స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-178

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుర్బల ప్రార్థనకు దైవం కరుణించదు
అని రేణ వచసా ఫల్గ్వేన ప్రతీత్యేన కృధునాతృపాసః
అధా తే అగ్నే కిమిహా వదంత్యనాయుధాస ఆసతా సచంతామ్‌॥ ఋ.4-5-14.
భావం:- ఓ ప్రభూ! దుర్బలమైన, నిర్సారమైన, అనిశ్చతమైన, హీనమైన, అల్పమైన మాట చేత, ప్రార్థన చేత తమకుతాము సంతృప్తులు కానివారు ఈ జన్మలో ఏమి చేయగలరు? ఏమి చెప్పగలరు? ఎప్పుడైనా లోకంలో నిరాయుధులకు రక్షణ ఉండదు గదా!
వివరణ:- లోకంలో ఎవరికైనా ఏదేని పని చేసేందుకు ఎవరినుండయినా లభించిన ప్రేరణ ఏ కారణం చేతనయినా విఫలమయితే అది నిస్సారమూ- శక్తిహీనమూ అయినదిగా చెప్పబడుతుంది. తమ మాటను ఇతరులు శిరసావహించి వినేందుకు తగిన బలం తమ మాటలో ఉండేందుకు సాధారణంగా అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు. నిజంగా వారి మాటలలో శక్తి ఉండి ఇతరుల మీద ప్రభావం చూపితే వారి ప్రవర్తన దానికనుగుణంగానే ఉంటుంది. కొన్ని సందర్భాలలో ప్రజాసమూహాన్నంతా ప్రభావితం చేయవలసిన అవసరం వస్తుంది. అప్పుడు ప్రతిభావంతులైన వక్తల నాహ్వానించి వారిచేత ఉపన్యాసాల నిప్పిస్తారు.
ఇదే విధంగా కోరుకొన్న ఫలసిద్ధికోసం లేదా తమ దోషాలను పరిహరించుకొనేందుకు తమ ఎడల భగవంతునిలో సానుకూలమైన కరుణార్ర్ధ్భావం కలిగే రీతిగా ప్రేరణ కలిగించేందుకు పలికే మాటయే ప్రార్థన అవుతుంది. ఆ ప్రార్థనలో నిజంగా ఆర్ద్రమైన బలముంటే తన ఎడల సానుకూలమైన ప్రేరణ దైవంతో జనిస్తుంది. ప్రార్థన దుర్బలమై మనవంటి సామాన్యులను సహితం కరిగించలేకపోతే ఇక దృఢాత్ముడైన భగవంతుని ద్రవింపచేయగలదా? కాబట్టి ప్రార్థన తేజోవంతంగా ఉండాలి.
సారవంతమైయుండాలి. ఆ విధంగా ప్రార్థన బహిరంగంగా కనబడితే నిష్ప్రయోజనం. ఎందుకంటే అట్టి ప్రార్థన వలన ప్రార్థన చేసేవాని మనసుకే శాంతిని తృప్తిని కలిగించదు. ఇక దైవానికి ప్రీతిని ఎలా కలిగించగలదు? అట్టివారి ప్రార్థన విఫలమే అవుతుంది.
మంత్రంలో రెండవపాదం మరొక ముఖ్యాంశాన్ని వివరిస్తూంది. యుద్ధానికి వెళ్లేవారు అస్త్ర శస్త్రాలను, మారణాయుధాలను విధిగా వెంట తీసుకొని వెళ్లాలి. అలా వెళ్లనివారిని ఏ ఫలితం కలగాలో అదే కల్గుతుంది. ఈ విషయం చాలా సామాన్య విషయమే అయినా ‘అనాయుధాస ఆసతా సచంతామ్’ ‘‘మారణాయుధాలు చేతలేని వానికి యుద్ధంలో రక్షణ ఉండదు’’ అని వేదం నిష్ప్రయోజనంగా చెప్పలేదు. వేదం పేర్కొన్నది కేవలం లౌకికమైన యుద్ధం కాదు. అది ముక్తి సాధనారూపమైన ఆధ్యాత్మిక యుద్ధం. ఆ యుద్ధంలో విజయాన్ని చేకూర్చే ఆయుధం భగవత్ప్రార్థన. మీమాంసాదిగ్రంథాలు ప్రార్థనను ఒక శస్త్రంగా పేర్కొన్నాయి. వాడికాని ఆయుధం వలన విజయం చేకూరదు. అట్లే ముముక్షుత్వరూపమైన ఆర్తితో పదునులేని ప్రార్థనాయుధంతో ముక్తి విజయం సిద్ధించదు.
**
దైవమే నింగి- నేల మధ్య ఆహారభాండాగారముంచింది
ద్యామింద్రో హరిధాయసం పృథివీం హరివర్పసమ్‌
ఆధారయద్ధరితోర్భూరి భోజనం యయోరంతర్హరిశ్చరత్ ॥ ఋ.3-44-3॥
భావం:- పరమాత్ముడు కాంతులీనే ద్యావాపృథువులను పచ్చని- బంగారు వనె్నగల గోళాలుగా నిర్మించాడు. వాని మధ్య జీవులకవసరమైన ఆహారాన్ని సమృద్ధిగా ఉంచాడు. ఆ ద్యావాపృథువుల మధ్యనే సూర్యుడు సంచరిస్తూ ఉన్నాడు.
వివరణ:- వేదం రమణీయమైన ఉపమానాలకు- ఉత్ప్రేక్షలకు గని. ఈ మంత్రం దీనికి నిదర్శనం. దివిలో అసంఖ్యాకమయిన సూర్య, గ్రహ, నక్షత్ర, జ్యోతిర్మండలాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. ఉదయించే సూర్యుడు కరిగింపబడిన బంగారువనె్నతో ప్రకాశిస్తూ ఉంటారు. సంధ్యాసమయంలో గీటురాయి మీద గీయబడిన సువర్ణరేఖలా విదియనాడు చంద్రుడు దర్శనమిస్తాడు.
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు