స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-159

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వారాజ్యం కోసం ఆకాంక్ష
ఆ యద్వామీయచక్షసా మిత వయం చ సూరయః
వ్యచిష్ఠే బహుపాయ్యే యతేమహి స్వరాజ్యే
భావం:కోరదగిన జ్ఞానవంతులారా! పరస్పరమూ అభిమానించుకొనే స్ర్తి పురుషులారా! విద్వాంసులైన మీరు మేము కలిసి సర్వ విధాలుగా సంరక్షణీయమైన స్వర్గరాజ్యాభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేద్దాం.
వివరణ: తమ స్వేచ్ఛను ఎవరైనా నిరోధించేందుకు ఇష్టపడే ఏ చిన్న ప్రాణి కూడా ఈ సృష్టిలో ఉండదు. తమ స్వేచ్ఛ నిరాటంకంగా ఉండాలని అందరూ కోరుకొంటారు. వేదంలో మార్గం ‘అనృక్షరః’ కంటకరహితమై ఉండాలన్న ప్రార్థన ఒకటి కనబడుతుంది. బాధారహితమైన నిష్కంటకమార్గమే ప్రశస్తమైనది. అదేవిధంగా స్వారాజ్య (స్వర్గరాజ్యం) వాంఛ అస్వాభావికం కూడా కాదు. ఇతరుల స్వేచ్ఛను హరించేవానికి తన స్వేచ్ఛ నితరులు హరించినపుడా బాధ ఏమిటో అర్థమవుతుంది. వేదం స్వారాజ్య (దుఃఖ స్పర్శలేని గొప్ప స్వర్గరాజ్యం) భావనను విశేషంగా సమర్థిస్తుంది. ఋగ్వేదంలో స్వారాజ్యభావనను సమర్థించే ఒక గొప్ప ప్రత్యేక సూక్తమే చెప్పబడింది. ఇందులోని ‘అర్చన్నను స్వరాజ్యమ్’ స్వారాజ్యాన్ని కనుకూల కార్యాలను చేస్తూ అను మంత్రంలో స్వారాజ్య సంబంధమైన ఒకటి రెండు పదబంధాలీ మంత్రంలో కనబడతాయి. అవి చాలా జ్ఞప్తికి ఉంచుకొనదగినవి.
స్వరాజ్య:- దుఃఖ స్పర్శలేని స్వపరిపాలనా స్వేచ్ఛగల రాజ్యమని అర్థం. ఇట్టి రాజ్యస్థాపనకు విద్వాంసులైన స్ర్తిపురుషుల సహకార మత్యంతావశ్యకం. ఈ విషయమే మంత్రంలోని ప్రథమార్థంలో ప్రతిపాదింపబడింది.
బహు పాయ్య:- స్వారాజ్యమనేది అనేకులు చేయిచేయి కలిపి సంరక్షించుకోదగింది. ఈ రాజ్యం నాది అన్న భావంగా ప్రగాఢంగా అందరిలో ఉన్ననాడే రాజ్యం స్వారాజ్యమవుతుంది. ఏకఛత్రాధిపత్యం గల సామ్రాజ్య పరిపాలన ఏ కొద్దిమంది ప్రయోజనానికో తోడ్పడితే అది ఆ కొందరికి స్వరాజ్యమవుతుందే గాని అందరకు స్వారాజ్యం మాత్రం కాదు. సామ్రాజ్య సత్ఫలాలందరకు అందించే రాజ్యమే స్వారాజ్యం.
వ్యచిష్ఠ:- స్వారాజ్యం వ్యచిష్ఠ= స్వరాజ్యం విశాలమైయుండాలి. చిన్న చిన్న రాజ్యాలచేత, బలహీనమైన రాజ్యాలచేత నష్టపడని విధంగా స్వారాజ్యం విశాలమై బలిష్ఠమైయుండాలి. స్వారాజ్యం విశాలంగాఉన్న కారణంగా దానిని సంరక్షించే మానవ వనరులు కూడ అధికంగా ఉండే అవకాశమెక్కువ. కాబట్టి స్వారాజ్యం బలిష్ఠంగా ఉంటుంది.
య తే మహి:- స్వారాజ్యం పట్ల అందరకు నాది-నాది అన్న మమత్వముండాలి. దానివలన అందరు దాని అభివృద్ధికి అహరహరమూ ప్రయత్నపరులై యుంటారు. స్వారాజ్య మహత్వాన్ని గురించి దయానందులిలా వివరిస్తున్నారు.
‘‘ఎవరెంత స్వల్పంగా అభివృద్ధికి ప్రయత్నించినా స్వదేశీయ రాజ్యమే మిన్న. మతాంతరులు, విమతీయులైనవారు శాంతస్వభావం కలిగినా- నీ అనే పక్షపాత రహితమైన బుద్ధితో ప్రజలను తల్లిదండ్రులవలె భక్తితో న్యాయ ధర్మాలతో పాలించే విదేశీయ పాలకుల రాజ్యం సంపూర్ణంగా సుఖదాయకం కాదు.’’
సత్యార్థ ప్రకాశం- 3వ సముల్లాసం.
కాబట్టి ప్రజలు కోరుకోవలసినది కేవలం స్వరాజ్యం కాదు. అది దుఃఖ స్పర్శలేని స్వర్గరాజ్యం= స్వారాజ్యం కావాలని కోరుకోవాలి.
**
ముందుగా పుట్టిన అగ్నినుండే సృష్టి జరిగింది
గీర్ణం భువనం తమసాపగూళ్హమావిః స్వరభవజ్ఞాతే అగ్నౌ
తస్య దేవాః పృథివీ ద్యౌరుతాపో- రణయన్నోషధీః సఖ్యే అస్య॥
భావం:- సృష్టికి ముందు ప్రపంచమంతా గాఢాంధకారంతో కప్పబడి నిశే్చతమైయుంది. కొంతకాలం తరువాత ఒక పెద్ద అగ్ని పుట్టింది. దానివలన అంతట ప్రకాశం మరియు ఆనందం ప్రకటనమయింది. ఆ అగ్ని సంయోగంతో భూమి, ఆకాశం, అంతరిక్షం, నీరు మరియు ఓషధులు శాంతిదాయకంగా పుట్టాయి.
వివరణ:- సృష్టి జరుగకముందు ఏముంది? ఎలా ఉంది? అన్న ప్రశ్నలు ఆలోచనాపరుల మనసులలో సాధారణంగా కలుగుతూ ఉంటాయి. వీనికి యుక్తియుక్తమైన, హేతుబద్ధమైన సమాధానాలు వేదాలలో కనబడిన విధంగా ఏ మత గ్రంథాలలోనూ కనబడవు. సృష్టికి పూర్వం ‘గీర్ణం భవనం తమ సాపగూళ్హమ్’ సంకెళ్లతో బంధింపబడిన రీతిగా గాఢాంధకారంతో ప్రపంచమంతా కప్పబడి నిశే్చతనమై యుంది’’ సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్ర - తారాదులు, సస్యశ్యామలమైన భూమి, గలగల పారే నదులు మందమందంగా సుఖకారకమై వీచే గాలి- ఇలా ఉన్నదే ప్రపంచం. ఇదంతా సృష్టికి పూర్వం దానికి కారణమైన మహాతత్త్వంలో విలీనమైపోయింది. ఈ స్థితినే వేదం ‘గీర్ణం భువనమ్’అని నిర్దేశించింది.
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు