స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-161

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివరణ:- భగవదనే్వషణలు దైవముందనే విశ్వాసంతో సదా దైవాన్ని అనే్వషిస్తూ ఉంటారు. కాని లోకంలో సాధారణ జనులు దైవమెక్కడో ఏదో లోకాలలోనే ఉన్నాడని ఆయనను దర్శించే శక్తితమకులేదని కాబట్టి దైవం ఎప్పుడూ కనబడని వాడేనని భగవద్దర్శనానికి ప్రయత్నమే చేయరు. మరి కొందరు పరమేశ్వరుడు ధనం-బలం- సర్వసమర్థతలు కలవాడనే ఆశాభావంతో ఆయననుకోరి ప్రార్థిస్తూ ఉంటారు. ఆ భావన కూడ అసత్యం కాదు. వేదం కూడ ఇదే విషయాన్ని ‘హస్తేదధానో నృమ్ణావిశ్వాని’ ‘‘సమస్త సిరిసంపదలు దైవాధీనమైయున్నా’’అని సమర్థిస్తూంది. సమస్తమూ తమ అధీనంలో ఉన్నవాటినుండి దేనినైనా కోరుకొంటే ఆయనను దర్శించి అర్థించినవానికే లభ్యమవుతాయి. ఇతరులకు కావుకదా. అంతేకాక ఏదేని వస్తువును కోరుకొంటె తనకు దాని అవసరమూ, దానిని పొందగల అర్హతను కూడ దాతకు విన్నవించుకోవాలి కదా! లోకంలో అయితే దాతనుండి తనకు కావలసిన దానిని బలాత్కారంగా గుంజుకొనిపోవచ్చు. కాని భగవంతుని నుండి మాత్రమలా సాధ్యంకాదని అందరూ గుర్తించాలి. ఎందుకంటె సర్వేశ్వరుడు ‘అమే దేవాన్ ధాత్’ ‘‘సమస్త దేవతలను భయభక్తులు కలిగినవారిగా తన అధీనంలో నిలుపుకొన్నవాడు.’’
భీషాస్మాత్ వాతః పవతే భీషోదేతి సూర్య?
భీషా స్మా దగ్నిశే్చంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమః॥ తైత్తిరీయోపనిషత్తు. 2-8-1.
ఆ దైవభీతి వలననే వాయువు వీస్తున్నది. సూర్యుడుదయిస్తున్నాడు. అగ్ని జ్వలిస్తున్నది. విద్యుత్తు తన విధులను నిర్వహిస్తున్నది. మృత్యువు కూడ భయపడి పరుగుపెట్టుతూ ఉంది. ఘనులైన మల్లయుద్ధవీరులను ఓడించిన మహాఘనుడైన మల్లయుద్ధవీరుడు వారికంటె బలహీనులైన మల్లయుద్ధవీరులతో పోరాడవలసిన అవసరం లేదనే మల్లయుద్ధ న్యాయా-నుసారంగా చాలా బలమైన ప్రాకృతిక శక్తులే భగవానుడికి భయపడి తమతమ విధులను నిర్వర్తిస్తూ ఉన్నారంటె చాల బలహీనుడవయిన నీవు ఆయననుండి ఏమి గుంజుకోగలవు? కాబట్టి దైవాన్ని సంతోషపెట్టు.
అలాచేస్తే ఆయననుండి దేనినయినా పొందగలవు. కాని బలవంతంగా లాగుకొనలేవు. సర్వేశ్వరుణ్ణి సంతోష పరచేందుకు నీవెక్కడకు పోనక్కరలేదు. ఎందుకంటె ఆయన ‘గుషా నిషీదన్’నీ హృదయ గుహలోనే ఉన్నాడు. కనుక విదంతీమత్ర నరో ధియంధాః’ బుద్ధిమంతుడై భగవధ్యానం చేసేవాడు తన హృదయ గుహలోనే దర్శిస్తాడు. అలా హృదయ గుహలో ఉన్నవాడు అందరికి కనబడతాడు. మరి ఆ హృదయ నిష్ఠితుడిని దర్శించేదెలా? ‘హృదా యత్తష్టాన్ మంత్రాన్ అశంసన్’ హృదయంనుండి భక్తితో వెలువడే స్తోత్ర స్తుతి ద్వారా పరమాత్ముడు సంతుష్టుడై దర్శనమిస్తాడు. ఆ విధంగా హృదయ పూర్వకంగా ప్రార్థించి ఆరాధించనివానికి పరబ్రహ్మం లభించదు. కాబట్టి దైవాన్ని ‘స్తుతి ఆరాధనల’ద్వారా సంతోషపరచి ఆయనకు సన్నిహితుడవు కమ్ము.
**
దైవం హృదయం నుండి
హృదయంలోనికి ప్రవేశిస్తాడు
అజో న క్షాం దాధార పృథివీం తస్తంభ ద్యాం మంత్రైభిః సత్యై
ప్రియా పదాని పశ్వో ని పాహి విశ్వాయురగ్నే గుహా గుహం గాః
భావం: ఓ దేవా! జన్మరహితుడవై యుండియు ఈ భూమిని, అంతరిక్షాన్ని ధరించియున్నావు. విశాలమైన జ్యోతిర్మండలాలను నీవు నీ సత్యమైన ఆదేశాలచేత స్తంభంవలె స్థిరంగా పట్టి యుంచావు. ఓ ప్రభూ! ఈజీవుని ప్రియాతి ప్రియమైన శరీర, ఇంద్రియ, అంతఃకరణాలను అన్ని విధాలుగా రక్షించు. ఓ అగ్నీ! జీవులందరికి జీవనాధారుడవగుచు ఒక హృదయ గుహ నుండి మరొక హృదయ గుహకు చేరుకొంటున్నావు. లేదా మిక్కిలి రహస్యంగా జీవుల హృదయ గుహలలో నివసిస్తూ ఉన్నావు.
వివరణ: భగవత్ప్రాప్తి కొరకై జీవులను ప్రోత్సహించేందుకు భగవంతుని సామర్థ్యాతిశయాన్ని ఈ మంత్రం వివరిస్తూ ఉంది. ‘అజో న క్షాం దాధార పృథివీమ్’ జన్మరహితుడైన పరమేశ్వరుడు విశాలమైన పృథివి, అంతరిక్షాన్ని వహించి రక్షిస్తున్నాడు. మరియు ‘తస్తంభ ద్యాం మంత్రేభిః సత్యైః’ - సూర్య, చంద్ర, నక్షత్ర, గ్రహ, ఉపగ్రహాది జ్యోతిర్మండలాలకు నిలయమైన అంతరిక్షాన్ని తన నిరాటంకమైన ఆదేశాల చేత స్థిరంగా నిలిపి ఉంచుతున్నాడు. ఇట్టి సర్వసమర్థుడైవైన ఓ ప్రభూ! నీకిదే మా విన్నపం, ‘ప్రియా పదాని పశ్వోని పాహి’ జీవాత్మకు అభీష్టమైన పదాలను (సజీవంగా నిలిపి ఉంచే ఇంద్రియాదులను) సంరక్షించుము.
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు