స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం -28

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
సహజంగా జనులలో దైవంమీద విశ్వాసం కలవారు, దైవంమీద విశ్వాసం లేనివారు అనే రెండు రకాలవారు కనబడతారు. దైవంపైన విశ్వాసం భక్తి కలిగి యుండటం పెద్ద కష్టమేమీకాదు. కాని అట్టివారికి దైవంమీద విశ్వాసం లేని వారిని చూచినపుడు వారి ఎడల సహజంగా ద్వేషం-కోపం- అసహ్యం కలుగుతాయి. అలా కలుగకుండ వారి ఎడల ఎవరి మనసులో ఆదరభావం కలుగుతుందో వారే వృద్ధులు. ఇట్టి విలక్షణమైన శీలం కలవారే నిజమైన వృద్ధులని ఈ మంత్రం ‘తే వృద్ధాః ఉగ్రస్య శవసః అపద్వేష.... అన్యవ్రతస్య’అని నిర్వచించింది.
ఈ నిర్వచనం చాల బాగుంది. కాని అలా ప్రవర్తించగలగడం సాధ్యమా? దైవనిందకులను- దైవ అవిశ్వాసులను చూచినపుడు వారి ఎడల ఎవరికి ద్వేషాది భావాలు కలుగవు? అది లోక సాధారణ స్వభావం. దానిని అతిక్రమించి ప్రవర్తించడం ‘స్వభావో దురతిక్రమః’అన్న న్యాయానుసారం ఎవరికయినా కష్టమే. అయినా స్థిరబుద్ధితో వేదమతానుసారం దైవద్వేషులను సహితం కపటబుద్ధితోగాక సత్యంగా ప్రేమించే విషయంలో ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొని నిలిచేవాడే వృద్ధుడు. ఈ విషయానే్న వేదం ‘యే నేరయంతి’అన్న మాట ద్వారా ధృవీకరించింది. ఈ విధంగా సత్పథాన్ని ఎన్ని కష్టలెదురయినా స్థిరంగా వీడనివారిని ‘‘న్యాయ్యాత్పథః ప్రవిచలంతి పదం న ధీరాః’’ (్భర్తృహరి నీతిశతకం 74) ‘్ధరులు న్యాయమార్గాచరణ యందు మడమ త్రిప్పరు’అని భర్తృహరి ప్రశంసించాడు. అలా చెప్పడంలో వేదం పేర్కొన్న ‘యే నేరయంతి’అన్న మాట భర్తృహరి మనస్సులో ఉండియుంటుంది. అందుకే భర్తృహరి అదే శ్లోకంలో విఘ్నాలకు- కష్టాలకు భయపడి నీచులు పనినే ఆరంభించరు. మధ్యము లారంభించి భయంతో మధ్యలో పనిని విడిచిపెడతారు. కాని భయపడకుండ ఆరంభించిన పనిని చివరివరకు చేసేవారు మాత్రం ధీరులే అని విపులంగా వ్యాఖ్యానించాడు. ఈ విధంగా దైవదూషకులను ప్రేమతో ఆదరించడం మాత్రమేగాక తోడి వారిని సహితం ఈర్ష్యాద్వేషాలతో చూడక వారియెడల కూడ ప్రేమను కలిగి ప్రవర్తించాలి. అట్టి సమయంలో ఎన్ని కష్టాలెదురైనా స్థిరంగా నిలిచి ప్రేమించినవాడే నిజమైన వృద్ధుడు(పెద్ద) అని వేదోపదేశంగా అందరు గ్రహించాలి. జ్ఞానవృద్ధుడు వృద్ధుడుగాని ఏండ్లు మీరినవాడా వృద్ధుడు? అని చిన్నయసూరి అన్నదిందుకే.
***
ప్రాణరక్షితుడు సదా సంరక్షితుడే
న స జీయతే మరుతో న హన్యతే న స్రేధతి
న వ్యథతే న రిష్యతి నాస్య రాయ ఉప దస్యంతి నోతయ
భావం:ఓ ప్రాణశక్తులారా! ఏ ఋషినిగాని, మహారాజునుగాని, మరే సామాన్యునిగాని స్వయంగా మీరు సంరక్షిస్తారో అట్టివాడెవ్వడు హానిని పొందడు. మరణింపడు. దుఃఖాన్ని పొందడు. భయం చేత కంపింపడు. అతడికి కోపమే రాదు. అతడి ధనం నశించదు. అతడి రక్షణకు లోటుండదు. అతడి కోరికలెన్నడూ వ్యర్థం కావు.
వివరణ: ఆయువు తరిగిపోతూ వుందని, మరణం సమీపిస్తూ వుందని, ఎవరో తనను హింసిస్తారని, ఏవో రోగాలు బాధిస్తాయని, ధనమంతా నశించిపోగలదని, జీవితంలో ఏ కోరికలు సఫలం కావడంలేదని, ఇలా ఏవేవో ఎనె్నన్నో భయాలచేత మనిషి సదా వ్యాకులత చెందుతూ ఉంటాడు. అట్టి భయగ్రస్తులను వేదం అలా భయపడవలదని, మీరు మీ ప్రాణశక్తులను సురక్షితంగా ఉంచుకొంటే మీరా విధంగా భయకంపితులు కానవసరముండదని రుూ మంత్రం ద్వారా అభయమిస్తూ ఉంది. అంటే యోగాభ్యాస పద్ధతుల ద్వారా ప్రాణశక్తులను సదా శక్తివంతంగా దిద్దుకొమ్మని వేదోపదేశ ఆంతర్యం.
ఇంకావుంది...