స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-166

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

151. మా సత్సంగం జ్ఞానులతో మాత్రమే
తం సుప్రతీకం సుదృశం స్వంతమవిద్వాంసో విదుష్టరం సపేమ
స యక్షద్విశ్వా వయునాని విద్వాన్ ప్ర హవ్యమగ్నిరమృతేషు వోచత్‌॥ ఋ.6-15-10.
భావం:- మేము విద్యావిహీనులం. సుందరుడు, ప్రసన్నదర్శనుడు, సదాచార పరాయణుడు, మా కన్న గొప్ప విద్వాంసుడు అయిన విద్వాంసునితో సత్సంగంచేస్తాం. ఆ విద్వాంసుడు సమస్త జ్ఞానధారలను, కర్మలను, సదాచారాలను ఇతరులకు బోధపరచువాడు కావాలి. అందరికన్న అగ్రేసరుడయిన ఆ జ్ఞాని సమస్తజీవులలో, అవినాశకమైన పదార్థాలలోని సద్గుణాలను సహితం మాకు బోధించేవాడు కావాలి.
వివరణ:- అజ్ఞానులు, అవిద్యావంతులు విద్వాంసులతో సత్సంగం చేయాలని ఈ మంత్రముపదేశిస్తూంది. అయితే వారెట్టి లక్షణాలు కలిగియుండాలి? ఆ విషయాన్నిగూడ ఈ మంత్రమే ఉపదేశిస్తూంది.
1. సుప్రతీకః :- సత్సంగయోగ్యుడైన జ్ఞాని సుందరుడైన యుండాలి. అంటే- వికలాంగుడు, క్రూరదర్శనుడు, బలహీనుడు, కండలు తిరిగిన బలిష్ఠుడు కాకూడదని భావం. ఉపదేశకులు తాముచేసే ప్రబోధంకన్న తమపై ఇతరుల మనస్సులో కలిగే సదభిప్రాయానికి కారణమయ్యే శరీరాకృతి ఎడల జాగరూకులై యుండాలని వేదంయొక్క ఆంతర్యం.
2. సుదృక్:- సర్వశాస్త్రాలను సంపూర్ణంగా అధ్యయనంచేసి సంపూర్ణ జ్ఞాన సంపన్నుడైనవాడుగా ఉండాలి. సృష్టిలోని ఏ మనిషిని ఏ పదార్థాన్ని నిర్లక్ష్యంగా- నిరుపయోగమైనదిగా భావించి దాని ఎడల అవహేళనా దృష్టి కలిగినవాడు కారాదు. ఈ లక్షణాలు లేనివాడు మంచి ఉపదేశకుడు కాలేడు.
3. స్వంచః:- సమాజం ఉత్తమ ఉపదేశకుడి లేదా గురువు నడవడికను ధర్మాచరణను క్షణక్షణమూ గమనిస్తూ ఉంటుంది. ఈ రెండింటి విషయంలో ఉపేక్ష వహించినవాడు ఎంతటి జ్ఞాని అయినా సజ్జనుడుగా బాహ్యంలో ఎంత ఆర్భాటంగా కనబడినా సమాజం వానిని ఆదరించదు.
4. విదుష్టరః:- జిజ్ఞాసులైన వానికంటె ఉపదేశకుడత్యంత అధిక జ్నాన సంపన్నుడు కావాలి. లేకుంటె జిజ్ఞాసువు సంశయాలను సమాధానపరచలేదు.
5. స యక్షద్విశ్వా వయునాని:- లోకంలో జ్ఞానులెందరో ఉండవచ్చు. వారి కర్మలుకూడ భిన్నభిన్నంగా ఉండవచ్చు. వారందరి జ్ఞాన-కర్మల సమన్వయ బోధకుడుగా ఉపదేశకుడు ఉండాలి. ఏ ఒక్కరి అభిమతాలకు వ్యతిరేకిగాగాని అనుకూలంగా గాని ఉండరాదు.
6. ప్ర హవ్యమగ్నిరమృతేషు వోచత్:- జీవులు తాము గ్రహించదగిన పదార్థాలేవో కానివేవో ఉపదేశకుడు బోధించగలిగియుండాలి. అంటే తమకు మేలును చేకూర్చే సృష్టిలోని పదార్థ సముదాయమేదో వారికి తెలిసేలాగ చెప్పగలగాలి.
ఇంద్రియ భోగం సర్వజీవులకు సమానమే. ఆత్మజ్ఞానమొక్కటే అమృతజీవులకు విశేషం. అదే వారికి హవ్యం. సమస్త దేవతలకు ఏ అగ్ని హవిస్సును అందిస్తుందో అదే రీతిగా ప్రబోధకుడు సర్వజీవులకు జ్ఞానామృత హవిస్సును అందించాలి.
కేవలం భౌతికానందానుభవంకొఱకు విశేషమైన ప్రబోధమేమీ అవసరం లేదు. ఏ ప్రబోధమూ లేకున్నా కేవలం నైసర్గికబుద్ధితో పశుపక్ష్యాదులా ఆనందాన్ని పొందగలుగుతున్నాయి. సామాన్యజనులు సహితం అదే విధంగా ఆనందాన్ని అనుభవించ గలుగుతున్నారు. కాని బుద్ధిజీవులైన మానవులకు పశుపక్ష్యాదులవలె కేవలం భౌతికానందానుభవమే ప్రధాన లక్ష్యంకాదు. ఆధ్యాత్మికానందానుభవమే మానవజన్మకు సార్థక్యం. అది జ్ఞానులైన వారి ప్రబోధంచేత మాత్రమే లభ్యమవుతుంది. కాబట్టి జ్ఞానోపదేశకుల కర్తవ్యం అట్టి జిజ్ఞాసువులైన వారికి జ్ఞానప్రబోధం చేయడమే. ఈ మంత్రంలోని అట్టి జ్ఞానోపదేశకుల కర్తవ్యం మరియు వారి లక్షణాలు వ్యాఖ్యానింపబడ్డాయి.
152. సర్వేశా! నీ ఆశ్రయం సదా శ్రేయస్కరం
అయమగ్నే జరితా త్వే అభూదపి సహసః సూనో నహ్య న్యదస్త్యాప్యమ్‌
భద్రం హి శర్మ త్రివరూథమస్తి త ఆరే హింసానామప దిద్యుమా కృధి॥
ఋ.10-142-1.
భావం:- సర్వజనులకు తేజస్సును ప్రకాశాన్ని అనుగ్రహించే ఓ అగ్నీ! నిన్ను నిత్యమూ స్తుతించే ఈ స్తుతికర్త నీకు ఆశ్రీతుడైయున్నాడు. ఎందుకంటె నీవుతప్ప నా కాశ్రయప్రదాయకుడు మరొకడు లేడు. నిజంగా నీ ఆశ్రయం జడమైన ప్రకృతి, చైతన్యవంతుడైన జీవుడు, పరమాత్మ అనే మూడింటిలో అత్యుత్తమమైనది. హింసాప్రవృత్తిగలవారి వజ్రాయుధాన్ని పోలిన మారణాయుధం మా నుండి దూరంగా ఉంచబడుగాక!.
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు