స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-179

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యచంద్రులే గాక నక్షత్రాలు, జ్యోతిర్మండలాలు ఆకాశమనే గీటురాయి మీద గీయబడిన సువర్ణరేఖలా వెలిగిపోతూ ఉంటాయి.
ఇక భూమివైపు చూడండి. కొన్ని చోట్ల పచ్చని గడ్డిపరచుకొని యుంటుంది. కొన్ని చోట్ల పచ్చని పొలాలు కళకళలాడుతూ ఉంటాయి. కొన్నిచోట్ల లతా, గుల్మ, వృక్షాలు వ్యాపించి కనబడతాయి. మరికొన్నిచోట్ల విశాల వృక్షాలు సూర్యరశ్మిని నేలమీద పడకుండ భూమిపై పచ్చదనాన్ని చల్లదనాన్ని వెదజల్లుతున్నాయి. తాళ-హింతాళ- దేవదారు మొదలయిన నానావిధ వృక్షాలు భూమికి పచ్చని రంగును పూస్తూ ఉన్నాయి. ఇదంతా భగవానుడు వినిర్మాణం చేసిందే. ఈ విధంగా బంగారు కాంతులీనే నింగికి బంగారు చీరను ధరించిన భూదేవతకు మధ్య జీవులకు అవసరమైన ఆహార సమృద్ధితో విశ్వాత్మకుడు నింపివేసాడు. అందుచేత జీవులు తమ కాహారంకోసం ఎచ్చటకు పోనవసరం లేదు. ఆ ద్యావాపృథువుల మధ్యనే సూర్య భగవానుడు వెలుగుచూపుతూ స్వేచ్ఛగా సంచారం చేస్తున్నాడు.
మానవుడు చాలా అహంకారి. అతడు నిత్యమూ ఏవేవో నూతనావిష్కరణలను సృష్టిస్తూనే ఉంటాడు. అవి అతడికి నిత్యమూ ఏదో ఒక ఆహారాన్ని సమకూరుస్తాయి. వానినన్నింటిని నీవెక్కడినుండి తెచ్చావు? అని వేదం మానవుణ్ణి ప్రశ్నిస్తూంది. నిజానికి భగవానుడే ‘అధారయద్ధరితోర్భురి భోజనమ్’ ‘‘ద్యావాపృథువుల మధ్య దైవమే ఆహారాన్ని అమితంగా నింపి ఉంచాడు’’ నీవు దానినే గ్రహించి నూతనావిష్కరణలు చేస్తున్నావు. కాని సమస్త జీవులు తమకు సత్యమైన ఆహారాన్ని నింగి- నేల మధ్య దైవం నింపిన ఆహారానే్న ప్రధానంగా గ్రహిస్తున్నాయి. అట్టి ఎడల ఓ మానవుడా! నీకింతటి ప్రయాస దేనికి? ఈ భూలోకంలో నివసించేందుకు నిన్ను పంపిన ఆ పైవాడే ఇక్కడ సిద్ధంగా ఆహారాన్ని ఉంచాడు. అందుకోసం నీవెందుకు ఆందోళన పడిపోతావు? ఆహార విషయం అలా ఉంచు. సకల జీవులకు జీవన ప్రదాత, భోజన ప్రదాత అయిన సూర్యుడే దైవ నిర్మితమైన భూమ్యాకాశాల మధ్య సుస్థిరంగా ఉంటున్నాడు. మరి ఓ మానవుడా! దైవదత్తమైన ఆహారాన్ని గ్రహించి సుఖంగా ఉండక కృత్రిమావిష్కరణ ప్రయాసలకేల సిద్ధపడుతున్నావు?
**
సృష్టిలో కీర్తనీయుడవు నీ వోక్కడవే
యో భోజనం చ దయసే చ వర్ధనమార్ర్దాదా శుష్కం
మధుమద్దుదోహిథ స శేవధిం ని దధిషే వివస్వతి
విశ్వస్వైక ఈశిషే సాస్యుక్థ్యః॥ ఋ.2-13-6.
భావం:- ఎవరు ఆహారాన్ని దాని ద్వారా అభివృద్ధిని ఇస్తున్నాడో, ఎవడు ఆర్ద్రమైనట్టి (తడిసిన) దానినుండి ఎండిన భూమిని సృష్టించాడో, అట్టివాడవైన నీవు శుభంకరమైన నిధిని సూర్యుని ద్వారా ధరిస్తున్నావు. సమస్త విశ్వంలో నీవొక్కడవే ప్రభుడవు. నీ వొక్కడవే కీర్తినీయుడవు. వివరణ:- భగవంతుడు సర్వజీవులకు ఆహారాన్ని ఇచ్చి దానిద్వారా శారీరక- మానసికాభివృద్ధిని కూడ కలిగిస్తున్నాడు. ఆహార ప్రధాన ప్రయోజనం శారీరక, మానసికాభివృద్ధులే కదా! ఆహారం వలన నిజంగా అట్టి అభివృద్ధి సిద్ధించకపోతే అట్టి జీవులకు శరీరంలో రోగముందని నిపుణులైన వైద్యులు నిర్ధారిస్తారు. శారీరక, మానసిక వర్ధనమే ఆహార ద్రవ్యాలన్నీ ఒంటబట్టాయని చెప్పడానికి నిర్ధారణ. కాని దైవ నిర్మాణశిల్ప చాతుర్య మెట్టిదంటె- ‘ఆర్ర్దాదా శుష్కం మధుమద్ దుదోహిథ’ ‘‘తడిగా నున్నదానినుండి తీయని ఎండిన పదార్థాన్ని సృజించాడు’’ ఇక్కడ తడిగా ఉన్నది జలం. దానినుండి సృజృంపబడినది. మధురమైనది పొడిపొడిగా ఉండే (తడిలేని) భూమి.
భూమికి నాలుగువైపుల జలమే జలం. భూమిమీద కూడా జలం చాలచోట్ల ఉంది. కాని ఈ పృథివి వీటినుండి పుట్టిందని ‘అద్భ్యఃపృథివీ’ అని వేదం చెబుతూంది. ఇది ఎలా సాధ్యం? ఇదే దైవ వినిర్మాణ విచిత్రశక్తి.
మరో విచిత్రమేమంటే భూమి ఎండినట్లు కనబడినా అది చాల మధురమైనది. కాకపోతే దానినుండి మధుర రసభరిత ఫలాలు ఎలా పండుతాయి? మరి ఆ మధుర రస సర్వస్వం భూమిలోనికి ఎలా వచ్చి చేరుతుందో మనిషికి తెలియదు.
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు