స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-182

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
ఎందుకంటే ‘అపృణన్మర్ధితారం న విందతే’ (ఋ.10-117-1) ‘‘ఎప్పుడు ఎవరికి పెట్టని ఆ లోభి తనకు ఏదైనా దానం చేసి సహాయపడేవానిని పొందలేడు కదా’’కాబట్టి ఆ లోభి నిస్సహాయంగా మరణిస్తాడు.
**
ఆత్మ ప్రతిఒక్క రూపానికి
అనురూపంగా ఉంటుంది
రూపం రూపం ప్రతి రూపో బభూవ తదస్య రూపం ప్రతి చక్షణాయః
ఇంద్రో మాయాభి? పురురూప ఈయతే యుక్తాహ్యస్య
హరయః శతా దశ॥ .6-47-18.
భావం:- ఆత్మ ఒక్కొక్క ప్రత్యేక రూపానికి తగిన రూపంగా అడుచున్నది. ఆ రూపాలు ఆత్మను స్పష్టంగా దర్శింపచేసేందుకే అయియున్నాయి. బహు రూపాలుగా కనబడుతున్న ఆత్మ మాయచేత బుద్ధిచేత తెలియబడుతూంది. ఎందుకంటె వేలకొలది సమర్థతలు దానిలో మిళితమైయున్నాయి.
వివరణ:- అమీబా సూక్ష్మదశనుండి మహాబుద్ధి సంపన్నుడైన మనిషివరకు ఆత్మ ఉంది. అమీబా దేహంలో ఆ ఆత్మచేరి ఎటువంటి చేష్టలను- బుద్ధిని ప్రదర్శిస్తుందో చీమలోచేరి దానికి తగిన చేష్టలను, బుద్ధిని ప్రదర్శిస్తుంది. అట్లే ఏనుగువంటి పెద్ద శరీరంలో చేరి దానికి తగిన విశేషబుద్ధిని- చేష్టలను ఆత్మ కనబరుస్తుంది. కాని మనుష్యులలో చేరిన ఆత్మ వీటికన్నింటికంటె విలక్షణమైన చేష్టాబుద్ధులను కలిగి యుంటుంది. జీవాత్మ తన కర్మానుగుణంగా ఏ శరీరంలో చేరుతుందో దానికనుగుణంగా ఆ జీవాత్మ మారిపోతుంది అని వేదం ఈ మంత్రంలో-
‘రూపం రూపం ప్రతి రూపో భభూవ’ ఆ ప్రత్యేక రూపంలో ఆత్మకు తగిన స్వరూపం సిద్ధిస్తుంది’’అని నిర్ధారిస్తూంది. శరీరగతమైన ఏ భిన్నభిన్న రూపాలు కనబడుతున్నాయో అవన్నీ ఆ ఆత్మకు కర్మానుగుణంగా సిద్ధించినవిగా చెప్పబడుతుంటాయి. అందుచేత ‘తదస్య రూపం ప్రతి చక్షణాయ’ ‘‘ఆ విశిష్టరూపం ఆత్మస్వరూపాన్ని ప్రత్యక్షం చేస్తుంది. ఈ రీతిగా అనుమాన ప్రమాణం చేత గ్రహించి తృప్తిచెందకుంటే ఆ ఆత్మను ప్రత్యక్షంగా నీకునీవే దర్శించే తీవ్ర ప్రయత్నం చేయి. ఈ దృష్టితోనే ఉపనిషదృషి-
‘ఇహైవ సంతో- థ విద్వస్తద్వయమ్’ (బృహదారణ్యకోపనిషత్తు 4-4-14) ఈ దేహంలో ఉండే ఆత్మను మనం దర్శించగలం’’అని పేర్కొన్నాడు. మరి భిన్నభిన్న ప్రదేశాలలో ఉంటే గుర్తించడమెలా? దీనికి వేదమీవిధంగా సమాధానం చెప్పింది.
‘ఇంద్రో మాయాభిః పురురూప ఈయతే’ ‘‘పురురూపః = బహురూపాలుగల ఇంద్ర= ఆత్మ మాయద్వారా అనగా దర్శన, స్పర్శన ఆది విశిష్ట వివిధ చేష్టలు ఆ ఆత్మవిశిష్టతను సూచిస్తాయి. జడంలో సహజంగా చేష్టలుండవు. వివిధ శరీరాలలో వివిధ రీతులుగా ఉండే చేష్టలు వానిలో ఉన్న చైతన్యాన్ని ప్రకటిస్తాయి. ఆవిధంగా ఉండే నానావిధ చేష్టలు వానిలో ఏదో ఒక చైతన్యాన్ని ప్రకటిస్తాయి. ఆ విధంగా ఉండే నానావిధ చేష్టలు వానిలో ఏదో ఒక చైతన్యముందని తెలుపుతూ ఉంటాయి. చేతనాధిష్ఠితమైన ప్రతి చేష్టలోగల ఇచ్ఛ భిన్నభిన్నంగా ఉంటూ వానిలో వేరువేరు ఆత్మలున్నాయని స్పష్టం చేస్తుంటుంది. ఈ అంశం బృహదారణ్యకంలో కూడ యిలా వివరింపబడింది.
‘ప్రాణేన రరక్షన్నవరం కులాయం
బహిష్కులాయాదమృతశ్చరిత్వా
స ఈయతే- మృతో యత్ర కామం
హిరణ్మయః పురుష ఏకహంసః॥
స్వప్నాంత ఉచ్చావచమీయమానో
రూపాణి దేవః కురుతే బహూని
ఉతేవ స్ర్తిభి. సహ మోదమానో
జక్షడుతేవాపి భయాని పశ్యన్‌॥
బృహదారణ్యకోపనిషత్తు రిరి4-3-12, 13.
భావం:- అవినాశి అయిన ఆత్మ శరీరంనుండి వెలువడి ప్రాణాల ద్వారా సూక్ష్మశరీరాన్ని రక్షించుకొంటూ పరమహంస స్వరూపుడు, హిరణ్మయుడు అయిన వానికోసం కోరుకొంటూ వెళ్లిపోతుంది. పోయేటప్పుడు స్వప్న దశలో ఒకప్పుడు స్ర్తిలతో సుఖిస్తూ, ఒకప్పుడు విందులారగిస్తూ, ఒకప్పుడు భయపడుతూ నిమ్నోన్నత దశలననుభవించే రీతిగా ఆత్మ ప్రయాణిస్తుంది. మేముకూడ భయభీతులమై ఇంతకుమించి చెప్పలేము.
ఇంకా ఉంది