స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-172

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబట్టి సంయమన శక్తితో గార్హస్థ్య జీవితాన్ని అందరు సాఫల్యమొనర్చుకొందురు గాక!
***
రాజా! మనం మిత్రులమై సహకరించుకొందాం
వధైర్దుః శంసాన్ అప దూధ్యో జహి దూరే వా యే
అంతి వా కే చిదత్రిణః అథా యజ్ఞాయ గృణతే సుగం
కృధ్యగ్నే సఖ్యే మా రిషామా వయం తవ॥
ఋ.1.94-9.
భావం:- ఓ రాజా! దుర్భాషలు పలికేవారిని, దురాలోచనాపరులను మారణాయుధాల ద్వారా చంపివేయి. తిండిపోతులై సోమరితనంతో ఉండేవారు దగ్గరున్నా దూరంగాఉన్నా వారిని కూడ చంపివేయి. యజ్ఞప్రశంస చేసే వారిని యజ్ఞం చేసేందుకు సర్వవిధాల సౌలభ్యాన్ని కల్పించు. ఓ అగ్నిరాజా! నీ చెలిమివలన మేమెన్నడు హింసింప బడకుండెదము గాక!
వివరణ:- ఓ రాజా! దేశంలో దురాచారులు. దురాలోచనలు కలవారు లేని విధంగా రాజ్యవ్యవస్థ నేర్పరచండి. వారివలన దేశంలో సమత, శాంతి భావనలకు విఘాతం కలుగుతూ ఉంది.
అంతేకాక దేశంలో ప్రజల రక్తాన్ని త్రాగి పీల్చి పిప్పిచేసే ఉద్యోగులు దగ్గరగా ఉన్నవారినైనా దూరంగా ఉన్నవారినైనా యథాశక్తిగా తరిమికొట్టి ప్రజలను సంరక్షించండి. లేకుంటే ప్రజలలో అశాంతి, సంక్షోభాలు పెల్లుబికి రాజ్యవ్యవస్థ సమూలంగా కుప్పకూలిపోతుంది. ధార్మికులు తమతమ పనులను నిరాటంకంగా నిర్వహించుకో గలిగియుండటమే సురాజ్యవ్యవస్థకొక చిహ్నం.
ఇలా ప్రజలు రాజునకు చేసే విన్నపానికి ప్రతీకగా వేదం ‘అథా యజ్ఞాయ గృణతే సుగం కృధి’ ‘‘యజ్ఞాచరణ చేస్తామన్న ధార్మిక జనుల సత్కర్మకు సానుకూల్యాన్ని కల్పించు’’మని వైదిక పరిభాషలో పేర్కొంది. లోకంలో ఎన్నివిధాల పరోపకార కార్యాలైతే ఉన్నాయో వానినన్నింటికి వైదిక భాషలో ‘‘యజ్ఞ’’మన్నది సాధారణ నామం. కాబట్టి దేశంలో పరోపకార కార్యాలకు (యజ్ఞాలకు) విఘ్నాలు రాకుండ చూడటం రాజు కర్తవ్యమని వేద మనోగతం.
ఇక రెండవ చరణంలో రాజు- ప్రజల మధ్య స్నేహబంధముండాలని వర్ణించబడింది. ఇది దాదాపు నేటి ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీక. ప్రజలు రాజుతో విన్నవించుకొన్న రీతిగా ‘అగ్నే సఖ్యే మారిషామా వయం తవ’ ‘‘ఓ రాజా! నీ చెలిమిలో మేమెట్టి హానిని పొందకుండెదము గాక’’అని వేదం ప్రజారాజ సంబంధం స్నేహబంధంగా ఉండాలని ఉద్ఘాటించింది. మిత్రులైనవారి మధ్య అరమరికలకు (్భదభావాలకు) తావే ఉండదుకదా!
తనువులు వేరయినా మనసులు ఒకటిగా ఉన్నవారే మిత్రులు. ఋగ్వేదమే ఒక సందర్భంలో ‘సమానా హృదయాని పః’ (ఋ.10-191-4) ‘‘మా హృదయాలు ఒకటిగా ఉండునుగాక’’అని మిత్రుల మనోధర్మాన్ని నిర్వచించింది. కాబట్టి రాజు, ప్రజలు మిత్రులుగా ఏకహృదయులై పరస్పర సహకారభావంతో మెలగాలని వేదమెప్పుడో వచించింది. ఈ భావన నేటి ప్రజాస్వామ్య భావనకు పునాదిగా భావించవచ్చు.
‘మా రిషామ’ మేము హాని పొందకుందుముగాక అని ప్రజల ఆకాంక్ష. అంటే రాజు ప్రజల ఎడల కంటకుడుగా కారాదని భావం.
దీనినిబట్టి రాజు స్వాధికార గర్వంతో ప్రజల ఎడల పీడకుడుగాగాక ప్రజాభిప్రాయాన్ని మన్నించే సహృదయశీలుడుగా ఉండాలని వేదప్రతిపాదన. ఇదే ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టుగొమ్మ. ఇది విరిగిననాడు రాజు నియంతయే. పాలన నియంతృత్వమే. అలా కారాదని వేల ఏండ్లనాటి వేదప్రబోధం.
రాజా! ధనానే్వషకుల బుద్ధిని వృద్ధిపరచుము
యేన వంసామ పృతనాసు శర్ధతస్తరంతో అర్య ఆదిశః
స త్వం నో వర్ధప్రయసా శచీవసో జిన్వాధియో వసువిదః॥ ఋ.8-60-12.
భావం:- బుద్ధి మరియు శక్తి అనే ధనాలుకల ఓ రాజా! శత్రువుల ఎత్తులను చిత్తుచేస్తూ నీ ద్వారా యుద్ధాలలో కవ్వించే వారిని స్వాధీనపరచుకోగలం. నీవు మమ్ము విశేష ప్రయత్నంతో ఉత్సాహ పరచుము. సామ్రాజ్య ధనాన్ని అనే్వషించేవారి బుద్ధులను ఉత్తేజపరచుము.
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు