స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-183

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
అయితే ‘యుక్తాహ్యస్య హరయః శతాదశ’ ఆత్మను తరిమివేసేవి, పెడదారిని పట్టించే శక్తులు వేలకొలది ఉంటాయని మాత్రం చెప్పగలం. కాబట్టి సావధానులు కండి.
**

నాకెంత లాభించినా నిన్ను వదలను
మహే చన త్వామద్రివః పరా శుల్కాయ దేయామ్
న సహస్రాయ నాయుతాయ వజ్రివో న శతాయ శతామఘ
భావం:ఓ ఆదిదేవా! ఎంత గొప్ప లాభం లౌకికంగా చేకూరినా నిన్ను మాత్రం నేను విడువను. శ శతామఘ! వంద, వేయి, పదివేలు ఇలా ఎంత లాభించినా వానికోసం ఆశపడి నిన్ను మాత్రం నేను విడువను.
వివరణ:లోకంలో మానవులకు ఒక విచిత్ర స్థితి ఎదురవుతూంది. మనస్సు ఆకర్షించే భోగ సామగ్రితో నిండిన ప్రపంచమొకప్రక్క మరొకప్రక్క పరోక్షంగా వున్న భగవంతుడు ఈ రెండింటిలో ముఖ్యంగా ఎవరివైపు మొగ్గు చూపాలి? భగవంతుడు కంటికి కనబడడు. ఇక సుఖదాయకమైన భోగసామగ్రితో నిండిన ప్రపంచం ఎదురుగా ఉండి ఆకర్షిస్తూ ఉంటుంది. ప్రత్యక్షంగా కనబడేదాన్ని కనబడక పరోక్షంగా ఉన్నదాని కోసం త్యాగం చేసేందుకు ఎవరు సాహసించగలరు? సాహసించేందుకు ఆ దైవం పరోక్షంగా గాక ప్రత్యక్షంగా ముందు నిలుస్తుందా? ఇట్టి సందర్భాన్ని పురస్కరించుకొని యమధర్మరాజు నచికేతుడితో ఇలా అన్నాడు.
‘శతాయుషః పుత్రపౌత్రాన్ వృణీష్వ బహూన్ పశూన్ హస్తిహిరణ్యమశ్వాన్
భూమేర్మహదయతనం వృణీష్వ స్వయం చ జీవ శరదో యావదిచ్ఛసి
ఇమా రామాః సరథాః సతూర్యా న హీదృశా లంభనీయా మనుష్యైః
ఆభిర్మత్ప్రత్త్భాః పరిచారయస్వ నచికేతో!మరణం మా సుప్రాక్షీః
ఓ నచికేతా! నూరేండ్లు జీవించే కొడుకులను, మనుమలను కోరుకో. పశువులను, ఏనుగులనూ, గుఱ్ఱాలనూ, బంగారాన్నీ, భూమినీ, ఎన్నైనా కోరుకో. భూమిమీద సువిశాలమైన సామ్రాజ్యాన్ని కోరుకో. చిరంజీవిత్వాన్ని కూడా కోరుకో. మనుష్యలోకంలో ఏ ఏ కోరికలు దుర్లభమైనవో వాటిని స్వేచ్ఛగా అడుగు. సంగీత వాద్యాలతో, విహార రథాలతో ఉన్న అపురూప సుందరులైన కన్యలను కోరుకో. ఈ అన్నింటిని నీకు ప్రసాదిస్తాను. వారిచేత హాయిగా సేవలను పొందు. కాని మరణానంతర జీవితాన్ని మాత్రం అడగవద్దు.
యముడు మనోవైజ్ఞానిక పండితుడు. పరోక్ష విజ్ఞానాభిలాష నుండి నచికేతుణ్ణి మరలించి ప్రత్యక్ష భోగలాలసవైపునకు అతని మనస్సు త్రిప్పేందుకు తీవ్రంగా ప్రలోభపరచాడు. బిడ్డలు, మనుమలు, ఏనుగులు, గుఱ్ఱాలు, ధన, ధాన్యాలు, నాట్య, గాన వినోదాలు అన్ని ప్రత్యక్ష భోగ విషయాలు. వీనిలో ఏ ఒక్కటి పరోక్షాంశం లేదు. ఈ అన్నింటిని అడుగు అని యముడు నచికేతుడికి ఆశ చూపుతూ ఒక్క మరణానంతర జీవితాన్ని గురించి అడుగవద్దు అని నచికేతుడి దృష్టిని ప్రత్యక్ష భోగాలవైపు త్రిప్పేందుకు ప్రయత్నించాడు. కాని నిజమైన ఆధ్యాత్మిక తత్త్వవేత్తకు భగవంతుడు ‘శతమఘుడు =అనంతైశ్వర్య సంపన్నుడు’ అని బాగా తెలుసు. కాబట్టి అతడు ఆ శతమఘుని ‘త్వం విశ్వా దధిషే కేవలాని యాన్యావిర్యా చ గుహా వసూని’- ‘‘ఓ విశ్వాత్మా!నీవు ప్రత్యక్షమూ మరియు పరోక్షమూ (రహస్యం) అయిన సమస్త ఐశ్వర్యాన్ని వహించియున్నవాడవు’’ అని శ్లాఘిస్తాడు.
కాని మానవులందరు భగవంతుడట్టి సర్వైశ్వర్య సంపన్నుడని తెలిసి కూడా ఆయనను ఒక్క ప్రత్యక్ష ఐశ్వర్యానే్న ఎందుకు అర్థిస్తారో అర్థం కాదు. ఈ నిర్వేదనతోనే దైవాన్ని సంపూర్ణంగా నమ్మినవాడు ‘మహే చన త్వామద్రివః పరా శుల్కాయ దేయామ్’- ‘‘ఎంతటి మహోన్నత ధనలాభం సిద్ధించినా ఓ మహాదేవా! నేను నిన్ను మాత్రం విడువను’’-అంటే నశ్వరమైన ధనలాభాన్ని ఆశించి ‘మాహం బ్రహ్మ నిరాకుర్యామ్’-‘‘పరబ్రహ్మ లబ్ధిని తిరస్కరించను’’ అని తన దృఢ నిశ్చయాన్ని ఆవిష్కరిస్తాడు. బ్రహ్మమును నిరాకరించినవాడు తనను తాను నిరాకరించుకొన్నవాడే అవుతాడు. సమస్త నశ్వర ఐశ్వర్య సంపన్నమైన ప్రపంచ ప్రలోభమొక వైపు, సమస్త శాశ్వత ఐశ్వర్య ప్రదాయతైన సర్వేశ్వరుడొకవైపు. నశ్వరాన్ని కోరుకొని అనశ్వర భగవల్లబ్ధిని ఎవడు కోరుకొంటాడు ఒక్క మూర్ఖుడు తప్ప.
పురూవసుర్హి మఘవన్‌త్సనాదసి
‘‘అష్టైశ్వర్య సంపన్నుడైన భగవానుడొక్కడే అనాదిగా ఉన్నాడు’’-కాబట్టి భగవంతునే ఆశ్రయిస్తే ఆయన సనాతన శాశ్వత ధనమంతా స్వంతమవుతుంది. కాని ఐహిక సంపద లభించినవాడికి మాత్రం ఆ భగవదైశ్వర్యం లభ్యం కానే కాదు. కాబట్టి ధనాన్ని స్వంతం చేసుకోవడం కంటే ధనంగలవాడిని స్వంతం చేసుకోవడం ఉత్తమం.
ఇంకా ఉంది