స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-151

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భావం:- ఓ ఇంద్ర! ఓ జీవాత్మా! నీకు పరమ మిత్రులమైన మేము ప్రాణాలతో కలిసి తయారుచేసిన సోమరసాన్ని రక్షించు. ఎందుకంటె జీవన సమరంలో చిక్కుకొన్న నీకు నలువైపుల నుండి నీకు రక్షణగా అనేక దేవతలు సిద్ధమైయున్నారు.
వివరణ:- మానవ జీవితమొక సంగ్రామమేనని ఈ మంత్రం వివరిస్తూంది. యుద్ధంలో విజయకాంక్షియై విజయమో, వీరస్వర్గమో అనే దృఢ నిశ్చయంతో పోరాడగల వాడికి మిత్రుల సహాయమెంతైనా అవసరం. జీవన పోరాటం చేసే జీవుడు తనను దురాక్రమణ చేసేవానినుండి తననుతాను రక్షించుకొనవలసిన అవసరమెంతైనా ఉంది. ఆ సందర్భంలో తాము చచ్చినా ఎందరినో చంపే మిత్రుల ఆవశ్యకమెంతో ఉంటుంది. దైవం జీవుడికి తాను ముక్తినందేవరకు నిరంతరం తనను అంటిపెట్టుకొని ఉండే సహచరుల నెందరినో అనుగ్రహించాడు. వారే ప్రాణాలు. ఆ ప్రాణాలు ఆత్మనెల్లప్పుడూ అంటిపెట్టుకొని మాత్రమే ఉంటాయి. వానిని తన ప్రాణ స్నేహితులుగా చేసికొనడం ఆత్మ ముఖ్య కర్తవ్యం. అంతమాత్రమే కాదు. ఆ రీతిగా ప్రాణాలను ప్రాణసఖులుగా చేసుకొని పొందినవానిని రక్షించుకోవడం పొందని వానిని పొందడం జీవుని ముఖ్యకర్తవ్యం. ఆ సాధనలో జీవునిముందు ఒక మహాసంగ్రామం సిద్ధంగా ఉంటుంది. ఆ సంగ్రామంలో జీవుడికి సహాయపడేందుకు నాలుగుదిక్కుల దేవతలు నిలిచి ఉంటారు. ఆత్మకు మిత్రులైన ప్రాణాలు మిత్రుని కొఱకు బ్రహ్మామృతాన్ని తయారుచేసి సిద్ధంచేసారు. దానిని ఆత్మరక్షించుకొనగలిగితే మిత్రులైన ప్రాణాలతో కలిసి ఆత్మ ఆ బ్రహ్మామృతాన్ని సేవించి స్వయంగా అమృతత్వాన్ని పొందుతుంది. లేకుంటె జన్మ మరణరూపమైన సంసార జంజాటంలో చిక్కుకొనిపోతుంది.
బ్రాహ్మణ మరియు ఉపనిష్గ్రంథాలలో జీవుని ఈ జీవన సంగ్రామాన్ని గురించి ఎన్నో వర్ణనలు, ఎన్నో పర్యాయాలు వర్ణింపబడినట్లు కనబడుతున్నాయి. అక్కడ ఈ సంగ్రామాన్ని జీవన సంగ్రామంగా గాక దేవాసుర సంగ్రామంగా చెప్పడం జరిగింది. దేవాసురులకు సదా యుద్ధం జరుగుతుండటం సహజమే. అనేక పర్యాయాలు దేవతలోడి దానవులు గెలిచినట్లు కనబడుతుంది. కాని దేవతలకే అంతిమ విజయం సిద్ధించినట్లు మాత్రమే ముగింపు చేయబడుతుంది. అలాగే దేవతలకు మాత్రమే విజయం చేకూరాలి. ఎందుకంటె- సత్యపక్షావలంబకులైన వారికే దేవతలని పేరు. లోకంలో ‘సత్యమేవ జయతే, నానృతమ్’ ముండకోపనిషత్తు 3-1-6) ‘‘అంతిమ విజయం సత్యానికే. అసత్యానికి కాదు’’అన్నది సహజధర్మం. కారణమేమంటే ‘సత్యమేవ దేవాః’ (శతపథ బ్రాహ్మణం 1-1-1-4) ‘‘దేవతలు సత్యరూపులు’’ కాబట్టి.
బ్రాహ్మణ- ఉపనిషత్ గ్రంథాలలో ఎక్కడెక్కడ దేవాసుర సంగ్రామ ప్రస్తావన ఉంటుందో అక్కడక్కడ దేవతలు విష్ణువును ముందుపెట్టుకొని విజయాన్ని సాధించినట్లు వర్ణింపబడి యుంటుంది. విష్ణువు నిజానికి ‘‘విష్ణుర్వై దేవానాం పరమః’’ (శతపథ బ్రాహ్మణం) విష్ణువు సర్వదేవతలలో శ్రేష్ఠుడు. కాబట్టి ఆయన సహాయంలేకుండా దేవతలు విజయాన్ని సాధించలేరు. ఈ పరమ సత్యతత్త్వాన్ని దేవ స్వభావులయిన జ్ఞానులు మనముందుంచుతారు. జీవుడు= దేవరాజయిన ఇంద్రుడు. అతడు అసుర, పాపస్వభావులతో యుద్ధంచేయవలసి యుంది. ఆ యుద్ధంలో పరమదైవమైన విష్ణువు లేదా భగవంతుని సహాయ సహకారాలు లభించనంతవరకు జీవుని (ఇంద్రుని) విజయం సందిగ్ధమే.
**
జ్ఞానియే జ్ఞానికి బోధించగలడు
కవిం శశాసుః కవయో- దబ్ధా నిధారయంతో దుర్యాస్వాయోః
అతస్త్వం దృశ్యా అగ్న ఏతాన్ పడ్భిః పశే్యరద్భుతాన అర్య ఏవైః॥ ఋ.4-2-12॥

భావం:- క్రాంతదర్శనులైన కవులు అనగా గురువులు(జ్ఞానులు) తమ జీవితంలో దురవస్థలను అనుభవిస్తున్నా నియమ నిష్ఠలను మాత్రం విడువక వానిని విధిగా ఆచరిస్తూ క్రాంతదర్శనులైన శిష్య కవులకు (జ్ఞానులకు) జ్ఞానోపదేశం చేస్తారు. అందుచేత జ్ఞానాభిలాషివైన శిష్యకవీ! నీవు సమర్ధుడవై ప్రసన్నరూపంతో దర్శనీయుడు. అపూర్వ విద్వాంసుడు. క్రాంత దర్శనుడైన కవి గురువు పాదాలను పాద సంచారాలను శ్రద్ధగా దర్శించు.
వివరణ:- ఈ మంత్రంలోని ప్రథమార్థంలో ముఖ్యంగా మూడు అంశాలు వివరించబడ్డాయి. ‘కవిం శశానుః కవయః’’ ‘‘జ్ఞానికి జ్ఞానియే బోధిస్తాడు.’’ ఈ వాక్యంలో ఒక గొప్ప గంభీర మనోవైజ్ఞానికాంశం ప్రతిపాదింపబడింది.
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు