స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-155

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఋతంచ స్వాధ్యాయ వ్రవచనే చ సత్యం చ స్వాధ్యాయ ప్రవచనే చ
తపశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ చమశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ
శమశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ అగ్నయశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ
అగ్నిహోత్రం చ స్వాధ్యాయ ప్రవచనే చ అతిథయశ్చ స్వాధ్యాయ వ్రచనే చ
మానుషం చ స్వాధ్యాయ ప్రవచనే చ ప్రజా చ స్వాధ్యాయ ప్రవచనే చ
ప్రజనశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ ప్రజాతిశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ
సత్యమితి సత్యవచా రాథీతరః తప ఇతి తపో నిత్యఃపౌరు శిష్టిః
స్వాధ్యాయ ప్రవచనే ఏవేతి నాకో వౌద్గల్యః తద్ధి తపస్తద్ధి తపః
భావం:- ఋతం మరియు అధ్యయన అధ్యాపనాలు తపస్సు. సత్యాన్ని అధ్యయనం చేయడం, అధ్యయనం చేయించడం తపస్సు. శమం మరియు శాంతంగా ఉండటం, ఇతరులను శాంతంగా ఉంచటం తపస్సు. జ్ఞానాగ్నులను తెలుసుకోవడం ఇతరులుకు తెలపడం తపస్సు. అగ్నిహోత్రం, వేదాధ్యాయనం, వేదాధ్యాపనం తపస్సు. అతిథి యజ్ఞం, జ్ఞాన గ్రహణం జ్ఞాన దానం తపస్సు. సంతానం, సంతోనోత్పాత్తి, తానంలో ఔన్నత్య సాధన తెలుసుకోవడం, ఇతరులకు తెలపడం తపస్సు. సత్యవాది అయిన రాథీతర మహర్షి అభిప్రాయంలో సత్యమే తపస్సు. తపఃపరాయణుడైన పౌరుశిష్టి అభిప్రాయానుసారం తపస్సు చేయడం కంటె తపస్సు లేదు. ముద్గలుని సంతానమైన నాకుని మతంలో స్వాధ్యాయ ప్రవచనమే (వేదం చదవడం ఇతరుల చేత చదివించడం) తపస్సు. ఇదే తపస్సు. ఇదే తపస్సు.
సత్యవాది అయిన రాథీతరుని అభిప్రాయాన్ని చెప్పకముందు అనేక విధాలయిన తపస్సుతోబాటు స్వాధ్యాయ ప్రవచనం గ్రహించబడింది. చివరికి స్వాధ్యాయమే తపస్సుగా నిర్ధారణ చేయబడింది.దీని పరమార్థ మేమంటె- స్వాధ్యాయ ప్రవచనాలు లేకుంటే సర్వతపస్సులు వ్యర్థం. కాబట్టి సర్వతపస్సులు స్వాధ్యాయ ప్రవచనాలతో పరిపూర్ణమవుతాయి. అందుచేత సర్వతపస్సులలో స్వాధ్యాయ ప్రవచనాలే అత్యంత ప్రధానమైనవి. ప్రతి నిత్యమూ ఎవడైతే స్వాధ్యాయాన్ని చేస్తూ ఉంటాడో అతడే నఖశిఖ పర్యంతమూ తపమాచరించినవాడని మనువు శ్లాఘించాడు. జ్ఞానమే తపస్సు. తపస్సు అనే అగ్నిగుండంలో పైకెగసిన స్వాధ్యాయ ప్రవచనాలనే అగ్నిజ్వాలలలో దహింపబడిన పాప సందోహం గలవాడు ‘శ్రుతాస ఇద్వహం- తస్తత్సమాశత’ పవిత్రత పొంది పరిపూర్ణుడవుతాడు. ఆ విధంగా తపస్సుచేత తనకు తాను ఉజ్జ్వలుడై- నిర్మలుడై భగవత్ప్రాప్తిని పొంది బ్రహ్మానందానుభవాన్ని అనుభవిస్తాడు.
**
విద్వాంసులారా! పతితుల నుద్ధరించండి
ఉత దేవా అవహితం దేవా ఉన్నయథా పునః
ఉతాగశ్చక్రుషం దేవా దేవా జీవయథా పునః॥
భావం:- లోకోపకార పరాయణులైన మహాపురుషులారా! జీవితంలో అధమస్థాయికి పడిపోయిన వారిని తిరిగి ఉన్నత స్థానంలోనికి తీసుకొని రండి. ఓ సజ్జనులారా! మాటిమాటికి అపరాధాలను చేసే దుర్మార్గులను క్షమించి వారికి ఉన్నత జీవితాన్ని కల్పించండి.
వివరణ:- అల్పజ్ఞత చేతనో, అజ్ఞానముచేతనో మరి దేనిచేతనో మనిషి అనేక అపరాధాలను చేస్తూ ఉంటాడు. కాని మనిషి జన్మయే నిస్సందేహంగా ధన్యమైనది. ఎందుకంటె జీవితంలో ఉన్నతి పొందేందుకు లోకంలో ఎన్ని సాధనాలున్నాయో అవి సృష్టిలో ఒక్క మనిషికి తప్ప మరే ప్రాణికి లేవు. జీవులకు సహజసిద్ధమైన అల్పజ్ఞత మరియు అహంకార స్వభావాల చేత చేయరాని ఎన్నో పనులను చేసి అట్టడుగు స్థాయికి పడిపోతాడు. అట్టి పతితులైన వారిని అలా వారి కర్మకు వారిని వదిలివేయాలా? ఈ విషయంలో వేదం విద్వాంసుల నుద్దేశించి ‘దేవా! ఉన్న యథా పునః’ ‘‘ఓ విద్వాంసులారా! అట్టి పతితులను పైకి లేపండి, తిరిగి ఉన్నతులను చేయండి’’అని వారి కర్తవ్యాన్ని జ్ఞాపకం చేస్తూంది. జీవనయానంలో ఎంతటి వారికైనా పొరపాట్లు చేయడం సహజం. అట్టి సమయంలో వారిని చూచి ‘హసంతి దుర్జనా స్తత్ర సమాదధతి సజ్జనాః’ దుర్జనులు ఎగతాళి చేస్తారు సజ్జనులు ప్రియంగా ఓదారుస్తారు. సత్కర్మాచరణకు ఉత్సాహపరుస్తారు.
దార్మికంగా మరియు నైతికంగా పతనమయిన మనిషి మాటిమాటికి అపరాధాలను చేస్తాడు. మరల మరల చేసే అపరాధాలవలన అసలు అతడికి ఆత్మ అనేది ఉందా? అని అనిపిస్తుంది. అటువంటి జీవస్మృతుని ఏమి చేయాలి? ఏమిచేయాలో వేదం విద్వాంసులకు ‘దేవా జీవయథా పునః’ ‘‘ఓ విద్వాంసులారా! అట్టివారిని తిరిగి పునర్జీవితులను చేయండి’’ అని ఆదేశిస్తూంది. ఎవరినైనా క్రిందకు పడగొట్టడం సులభమే.
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు