స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-163

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
భావం:- ఎవరు హృదయ విహారి అయిన భగవంతుని ఆజ్ఞలను బిడ్డలు తండ్రి చేసే పనులను ప్రీతితో అనుసరించే రీతిగా విని వెంటనే ఆచరిస్తారో వారికి మహాదాతయైన పరమేశ్వరుడు సకల ఐశ్వర్యాల ద్వారాలు తెరచి ఇస్తాడు. వారికై ఆనందాన్ని తెరల మాటున గుప్తంగా భద్రంగా ఉంచి అందిస్తాడు.
వివరణ:- సృష్ట్యాదిలో పరబ్రహ్మ సర్వకార్యసాధకమూ, సమస్త జ్ఞానమూలమూ అయిన వేదజ్ఞాన సర్వస్వాన్ని మానవున కనుగ్రహించాడు. అదే అనుగ్రహంతో మానవుల హృదయ గుహలలో ఉండి పాపాలను చేయవలదని పుణ్యకర్మల నాచరించమని అహరహమూ ప్రబోధిస్తూ ఉన్నాడు. కాని ఎంతమంది ఆ ప్రబోధాన్ని వింటున్నారు? విని ఆచరిస్తూ ఉన్నారు? వారి వలన సమాజంలో కలిగే దుష్ఫలితాలను అందరం చూస్తూనే ఉన్నాం. అనుభవిస్తూనే ఉన్నాం. మారణకాండలు మరియు అత్యాచారాలతో సమాజం నిత్యమూ అట్టుడికిపోతూంది. వేద ప్రబోధం వినని వాళ్లవలన సంఘంలో ఇట్టి ఉపద్రవాలు సంభవిస్తూంటే మరికొందరు వేద ప్రబోధాన్ని శ్రద్ధతోవింటారు. కాని ప్రయోజనమేమిటి? వాళ్లు ఆచరింపరు. వారివలన కూడ ప్రయోజనం శూన్యమే. సమాజంలోని ఈ దుస్థితిని చూచి వేదం వేదప్రబోధాన్ని కేవలం వినడంకాదు. విన్నదాన్ని తప్పక ఆచరించాలి అని హెచ్చరిస్తూంది. అంతటితో తృప్తిపడక విన్న ప్రబోధాన్ని ‘తురాసః’ ‘వెంటనే’ ఆచరణలో పెట్టమని హితవు చెప్పింది. దానివలన కలిగే ఫలం జీవులకు సంసారోద్ధారణ. దానికొఱకై మనిషి సదా ప్రయత్నపరుడుగా నడుచుకోవాలి. ఎలా? అన్నది ‘పితుర్న పుత్రాఃక్రతుం జుషంత’ పుత్రులు తండ్రిచేసే పనులను- బుద్ధులను చూచి అనుసరించినట్లు. ఇక్కడ తండ్రి భగవంతుడే. ఆయన జీవుల సంసారోద్ధరణకు సహాయకర్మల నెన్నింటినో సర్వదా ప్రయత్నపరుడై చేస్తూ ఉంటాడు. ఆయనను చూచి మానవుడు కూడ ప్రయత్నపరుడు కావాలి. అంటే దైవంచేసిన పనులను చేయాలనికాదు దీని అభిప్రాయం. అలా చేయడం జీవుడికి సాధ్యంకాదు. సాధ్యమేమంటే ఆయనను తండ్రిగా భావించి బిడ్డలు తండ్రిని అనుసరించినట్లు అనుసరించి దైవం జీవుల సంసారోద్ధరణకు సదాచేస్తున్న సమస్తోపకారాలను పొందేందుకు ప్రయత్నించడమే. ఆ విధంగా తనను తండ్రిగా భావించి అనుసరిస్తూ సంసారోద్ధరణకై ఆరాధిస్తున్న మానవులకు పరమాత్ముడు ‘వి రాయ ఔర్ణోద్ దురః’ ‘‘సమస్త ఐశ్వర్య ద్వారాలను తెరుస్తాడు! ఎందుకంటె ఆ మానవుని ఆనందాన్ని తెరల మాటున భద్రపరచి ఉంచేందుకే’’ పిపేశ నాకం స్తృభిః’ అందుకే భగవంతున్ని తండ్రిగా భావించి ఆయనకు ప్రియపుత్రుడుగా అయి తనకై ఆయన తన గుప్త్ధన నిధిని తెరచే విధంగా నడుచుకోవాలి. అలా నడుచుకొనే మానవుడికోసం తెరుచుకొనే ఆ తెరలేమంటే- అన్న, ప్రాణ, మనో, విజ్ఞానమయ నామకమైనవి. వాటి వెనుక భద్రంగా ఆనందం. అదే ఆనందమయ- కోశం, భగవంతుడు అట్టి ఆనందాన్ని భద్రంగా దాచియుంచింది ఆ అన్నమయాది కోశాది వెనకనే. తండ్రిగా భావించి ఆయనను అనుసరించి సంసారోద్ధరణకు యత్నించేవాని ఆనందంకోసం తెరిచేది ఆ తెరలనే. వేదం ‘‘పిపేశ నాకం స్తృభిః’ అన్న వాక్యంలో ప్రతిపాదించింది దీనినే.
కలిసికట్టుగా శత్రుకంపన
ధూమాన్ని సృష్టించు
కృణోత ధూమం వృషణంసఖాయో- స్త్ధ్రేంతు ఇతన వాజమచ్ఛ
ఆయమగ్నిః పృతనాషాట్ సువీరో యేన దేవాసో అసహంత దస్యూన్‌॥
ఋ.3-29-9.
భావం:- ఓ సజ్జనులారా! సదాచారులు(దేవతలు) దేనిద్వారా దురాచారులను (దస్యులను) అణచివేస్తారో దానికనుగుణంగా దట్టమైన పొగను కల్పించండి. తాము యుద్ధంలో హాని పొందకుండా ఉండే విధంగా సురక్షితంగా వెళ్లండి. ఈ అగ్ని యుద్ధవిజయ సహకారి. మహాయోధవరుల సహచరి.
వివరణ:- శత్రువులతో యుద్ధం చేయవలసివస్తే అందుకు అన్నివిధాల సిద్ధంగా ఉండాలి. యుద్ధానికి పంపబడే సేన శత్రువుల ఎడల ఉదాసీనంగా ఉంటే యుద్ధమేమి చేయగలదు? ఒకప్పుడు ఆ సేన శత్రువులతో చేతులు కలిపే ప్రమాదం కూడ ఉండవచ్చు. ఇదే విధంగా ఒక దేశాధిపతి శత్రువులతో యుద్ధం ప్రకటించినపుడు ఆ దేశ ప్రజలు పరాఙ్మఖులై యుంటే పరాజయ కళంకంతో వికలమైన రాజు ముఖాన్ని చూచేందుకు తయారుగా ఉండాలి. ఇట్టి సేన, ప్రజలు కల ఏ దేశమూ కూడ విజయ దరహాసంతో తల ఎత్తుకొని తిరుగలేదు.
విజయాభిలాషియైన రాజు యుద్ధసాధనాలన్నింటితోబాటు ముఖ్యంగా శత్రువుల ఎడల తీవ్ర వైరభావం మనసులో గాఢంగా నాటుకొన్న సైన్య సమృద్ధి కలిగి యుండాలి.

ఇంకావుంది...