స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-164

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
ఈ భావానే్న వేదం ఆలంకారికంగా ‘కృణోత ధూమం వృషణం సఖాయః’ ‘‘మీరంతా కలిసి దట్టమైన పొగను కల్పించండి’’అని పేర్కొంది. ధూమమంటే గజగజ వణికించగలిగినదని అర్థం. అంటే దేశం మరియు సైన్యం శత్రువులను తీవ్రంగా భయ కంపితులనుచేసే విధంగా ఉండాలని భావం. ఇట్టి ధూమాన్ని కల్పించడం ఏ ఒక్కరివల్లనో సాధ్యపడేది కాదు. అది అందరు సమష్టిగా చేసే ఘనకార్యం.
దేశంలో వేదం చెప్పిన రీతిగా ధూమోత్పాదన అనగా శత్రువులను భయకంపితులుగా చేసేవారు సఖా= ‘‘ఒకరికొకరు పరమమిత్రులు’’గా ఉండాలని వేదమే నిర్దేశించింది. కారణమేమంటే శత్రుసంహార సమయంలో పరస్పర వైరభావంవలన మృత్యువునకాహారం కావలసి యుంటుంది. దాని నుండి రక్షించుకొనేందుకు పరస్పరం మిత్రులుగా సహకరించుకోవడం చాల ముఖ్యంకదా! అంతేకాక అందరికి సావధానం (attention)) కలిగి యుండటం కూడ ఎంతో ప్రధానం. దానివలననే ఆత్మరక్షణ కలుగుతుంది అని వేదం ఈ సావధానతను ప్రస్ఫుటీకరిస్తూ ‘అస్రేధంత ఇతన వాజమచ్ఛ’ ‘‘శత్రువులచే ఆత్మహాని పొందక సంగ్రామంలోనికి సురక్షితంగా వెళ్లండి’’ అని ప్రబోధించింది.
యుద్ధ్భూమిలోనికి వెళ్లకముందే హింసితులయితే యుద్ధమేమి చేయగలరు. కాబట్టి యుద్ధవీరులు ‘‘శుద్ధపార్ష్ణి’’= మంచి మనస్సు గలవారై వెనుక అనుసరిస్తూ ఉండగా యుద్ధ్భూమిలోనికి ప్రవేశించమని నీతిశాస్తక్రారులు చెప్పారు. కాబట్టి యుద్ధవీరులు వేదోపదేశానుసారంగా ఆత్మహాని పొందకుండేందుకు అట్టి శుద్ధమనస్కులైన వీరులను వెంటబెట్టుకొని రణరంగ ప్రవేశంచేయాలి. పొగ ఉన్నచోట నిప్పుకూడ ఉండటం సహజంకదా. యుద్ధరంగంలో శత్రువులను భయకంపితులను చేసేందుకు వేదం యుద్ధవీరులను కల్పించమన్న ధూమం వెనుకనున్న అగ్ని నాశనంచేసేది దేశాన్ని పీడించే అశాంతిదాయకమైన ఉపద్రవాన్ని మాత్రమే. వేదమాదేశించినది అట్టి ధూమజనకమైన అగ్నినే. తదగ్ని జనకమైన ధూమానే్న.
**
149. దేవా! నే నర్పించేదానే్న స్వీకరించు
నహి మే అస్త్యఘ్న్యా న స్వధితిర్వనన్వతి అథైతాదృగ్భరామి తే॥
యదగ్నే కాని కాని చిదా తే దారూణి దధ్మసి తా జుషస్వన యవిష్ఠ్య॥
భావం:- ఓ అగ్నీ! నాది అయిన ఆవు ఒక్కటి లేదు. సమిధలను సేకరించేందుకు చెట్లను నరుకుసాధనమైన గొడ్డలి కూడ లేదు. అయినా నిన్నునేను ఆరాధింపదలచాను. శాస్ర్తియం కాని ఏవేవో కట్టెలను నీ యందు వ్రేల్చుచున్నాను. ఓ అత్యంత బలశాలీ! వానిని దయతో స్వీకరించు.
వివరణ:- అగ్నిహోత్రాన్ని స్థాపించడమొక శాస్ర్తియమైన విధానం. అథర్వణ- వేదంలో ఇలా చెప్పబడింది.
సాయం సాయం గృహపతిర్నో అగ్నిః ప్రాతః ప్రాతః సౌమనసస్య దాతా
వసోర్వసోర్వసుదాన ఏధి వయం త్వేంధానాస్తన్వం పుషేమ॥
ప్రాతఃప్రాత ర్గుహపతిర్నో అగ్నిః సాయం సాయం సౌమనసస్య దాతా
వసోర్వసోర్వసుదాన ఏధీన్ ధానాస్త్వా శతంహిమా ఋధేమ॥
అథ. 19-55-3,4.
భావం:- ‘గృహంలో స్థాపింపబడిన అగ్నిహోత్రం ప్రతి ఉదయమూ ప్రతి సాయంకాలమూ గృహస్థుడికి సుఖాన్ని ప్రదానంచేస్తుంది. అనేక విధాలైన ఐశ్వర్యాలను వర్షిస్తుంది. అందుచేత అగ్నిని స్థాపించి జీవన పుష్టిని పొంది శతవసంతాలు జీవించండి.’’
నిత్యవిధియైన అగ్నిహోత్రస్థాపనకు క్రింది వస్తుసముదాయమవసరం
1. సమిధలు (కఱ్ఱలు), నేయి, ఆవు నేతితో మిశ్రమం చేయబడిన ధాన్యం, బియ్యం, శుభ్రం చేయబడిన చక్కెర, నానావిధమైన ఓషధీద్రవ్యాలు. 2. యజ్ఞకుండం- యజ్ఞపాత్ర- అగ్నిరగిలించే అరణి. మొ.నవి. 3. గోవు. 4.సమిధలు కొట్టుటకు గొడ్డలి.
ఈ మంత్రంలో ఒక దీనుడు దరిద్రుడైన యాజ్ఞికుడు. ‘న హి మే అస్త్యఘ్న్యా న స్వధితిర్వనన్వతి’ ‘‘నావద్ద గోవులేదు. సమిధలు కొట్టి తెచ్చుటకు గొడ్డలి లేదు’’అని చేసిన ప్రార్థన కనబడుతుంది. ఆవు లేకుంటె యజ్ఞాని కవసరమైన గోఘృతమేది? గొడ్డలి లేకుంటె సమిధలు కొట్టి తెచ్చేదెలా? ఇట్టి దరిద్రుణ్ణి నేను యజ్ఞమెలా చేయను? అని దరిద్య్ర యాజ్ఞికుని మనోవేదనాభరిత ప్రార్థన. యజ్ఞం చేయడమన్నది వేదం నిత్యవిధిగా విధించింది. మనువుకూడ యజ్ఞాన్ని నిత్యవిధిగానే విధించాడు.
ఋషియజ్ఞం దేవయజ్ఞం భూతయజ్ఞం చ సర్వదా
నృయజ్ఞం పితృయజ్ఞం చ యథాశక్తి న హాపయేత్‌॥ మనుస్మృతి 4-21॥

ఇంకావుంది...