స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-165

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
భావం:- ఋషియజ్ఞం (బ్రహ్మయజ్ఞం), దేవయజ్ఞం(అగ్నిహోత్రం), భూతయజ్ఞం (బలివైశ్వదేవయజ్ఞం), నృయజ్ఞం (అతిథి యజ్ఞం), పితృయజ్ఞం. ఈ ఐదు యజ్ఞాలను చేయకుండ ఎన్నడూ ఉండరాదు.
శ్రుతులు, స్మృతులు నిత్యవిధులుగా చెప్పిన వానిని వానికి తగిన సాధన సంపత్తి లభించనపుడు చేసేదెలా? ఈ ఆర్తితోనే నైష్ఠికుడైన యాజ్ఞికుడు ‘యదగ్నే కాని కాని...యవిష్ఠ్య’ ‘‘శాస్ర్తియమైన సమిధలు లభించలేదు. గావున దయతో వానికి బదులు ఏవిధమైన కట్టెలను అగ్నిలో వ్రేల్చినా తప్పక స్వీకరించుము’’అని అర్థించాడు. అంటే ఏమి? దారిద్య్రం చేతగాని ఏ ఇతర కారణాలచేత గాని యజ్ఞార్హమైన సాధన సంపత్తిని సంపాదించుకొనలేని దీనస్థితిలో యాజ్ఞికుడు అగ్నిలో ఏది వ్రేల్చినా అగ్నిదేవుడు తప్పక దయతో స్వీకరిస్తాడని వేదం ప్రస్తావించిన ప్రార్థనలోని అంతరార్థం. సమిధలతోబాటు నావద్ద ఆవుకూడ లేదు. ‘నహి మే అస్త్యఘ్న్యా’ అన్న దీన యాజ్ఞికుని మరో ప్రార్థనా వాక్యం కనబడుతుంది. సమిధలతోబాటు హవిస్సుకు ప్రాణఆధారమైన ఘృతాన్ని ఇచ్చే ఆవు లేమి యాజ్ఞికుని దారిద్య్రాన్ని ద్విగుణీకృతం చేస్తూంది. ఈ రీతిగా వేదనిత్యవిధియైన యజ్ఞాన్ని సక్రమంగా తన దారిద్య్రాన్ని నిర్లజ్జగా అగ్నిదేవునకు ‘త్యాఃజుషస్వ’ ‘‘నే నర్చించినవానినే స్వీకరించు’’మని యాజ్ఞికుడు చేసిన ప్రార్థననే కాదు మనమూ అదే రీతిగా మన అశక్తతను దాపరికం లేకుండా విన్నవించుకొని ప్రార్థిస్తే దైవం మన ప్రార్థనను తప్పక అంగీకరిస్తాడని వేదసందేశం.
**
150. ప్రతి పర్వదినాన అగ్న్యారాధన చేయి
భరామేధ్మం కృణవామా హవీంషి తే చితయంతః
పర్వతాపర్వణా వయమ్‌ జీవాతవే ప్రతరం సాధయా
ధియో- గ్నే సఖ్యే మా రిషామా వయం తవ॥ ఋ.1-94-4.
భావం:- ఓ అగ్నీ! ప్రతి పర్వదినాన నీ కొఱకు సమిధలను తెస్తాం. హవిస్సుల నర్పిస్తాం. దీర్ఘకాల సుఖజీవనంకోసం బుద్ధి మరియు కర్మలను సమున్నతంగా ఉంచుకొంటాం. నీ చెలిమిలో మేము ఎట్టి బాధలకు, కష్టనష్టాలకు గురికాకుండా ఉంటాం.
వివరణ:- ఆయుర్యజ్ఞేన కల్పతామ్ (శు.య.వే.22-33) ‘‘యజ్ఞం ద్వారా జీవితం సాఫల్యమగుగాక!’’అని శుక్లయజుర్వేదంలో చెప్పబడింది. జీవితమంతా యజ్ఞమయం కావాలని దీని అంతరార్థం. ఈ భావానే్న మరింతగా స్పష్టంచేస్తూ ‘పురుషో వావ యజ్ఞః’ ‘మానవ జీవితమే ఒక యజ్ఞం’’అని ఛాందోగ్యోపనిషత్తు సూత్రీకరించింది. సమస్త జీవితమూ యజ్ఞమే అయినప్పుడు ప్రతి పర్వదినాన యజ్ఞాన్ని చేయడమెంతో ఆవశ్యకం. ఈ అభిప్రాయాన్ని దృష్టియందుంచుకొనియే బ్రాహ్మణ మరియు ధర్మశాస్త్ర గ్రంథాలు దశపౌర్ణమాసాది యజ్ఞాలను గురించి చాలా సవిస్తరంగా వివరించి చెప్పాయి. ఈ పార్వణ యజ్ఞాకర్మానుష్ఠాన ఫలాన్ని వివరిస్తూ ‘జీవాతవే ప్రతరం సాధయా ధియః’ ‘సుదీర్ఘ జీవనంకోసం బుద్ధిని మరియు కర్మలను దీర్ఘకాలంవరకు సదాచరణ ద్వారా సుశిక్షితం చేసుకో’’అని పేర్కొన్నాయి. అంటే సుశిక్షితమైన బుద్ధి మరియు కర్మల ద్వారా దీర్ఘాయుష్షు సిద్ధిస్తుందని భావం. ఈ దీర్ఘాయుష్షువలన ప్రయోజనమేమిటో కూడ వేదం ‘జీవన్నరో భద్రశతాని పశ్యతి’ ‘‘దీర్ఘకాలంవరకు జీవించిన నరుడు ఎన్నో శుభాలను వింటాడు చూస్తాడు’’అని బ్రతుకు తీపిని చవి చూపింది.
ఋగ్వేదంలో ‘అప్నస్వతీ మమ ధీరస్తు’ (ఋ.10-42-3) ‘‘బుద్ధి సదా కర్మోత్సాహియై యుండుగాక’’అన్న ప్రార్థన ఒకటి కనబడుతుంది. కర్మశీలిగాని బుద్ధి బుద్ధేకాదు. అందుచేత జ్ఞానసహితమైన బుద్ధిచేత కర్మక్రియావంతం కావాలి. జ్ఞానశూన్యమైన కర్మలు నిస్సారమే కాబట్టి పార్వణ యజ్ఞాలను జ్ఞానపూర్వకంగా ఆచరించాలని బ్రాహ్మణ గ్రంథాలాదేశించాయి.
ఎందుకంటె అట్టి కర్మలు అవిద్యావర్గం లోనివిగా పరిగణింపబడతాయి. క్రియారహితమైన కేవలజ్ఞానం కూడ నిష్ఫలమే. కాబట్టి జ్ఞాన సహితమైన కర్మయే నిశ్రే్శయన సాధకం. చివరగా మంత్రంలో ‘అగ్నే సఖ్యే మారిషామా వయం తవ’ ‘‘నీ చెలిమిలో మేము ఎట్టిహాని పొందక సురక్షితంగా జీవించగలం’’అను అగ్ని ప్రార్థన కనబడుతుంది. అగ్ని శబ్దానికి ముందుకు లేదా పైపైకి తీసుకొనిపోయేవాడని అర్థం. అట్టి ఘనశీలంగలవాని సఖ్యతతో మానవులు తప్పక ఉన్నతస్థానాన్ని పొందుతారు. ఆ అగ్ని చెలిమిలో ఎవరికి హానీ సంభవించదు. అందుచే మానవులను అగ్నిదేవునితో నిత్యమూ చెలిమికలిగి యుండుడని మంత్రం ఉపదేశించింది. అగ్న్యారాధనయే భారతీయ జీవన రహస్యం కదా! **
*
ఇంకావుంది...