స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-174

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదమొక సర్వాంగ పూర్ణమైన ధర్మప్రబోధక గ్రంథం. సమస్త మానవ సమాజాన్ని ఒక పరిపూర్ణమైన సువ్యవస్థిత మార్గంలో నడిపేందుకు ఏ పదార్థాలు - ద్రవ్యాలు అవసరమో వానినన్నింటిని అందరూ పొందేందుకు అవసరమైన సాధనాలను వేదాలు వర్ణించాయి. మానవ జీవితాన్ని ఉత్కృష్ట చరమస్థాయికి చేర్చి ముక్తిమార్గానికి చేర్చటమే వేదాల పరమ లక్ష్యం.
అందుకొఱకై నిర్దోషమైన సాధనలనే వేదం ప్రతిపాదించింది. దోష భూయిష్ఠం, మోసం, కపటయుక్తమైన సాధనాలకు దూరంగా ఉండమని వేదం గట్టిగా ఉపదేశిస్తూంది.
సమాజం సువ్యవస్థితంగా నడిచేందుకు ధనమెంతో అవసరం. అందుకు మానవుణ్ణి అథర్వణ వేదం ‘శతహస్త సమాహర’(అథ.3-24-5) ‘‘వంద చేతులతో సంపాదించు’’మని ఆదేశించింది. అయితే ధన సంపాదనలో ధర్మమార్గాన్ని వీడి ధనార్జన చేయమని వేదోద్దేశ్యంకాదు.
ఈ ఉద్దేశ్యంతో ఈ మంత్రంలో సాధకుడు ‘నూ నే అగ్నే.... .... పథిభి? పర్ష్యంహః’ ‘‘ఓ అగ్నీ! సన్మార్గంలోనే సుఖదాయకమైన ధనాన్ని మాకు ప్రదానం చేస్తున్నావు.
మరియు మేము దుర్గతులపాలుకాకుండ కాపాడుతున్నావు’’అని విజ్ఞప్తి చేస్తాడు. దీనిలో ‘అవృకేభిః= పథిభిః’ ‘కుటిలం కాని సన్మార్గాలు’అన్న పదం సాభిప్రాయమైనది. నేడు సమాజం ధనార్జనలో పిచ్చిదైపోయింది. ధనార్జనలో ధర్మాధర్మ విచక్షణ నిస్సారమైనదిగా భావింపబడుతూంది. దీనిచేతనే లోకమంతా అవినీతితో అట్టుడికిపోతూంది. ఈ పరితాపంనుండి శాంతి పొందాలంటే మానవ సమాజ మీ వేదోపదేశాన్ని తు.చ.తప్పక పాటించాలి.
దురదృష్టవశాత్తు నేడు లోభగుణం చేత లోకంలోని మానవులందరు తోడేళ్లవలె ధనార్జనలో ఒకరినొకరు చంపుకొంటున్నారు. తోడేళ్లు గుంపులుకట్టి వేటకు బయలుదేరతాయి. మార్గమధ్యంలో ఏదేని తోడేలు మరణిస్తే దానిని మరొక తోడేలు తిని ముందుకు పోతుంది.
ఈ తోడేలు ధర్మానే్న లోకంలో మానవ వివిధ సమూహాలు దేశాల పట్ల వ్యవహరిస్తూ ఉన్నారు. సమాజంలో నెలకొన్న ఈ తోడేలు మనస్తత్వాన్ని వేదం గట్టిగా నిరసిస్తూ ‘పర్ష్యంహః’- వారి దుర్బలతను దూరం చేయి’’ అని ప్రబోధిస్తూంది. ఎంత ఉదార సందేశం!! ధనం ధర్మమార్గంలో రానిదయితే మనస్సు శాంతిగా ఉండదు. ఆ ధనం మృత్యుతుల్యమై అశాంతిదాయకమై- పోతుంది. అందుకే వేదం ధనం సుమ్న= మనస్సుకు సుఖాన్ని ఇస్తుందని వాచ్యంగా చెప్పింది. ధనం దానివలన సుఖం రెండూ లభిస్తే సంపూర్ణమైన ఆయువుతోబాటు ఆనందం కూడ చిరకాలం అనుభవంలోకి వస్తుంది అని ‘మదేమ శత హిమాః సువీరాః’ ‘మేము మంచి వీరులమై వందల ఏండ్లు జీవిస్తాం’’ అని వేదం శుభాశంసన పల్కింది.
***
ఈ జన్మలోనే నీ సేవ చేసుకొంటాను
ఇహ త్వా భూర్యా చరేదుప త్మందోషావస్తర్దీదివాంసమను డ్యూన్‌
క్రీళంతస్త్వా సుమనసః సపేమాభి ద్యుమ్నా తస్థివాంసో జనానామ్‌॥ ఋ.4-4-9.
భావం:- మానవులు ఈ జన్మలోనే దేదీప్యమానంగా వెలుగొందు నిన్ను ఎంతో సేవించుకోవాలి. లౌకిక వాంఛతత్పరులైన జనుల ధనాఢ్యతను, బలాఢ్యతను విస్మరించి సద్బుద్ధితో నినే్న పూజిస్తాము.
వివరణ:- మానవ జన్మను జాగ్రత్తగా పరిశీలిస్తే దాని సార్థక్యమెందులో ఉందో బోధపడుతుంది. తినడం, త్రాగడం, మేల్కోవడం, కూర్చోవడం, సంతోషపడటం, ఏడవటం, ఆకలిగొనడం, నిద్రించడం లైంగిక క్రియలు జరపటం ఇవన్నీ మానవులకూ- పశుపక్ష్యాదులకూ సమానమే. కాని పశుపక్ష్యాదుల కంటే మానవులలో ఒక విశేషముంది. పశుపక్ష్యాదులు తమ సాధారణ జీవనక్రియాకలాపాలను నిర్వహిస్తాయి. కాని తమ అభ్యున్నతికి ఎటువంటి ప్రయత్నాలు చేయవు.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు