స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం -29

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
ప్రాణాయామ విధానం ద్వారా ప్రాణశక్తులకు ఉత్తేజం కలిగించితే ఆయుష్షు పెరుగుతుందని అందరూ విశ్వసిస్తారు. అది సత్యమే. ఆయువే కాదు మృత్యుబాధ తొలగిపోతుంది. అంటే మృత్యువు సంభవింపదని అర్థం కాదు. ‘జాతస్య హి ధృవో మృత్యుః’- పుట్టినవాడు గిట్టక తప్పదు అన్న నియమానుసారం మరణం నిశ్చయమయినా మరణ సమయంలో సామాన్య మానవుడు పొందే మరణ వేదనను ప్రాణాయామ నిపుణుడు మాత్రం పొందలేడు. అంటే ప్రాణశక్తులను అనాయాసంగా బయటకు పంపగలడని గ్రహించాలి. మరో ప్రయోజనమేమంటే అతడు ఆత్మానందాన్ని పొందుతాడు. పొంది అందరిలో తన ఆత్మ వంటి ఆత్మయే ఉందన్న జ్ఞానాన్ని పొంది ఇతరులపట్ల క్రోధం, హింసా ప్రవృత్తులను వీడి ప్రేమభావాన్ని వహిస్తాడు. తాత్కాలికంగా ఇతరుల దోషాలవలన క్రోధం కలిగిన ఎడల ప్రాణాయామభ్యాస సుశిక్షితమైన అతని మనస్సు అతని దోషాన్ని ఎత్తిచూపుతుంది. అప్పుడాతడితరుల తప్పులనెంచనే లేడు. ఆ రీతిగా అతడు పరదోషదర్శి కాక ఆత్మదోషదర్శి మాత్రమే అవుతాడు. ఆ విధంగా అతడు అంతర బాహ్య ఇంద్రియ నిగ్రహం గల సంయమి అయి నిర్భయుడు కాగలడు.
అట్టి సంయమి ధనమెన్నడూ నష్టం కాదు. కారణం నిత్య జీవితంలో ఆకర్షణకు లొంగని అతని ఇంద్రియ సంయమన శీలమే. తద్వారా లోకంలోని ఆకర్షకమైన దుర్వ్యసనాలకు దూరంగా ఉండగలడు. అంతేకాక ముఖ్యంగా ఆ వ్యక్తిలో సర్వజీవులు తనవంటివారేనన్న సమభావన స్థిరంగా మనస్సులో నాటుకొంటుంది. తద్వారా అందరి యెడల ప్రేమభావన మరియు న్యాయప్రవర్తన అలవడుతుంది. అందుకే అట్టి వ్యక్తి అందరికీ ప్రీతిపాత్రుడవుతాడు. అట్టివాడు సమాజానికి చాలా ముఖ్యుడు గాబట్టి వేదం- ఓ ప్రాణశక్తులారా! మీరు ఎవనిని ప్రీతిపూర్వకంగా సంరక్షిస్తారో అట్టివాడు సాధారణ జనులకంటె తన ఆత్మశబ్ద బలాధిక్యం చేత అగ్రగామిగా ఉంటాడు’ అని ఋగ్వేదం వివరించింది.
ప్రాణశక్తిలో అపారమైన బలముంది. ఇది జీవునిలోని శ్వాసశక్తియే. అంటే శరీరంలో నిత్యమూ సంచరించే ప్రాణ- అపాన - వ్యాన - ఉదాన - సమాగ - నాగ - కూర్మ - కృకర- దేవదత్త - ధనంజయాలనే దశవిధ వాయు సంచారశక్తియే. ఈ ప్రాణవాయు శక్తి ఎంత శక్తివంతమయినదో నిత్యానుభవంలోని ఒక ఉదాహరణన గమనించండి. బరువైన వస్తువును పైకి ఎత్తే సమయంలో ఊపిరిని బిగించి (కుంభకం) యుంచుతాం. ఏ కారణం చేతనయినా బిగించిన ఊపిరి సడలిపోతే ఏమి జరుగుతుంది? చేతపట్టిన ఆ వస్తువు జారి క్రింద పడిపోతుంది. కారణమేమిటి? మనిషిలోని బలానికి కారణమైనది వాయువు. అది సడలిపోతే మనిషి బలమంతా వ్యర్థమయిపోతుంది.
కాబట్టి బలాన్ని వృద్ధిపరచుకొనదలచిన ప్రతి మనిషి తప్పక ప్రాణాయామ సాధన చేయడం అత్యంతావశ్యకం.

ఇంకావుంది...