స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-168

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దైవం తన వద్దగల ప్రాకృతిక సంపదనంతా తనకొఱకు కాస్తంత కూడ స్వార్థబుద్ధితో దాచుకొనక జీవులందరకు పంచిపెట్టాడు. అంతేకాక జీవులకు భోగంతోబాటు మోక్షాన్ని కూడ ప్రదానం చేసేందుకు విశ్వాన్ని బహుధా విస్తరించాడు. జీవుల కర్మానుసారంగా వారికి తగిన నూతన లోకాలను కూడ సృష్టించాడు. కర్మానుగుణమైన భోగం పరిసమాప్తి అయినవారికి, కర్తవ్యకర్మభ్రష్టులైన జీవులకు తిరిగి వైభోగాన్ని కల్పించేందుకు మరల వారిని కర్తవ్యనిష్ఠులను చేసేందుకు దైవం మాటిమాటికి వారికి ప్రబోధంచేస్తూనే ఉంటుంది. ఈ రీతిగా పరమాత్మ సదా క్రియాశీలుడై యుంటాడు. అట్టి సర్వేశ్వరుడికి తనలా సర్వస్వమూ దానం చేసేవారంటె చాలా ప్రీతి. అది ఆయన సహజ స్వభావం. స్వార్థ్భావనను వీడి కల్యాణప్రదమైన శుభకర్మలను చేసేవాడు భగవత్కార్యాన్ని చేసినవాడే. అంటే నిష్కామబుద్ధితో కర్మలనాచరిస్తే ఆ కర్మలు భగవదర్పణమయినట్లే. ఈ ప్రకారంగా జీవితంలో నిత్కమూ నిష్కామకర్మల నాచరించినవాడికి భగవానుడే రక్షకుడుగా ఉంటాడు.
మన ఎడల భగవత్ప్రీతి కలగడానికి ప్రధాన సూత్రం స్వార్థత్యాగమే. ఎవరికైనా దేనినైనా ఇచ్చే సమయంలో దానిమీద మమకారాన్ని వీడి అతడినే దైవంగా భావించి ‘‘ఓ ప్రభూ! నీ వస్తువును నీకే అర్పిస్తున్నాను’’ అని సమర్పణం చేయాలి. శ్రమపడి తాను సంపాదించిన సంపాదనను భగవదర్పణం చేసిన వానికి నిజంగా ‘్భవస్తస్య స్వతవాన్ పాయుః’ భగవంతుడే సంరక్షకుడవుతాడు. ఆ విధంగా రక్షించేందుకు ఆ పరమాత్ముడికి ఎవరితోనూ ప్రమేయమవసరం లేదు. ఆయనే స్వయంశక్తి సమన్వితుడై ‘స్వతవాన్’ రక్షిస్తాడు.
పాపానికి మూలం స్వార్థం, స్వార్థాన్ని వీడి ‘యస్త ఇధం జభరత్’ ‘‘దేవా! నీ కొఱకు సమిధను ఎవడుతెస్తాడో’’ తెచ్చినప్పుడల్లా ‘ఇదం న మమ’ ‘‘ఇది నాకొఱకు కాదు అని సమర్పిస్తాడో అతడికి పాపమెలా సంభవిస్తుంది?’’ లేదా ‘‘సిష్విదానో మూర్ధానం వా తతపతే త్వాయా’ ‘‘చెమట కక్కుతూ నినే్న కోరినవాడై తన శిరస్సు మాటిమాటికి తపింపచేస్తాడో’’ అతడికి కూడ పాపమెలా సంభవిస్తుంది? శిరస్సు తపింపచేయడమంటె తలలో మెదిలే సమస్త ఆలోచనలను దైవచింతనా మయం చేయడమని భావం. అలాచేసి దైవకృపకై ఆర్తిచెందడమే శిరస్సును తపింపచేయడం. చెమటలు కక్కడమంటె ఆ తపనలో శరీరాన్ని ఎంతటి శ్రమకైనా గురిచేయడమని భావార్థం. ఈ రీతి పరిశ్రమించి ఆత్మరక్షణకు వివశుడై జగత్ప్రభువును ఆర్తితో ప్రార్థిస్తాడు. ఆ ప్రార్థనను విన్న సర్వాధారుడు ‘విశ్వస్మాత్సీమఘాయత ఉరుష్య’ ఆ జీవుణ్ణి సమస్త అరిష్టాలనుండి, అపకారుల నుండి రక్షిస్తాడు. జీవులకు నిజమైన రక్షణ ఆ దైవంగాక మరెవ్వరు కల్పించగలరు? ఈ భావానే్న ఋగ్వేదం మరో సందర్భంలో ‘అవితాసి సున్వతో వృక్తబర్హిషః’ (ఋ.8-36-1)
‘‘ఇంటి గుమ్మందాటి వెళ్లిన నిరాశ్రయుడగు యాజ్ఞికుడికి దైవమా! నీవే రక్ష’’అను పునరుద్ఘాటించింది. శరణార్థులైన జీవుల రక్షణభారం దైవం స్వయంగా చేసిన ప్రతిజ్ఞయేకదా! భగవద్రక్షితుడు నిర్భయుడై ఉంటాడు. కాబట్టి మానవులందరు మంత్రోమపదేశానుసారం ప్రార్థిస్తూ భగవద్రక్షణను పొందెదరు గాక!
**
ఓ ప్రభూ!
మమ్ము నలుదెసల నుండి రక్షించు
పశ్చా త్పురస్తా దధరా దుదక్తాత్కవిః కావ్యేన పరి పాసి రాజన్‌
సఖే సఖాయమజరో జరిమ్ణే- గ్నే మర్తా అమర్త్యస్త్య న.॥
ఋ.10-87-21.
భావం:- ఓ రాజాధిరాజ పరమేశ్వరా! నీవు ఆంతరమైన దృష్టికలవాడవు. నీ క్రాంతదర్శిత్వ దృష్టిచేత నాలుగుదిక్కుల నుండి మమ్ము రక్షించు. ఓ మిత్రుడా! నీవు జరారహితుడవు. నీ మిత్రుని వృద్ధాప్యంనుండి రక్షించు. సర్వరక్షకుడవైన ఓ అగ్నీ! నీవు అమరుడవు. మమ్ము మరణం నుండి రక్షించు.
వివరణ:- ఓ పరమేశ్వరా! మేము అల్పజ్ఞులం. అల్పగమనశీలురం. అల్పశక్తిగలవారం. అల్పమైన మేధకలవారం. మమ్ము కుడి, ఎడమలలో, ఊర్ధ్వ, అధో దిశలలో ఏది ఉందో మేము చూడలేము. అందువల్ల మాకే విపత్తు పొంచియుందో ఎరుగనివారం. ఓ ప్రభూ! నీవు చర్మచక్షువులకు కానరానివానిని చూడగల లోచూపుగల వాడవు. సర్వవ్యాపకుడవు. సర్వజ్ఞుడవుగావున నీ క్రాంతదర్శిత్వానికి గోచరంకాని వస్తువేదీ ఉండదు. అందువలన నీవు మమ్ములను నలుదెసలనుండి కలిగే ఆపదలనుండి రక్షించు. నాకు ఒకటే కోరిక ప్రభూ! ‘సర్వా ఆశా మమ మిత్రం భవంతు’(అథ.వే.19-15-6) ‘అన్ని దిశలలో నాకు మిత్రులే ఉండాలి అని.
ఓ మిత్రుడా! నీవు జరావస్థ(ముసలితనం) లేనివాడవు. నేను నీ మిత్రుడను.
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు