స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-153

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘హృదయాకాశంలో ఉన్న మనోమయ పురుషుడే ఆత్మ. అందలి అమృతమే హిరణ్మయుడు.’’ జీవుల హృదయగత ఆకాశం ఆత్మకు నివాస స్థానం. పరమాత్మ లభించే ప్రాప్తిస్థానం కూడ అదే. హృదయాకాశంలో ఉండే ఆత్మ- పరమాత్మల అనే్వషణ ఛాందోగ్యోపనిషత్తు (8-1-1)లో ఇలా వర్ణింపబడింది.
ఈ హృదయాకాశమెంత విశాలమైనదంటే దానిలో సమస్త విశ్వమూ ఇమిడిపోయి యుంది. శరీరం సహజధర్మం చేత నశించినా ఈ హృదయాకాశం మాత్రం నష్టంకాదు. అందుండిన ఆత్మ‘అపహత పాప్మా విజరో’ పాపస్పర్శ లేనిది మరియు విజరా (ముసలితనం) రహితమైనది; ‘విమృత్యుః’ మరణ రహితమైనది. ‘విశోకో’= శోకమే లేనట్టిది; ‘విజిఘత్సో’ = ఆకలి లేనిది; ‘అపిపాసః’= దప్పిక లేనిది; ‘సత్యకామ.’= సత్యానే్నసదా సంకల్పించునది; ఆ విధంగా హృదయాకాశంలో స్థిరంగా ఉండే ఆత్మ మరియు పరమాత్మలను ఆ ఛాందోగ్యం వర్ణించి దానితోబాటుగా ఆత్మజ్ఞాన మాహాత్మ్యం కూడ అచటనే వివరించింది.
ప్రతి వ్యక్తికి ప్రతి దినమూ అనుభవంలోనికి వస్తున్న ఆ ఆత్మ- పరమాత్మలు చర్మచక్షువులకు ప్రత్యక్షం కాకపోవడానికి గల హేతువును ఆ ఛాందోగ్యమే (8-3-4) ఇలా వివరించింది.
అథ య ఏష సంప్రసాడో- స్మాచ్ఛరీరాత్ సముత్థాయ పరం జ్యోతిరుపసంపద్య
స్వేనరూపేణాభినిష్పద్యత ఏష ఆత్మేతి హోవాచ ఏతదమృతమభయమేతద్ బ్రహ్మేతి
ఏ జీవాత్మ ఈ శరీరంనుండి బహిర్గతమై పరంజ్యోతిలో విలీనమైన స్వస్వరూపమైన ఆత్మగా నిష్పన్నవౌతుందో ఆ జీవిత్మాయే ఆత్మ.
ఈ విషయానే్న ఈ మంత్రంలో చిన్నచిన్న మాటలతో వర్ణించడం జరిగింది. ‘ఆత్మనన్నభో దుహ్యతే ఘృతం పయః’ ‘‘ఆత్మయుక్త ఆకాశంనుండి (హృదయాకాశం) ప్రకాశయుక్తమైన అమృతం వర్షింపబడుతుంది. అదే అమృత రసానికి మూలం.’’ అది ఎందుకు ప్రకాశయుక్తమో ఋగ్వేదమే ఒక సందర్భంలో ‘ఋతం చ సత్యం చాభీద్ధాత్తపసో- ధ్వజాయత’ (ఋ.10-190-1) ‘‘ఋతం మరియు సత్యమూ ఉజ్జ్వలమైన తపస్సుచేత ఆ అమృత రసాన్ని సృజించాయి’’అని కారణాన్ని వివరించింది. ఆ అమృతాన్ని ప్రతి వ్యక్తీ పొందజాలడు. కాని ‘సమీచీనాః సుదానవ ప్రీణంతి తమ్’ ‘‘సచ్ఛీలత కలవారు మరియు మహాదాతలు మాత్రమే ఆ అమృతాన్ని సంతృప్తిగా పొందగలరు. ఎందుకంటె ‘నరో హితమన మేహంతి పేరవః’అట్టి జ్ఞానులు సదా నరుల శ్రేయస్సునే కోరి జ్ఞానాన్ని వర్షిస్తారు కాబట్టి. అజ్ఞానుల ఎడ జ్ఞానుల దయాళుత్వమనేలా ఉంటుంది కదా. ఈ దయాళుత్వమే ఈ మంత్రంలో ప్రతిపాదింపబడింది.
**
సృష్టి నియమ పాలకుడు చెడిపోడు
ఋతస్య గోపా న దభాయ సుకృతుస్ర్తి ష పవిత్రా హృద్యంతరా దధే
విద్వాన్‌త్స విశ్వా భువనాభి పశ్యత్యవాజుష్టాన్విధ్యతి కర్తే అవ్రతాన్‌॥
ఋ.9-73-8॥
భావం:- సృష్టి నియమాలను సదా ఆచరించేవాడు. వానిని సంరక్షించేవాడు ఎన్నడూ చెడిపోడు. అతడు సర్వదా జ్ఞాన-కర్మ- ఉపాసనలనే మూడు ధర్మాలను తన హృదయంలో నింపుకొంటాడు. అట్టివాడు సమస్త భువనాలను ప్రత్యక్షంగా దర్శిస్తాడు. కర్తవ్య విధులనాచరించనివానిని, ఆచరించినా ప్రీతి పూర్వకంగా ఆచరింపని వానిని పశ్చాత్తప్తులను చేస్తాడు.
వివరణ:- వేదంలో ‘ఋత’శబ్దానికెన్నో అర్థాలున్నాయి. ప్రస్తుత మంత్రంలో సృష్టి నియమమని అర్థం వివక్షింపబడింది. వేదధర్మంలో దీనికి ఎంతో మాహాత్మ్యముంది. ఋత జ్ఞాని-ఋతానుష్ఠానపరుడు ఎంతో ఉన్నతుడు. ఋత శబ్దవిచారణ జీవితంలో చాలామందికి రుచించదు. ఋతతత్త్వ విచారణ శీలురైనవారు ఎవరో కొందరు మాత్రమే ఉంటారు అని ఋగ్వేదమే-
‘ఋతస్యధీతిమృషిషాడవీవశత్’ (ఋ.9-76-4) ‘‘ఋషులలో తపోబల సంపన్నులకు మాత్రమేనని వివరించింది.
ఋత= ‘‘సృష్టి నియమాల చింతనను పలుమార్లు కోరికోరి ఆచరిస్తాడు’’ అని చెప్పింది. వేదాధ్యాయనం, ఋత= సృష్టినియమాల చింతన, ఆచరణ మరియు యోగాభ్యాసం ఈ మూడు మనిషిని ఋషిగా చేస్తాయి. ఋషిగా అయినంతనే ఆతడిలో ఋతచింతన ఆరంభమై దానిననుసరించే దినచర్యకూడ ఆరంభమవుతుంది. అట్టి ఋత నిష్ఠాపరుడికెన్నడు హాని సంభవింపదు. కారణమేమంటె అట్టివాడు ఇతరులకు హాని కలిగించే మార్గానికే పోడు. ఈ విషయానే్న వేదం ‘ఋతస్య గోపా న దభాయ సుకృతుః’ ‘‘ఋతరక్షకుడు ఋతారక్షకుడు ఋతాచరణశీలి ఎన్నడు చెడిపోడు’’అని స్పష్టపరచింది.
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు