సర్వా విద్యాః సంతి మూలోద్దేశ్యతః’’ సర్వవిద్యలు బీజరూపంగా గర్భీకరించుకొన్న గ్రంథంగా శ్లాఘించారు. అంతమాత్రం చేత వారు సంతృప్తిచెందక వేదమంత్రాలతో మాత్రమే పరదైవాన్ని సంస్తుతించండి అని హితవుపలుకుతూ వేదశబ్ద వ్యవహారంతో ఎవరో ఒకరు నిర్మించిన గ్రంథ వచనాలతోకాక కేవలం దైవం కృపతో నిర్మించి అనుగ్రహించిన వేద వచనాలతో మాత్రమే సంస్తుతించాలని ‘దేవత్తం’అన్న పదంతో నొక్కిచెప్పి ‘‘దేవత్తం బ్రహ్మ గాయత’’(ఋ. 1-37-4) అని ఉద్ఘాటించారు.
వేదజ్ఞాన ప్రాముఖ్యాన్ని తెలుపుతూ వేదం ‘పనస్యు’=జనులకు నిత్యవ్యవహార జ్ఞానాన్ని బోధించునదన్న విశేషణాన్ని మంత్రం సాభిప్రాయంగా పేర్కొంది. అంటే ఏమిటి? మానవులలో మరియు మానవ సమాజాల మధ్య ఎల్లప్పుడూ ఉండదగిన సదాచార వ్యవహారాలకు లోపం సంభవింపరాదు. మరియ సృష్టిలోని సర్వపదార్థాల సత్యాసత్య గుణధర్మాల విజ్ఞానంకూడ వారికి కలగాలి అని మేధాసంపన్నుడైన (విప్ర) భగవానుడు కరుణాలవాలుడై సృష్టి ఆరంభంలోనే వేదాల రూపంలో ప్రసాదించాడని ఆంతర్యం.

--ఇంకావుంది...