స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-156

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాని పైకి లేపడమే కష్టం. అలాగే చంపడం కూడ కష్టమైన పనికాదు. కాని జీవింపచేయడమే మహాకష్టం. అదే వీరకార్యమవుతుంది. దేవతలు కూడ మానవునినుండి ఇట్టి వీరకృత్యాలనే ఆశిస్తారు. అథర్వణ వేదంలో ‘పునంతు మాదేవజనాః’ (అథ.వే.6-10-1) ‘‘అపరాధులైన మమ్ము దేవజనులు (సత్పురుషులు) పవిత్రులుగా చేయుదురుగాక’’అని కనబడుతున్న ప్రార్థన ‘‘దేవా జీవయథా పునః’’అన్న ఋగ్వేద సందేశానే్న పునరుద్ఘాటిస్తూంది. మనిషిలో ఉండే దోషాలను తొలగించి సన్మార్గంలోనికి తీసుకొని రావడమే ఒక పవిత్ర కార్యం. కాని సహజంగానే పవిత్ర ఆచార పరాయణుని ప్రత్యేకంగా సన్మార్గంలో పెట్టేందుకు ఏముంటుంది. ప్రత్యేకత లేదా విశేషత ఏమంటే ‘అవహితమ్’= ‘పతితుడు’ అయిన వానిని ఉద్ధరించడమే. చిత్రమేమంటె పతితులైనవారి యెడల, జాలి చూపేవారి ఎడల, వేదానికి గౌరవమేమీ లేదు. ఎందుకంటే వారి యెడల ఆ జాలి శుష్కప్రియమా శూన్యహస్తమూ అవుతుంది.
కాని ఎవరు పతితులను దయతో సముద్ధరిస్తారో వారినే వేదం మాన్యులుగా భావించి దేవ పదవీ సమ్మానితులనుగా చేస్తుంది. అందుకే వేదమీ మంత్రంలో పతితులనుద్ధరించుడని విద్వాంసులనాదేశించింది. విద్వత్తునకు మించిన సార్థకత వేరే యేముంటుంది.
గమ్యప్రాప్తికి సన్మిత్రుని మార్గమే గతి
యన్నూనమశ్య గతిం మిత్రస్య యాయాం పథా
అస్య ప్రియస్య శర్మణ్యహింసానస్య సశ్చిరే॥
భావం:- ఒకవేళ నేను సక్రమ పద్ధతిలో ఉచిత మార్గంలో నడిస్తే సదా స్నేహశీలి అయిన వాని (్భగవంతుని) మార్గాన్ని పొందుతాను. అట్టి ప్రియమైన- సర్వవిఘ్న నివారకుడైన శాంతి ప్రదాయకుని ఆశ్రయంలోనికి నావంటి వారెందరో గుమిగూడుతారు.
వివరణ:- మనిషి మనస్సులో సాధారణంగా ఉన్నతి పొందాలనే ఆలోచన కలుగుతుంది. అది చాల ఇష్టమైనది కూడ. కాని తెలియంది ఎలా పొందాలన్నదే. ఈ సందర్భంలో అందరికి ఎదురయ్యే ప్రశ్న ఒకటే. ఉన్నతి పొందే మార్గమేమిటి? అని. సమాధానం దొరకని ఆ అయోమయ పరిస్థితులలో మనిషికి సర్వమిత్రుడు- సహజ మిత్రుడు, అకారణ మిత్రుడు అనే మూడు రకాల మిత్రులు తటస్థపడతారు. వారంతా ప్రేమతో మిత్రమా! ఎందుకు అటు ఇటు తిరుగుతావు. రా. నేను చెప్పే మార్గంలో నడు అని ఆహ్వానిస్తారు. వారి మాటలను వినగానే వెంటనే వారు చెప్పిన మార్గంలోనే నడవాలనే ఆలోచన ఎవరికైనా కలుగుతుంది. ఆ స్థితిలో ఉభ్న మనిషిలో ఎనె్నన్ని మనోభావాలు చిత్రంగా తలయెత్తుతాయో వేదం ‘యన్నూనమశ్యాం గతిం మిత్రస్య యాయాం పథా’ నేను మార్గంలో నడవనారంభిస్తే మిత్రునితో కలయిక అదే కలుగుతుంది. లేదా నేను మిత్రుని మార్గంలో నడవనారంభిస్తే నాకు గమ్యం సిద్ధిస్తుంది. లేదా నేను మిత్రుని మార్గంలోనే నడిస్తే గమ్యాన్ని చేరుకోగలను అంటూ అనేక భావాల గర్భితంగా సూత్రప్రాయంగా ఒక వాక్యం చెప్పింది.
ఈ భావాలన్ని అంతరాత్మ సందేశాలేనని ఆ మనిషికి దృఢ నిశ్చయం కలుగదు. మహామహా విద్వాంసులు సహితం ఇట్టి సందర్భాలలో సందిగ్ధావస్థకు గురిఅవుతారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడ-
కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః భ.గీ.4-16.
‘‘ఏది చేయతగినదో ఏది చేయతగనిదో తెలియక విద్వాంసులు సహితం విమోహితులవుతారు’’ అని స్పష్టంగా వచించాడు. విద్వాంసులే ఈ రీతిగా విమోహితులయినప్పుడు ఇక సాధారణ జనుల సంగతి వేరే చెప్పాలా?
కాని ఒక ఆశ ఏమంటే ఏదో ఒకనాడు నిస్స్వార్థపరుడు, సన్మార్గదర్శకుడు అయిన మిత్రుడు తప్పక లభిస్తాడని. అందుచేత అట్టి మిత్రుని కోరుకొనేవారి కోరిక ఏమంటే ‘వయ్యం మిత్రస్యావసి స్యామ సప్రథస్తమే’ (ఋ.5-65-5) ‘‘అట్టి సర్వదా స్నేహశీలి అయిన మిత్రుని సంపూర్ణ రక్షణలో ఉండాలి’’ అని.
విద్వాంసులు సహితం ‘అస్య ప్రియస్య శర్మణ్‌యహింసానస్య నశ్చిరే’ ‘‘నిరాటంకమైన కల్యాణదాయకమైన మిత్రుని ఆశ్రయంలో మేమందరమూ చేరుకొందుముగాక’’ అని భావించి ఆశ్రయిస్తున్నారు. మనం కూడ ఆ విద్వాంసుల మార్గంలోనే నడుద్దాం. ‘మహాజనో యేన గతః స పంథా’ (్భరత. వనపర్వం. 313-117)
‘‘పెద్దలు నడచిన మార్గమే మంచిమార్గం’’ కదా, ఎందరో సజ్జనులా రీతిగా పెద్దల మార్గంలో నడిచి శ్రేయస్సును పొందారు. మనమూ ఆ మార్గాన్ని అనుసరించి శ్రేయస్సును పొందుదాం.
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు