స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-184

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వసంపద అంతా చేత చిక్కినా ఒక్క దైవానుగ్రహం లభించకుంటే అంతా వ్యర్థమే. దీనిని గ్రహించి ఓ మానవుడా నీకున్నదంతా ఈ లోకంమీదే విసిరివేసిపో. కాని ఆ దైవాన్ని మాత్రం విడువకు అన్న ఈ మంత్రోపదేశం సర్వమానవులకు శిరోధార్యమే.
172. నీ భక్తుణ్ణి ఎవరు ప్రతిఘటించగలరు?
కస్తమింద్ర త్వావసుమా మర్త్యో దధర్షతి
శ్రద్ధా ఇత్తే మఘవన్‌పార్యే దివి వాజీ వాజం నిషాసతి॥
భావం:- ఓ ఇంద్రా! ఎవరికైతే నీవే ధనమో అట్టి వానిని ఎవడు అణచివేయగలడు?
పూజ్యార్హమైన ధనంగల ఓ ప్రభూ! సంసార సాగరాన్ని తరింపజేయగల నీ జ్ఞాన ప్రకాశంమీద శ్రద్ధగల జ్ఞాని జ్ఞానాన్ని, ఆహారాన్ని, ఆధ్యాత్మిక శక్తిని అందరకు పంచాలని కోరుకొంటాడు.
వివరణ:- ధనమదం చాల చెడ్డది. అది గల ధనవంతుడు నిర్ధనుణ్ణి అణచివేస్తాడు. రాజ్యాధికారం కూడ ధనబలం మీదనే ఆధారపడియుంది. కాబట్టి ధనంలో చాల బలముంది. ధనాధిక్యం చేత మనిషి గర్వోన్మత్తుడు కావడం చాల సహజం. అట్టివాడు తనకంటె తక్కువవారిని చాల హీనులుగా పరిగణిస్తాడు. కాని భగవంతుడే ఎవరికి ధనమో అట్టి వానిని ఎవడు అణచివేయగలడు? సకల బలసమేతుడు కేవలం భగవంతుడే. ఆయనే ధనంగా ఉండి ఎవనిని నిర్ధనుడుగా ఉండేలా శాసించాడో అట్టివానిని తిరస్కారభావంతో చూడాలని మనసులోనైనా తలంచగలడా? భగవంతునకు గల సంసార సాగర తారణశక్తిమీద పూర్తివిశ్వాసంతో మనిషి దానశీలుడవుతాడు. అలా భగవద్విశ్వాస బుద్ధితో ‘తవ ప్రణీతీ హర్యశ్వ సూరిభిర్విశ్వా తరేమ దురితా’ ‘‘ఓ మహాదేవా! నీ ఆశ్రయంలో మా పూర్తి పాపాలను, దురవస్థలను అధిగమించెదము’’అని తమ సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటిస్తాడు. కాబట్టి అందరు అదే విశ్వాసంతో సంసార సుఖాలకు, సంసార జలధి దాటేందుకు భగవదాశ్రయాన్ని పొందాలి. అలా పొందేది ఎవరో కొద్దిమంది మాత్రమే.
‘తవాయం విశ్వః పురుహూత పార్థివో- వస్యుర్నామ భిక్షతే’ ‘‘ఓ మహద్యశా! సమస్త చరాతర జగత్తు తన రక్షణకోసం నీ పవిత్ర నామాన్ని భిక్షగా అర్థిస్తున్నది’’ నీ తారక నామమే గనుక లభ్యమయితే ఇక కావలసినదేముంటుంది?? సమస్త విశ్వమూ ఎవని ద్వారం వద్ద వినయంగా నిలిచి అర్చిస్తూ ఉందో అతడే మనిషికి సర్వస్వధనమే అయినపుడు అతడు ఎవడికి భయపడాలి? దాత మంచి యాచకుని ఎందుకు భయపెడతాడు? అతడిని చూచి ఎందుకు భయపడతాడు? దీనినిబట్టి యోగుల మరియు మహాత్ముల ఓజస్సునకు తేజస్సునకు గల కారణమేమిటో స్పష్టపడుతూంది. మహాఓజోవంతులు - తేజోవంతులు కావాలని కోరుకొనేవారు భగవంతుణ్ణి తమవాడిగా చేసుకోవాలి. ఆయననే తమ ధనంగా చేసుకోవాలి.
* * *
173. దేవుడెక్కడున్నాడు? ఎవడు చూసాడు?
ప్ర సు స్తోమం భరత వాజయంత ఇంద్రాయ సత్యం యది సత్యమస్తి
నేంద్రో అస్తీతి నేను ఉత్వ ఆహ క ఈం దదర్శ కమభి ష్టవామ॥
అయమస్మి జరితః పశ్య మేహ విశ్వా జాతిన్యభ్యస్మి మహ్నా
ఋతస్య మా ప్రదిశో వర్ధయంత్యాదర్దిరో భువనా దర్దరీమి॥
భావం:- ఒక నాస్తికుడు ఇలా నాస్తిక వాదం చేస్తున్నాడు. ఒకవేళ భగవంతుడే ఉంటే జ్ఞానాన్ని, సర్వబల సంపన్నతను కోరుతూ మనోవాక్కాయ కర్మలతో సశాస్ర్తియంగా ప్రార్థన చేయి. కాని భగవంతుడనే వాడే లేడు. అసలు ఆయనను ఎవడు చూచాడు? ఎవనిని గురించి మేము స్తోత్రంచేయాలి?
ఈ నాస్తిక వాదానికి ఆస్తికుడు ప్రభావితుడు కాకుండా భగవంతుడే ఇలా సమాధానమిస్తున్నాడు:-
ఓ స్తోత్రకర్తా! నేనిక్కడే ఉన్నాను. నన్ను ఇక్కడే చూడు. పుట్టిన చరాచర సృష్టినంతా నేను నా మాహాత్మ్యంతో నియంత్రించి ఉంచుతున్నాను ఋతం అనగా సృష్టి శాసనాలను, ధర్మాలను, నియమాలను బాగా తెలిసినవారు నన్ను సమున్నతునిగా కీర్తిస్తున్నారు. నేనే ప్రళయకారుడను. సమస్త భువనాలకు మరల మరల ప్రళయాన్ని నేనే కల్పిస్తున్నాను.
వివరణ:- నీకు నిజంగా భగవంతుని ఎడల విశ్వాసమే ఉంటే ఆయనను తలంచి నీ హృదయాంతరంగం నుండి వెలువడే స్తోత్రంతో సన్నుతించు. అలా స్తోత్రం చేయడంవలన నీకే తప్ప ఆయనకేమీ లాభంలేదు అని భగవత్ స్తోత్ర విధానాన్ని ప్రబోధించిన ఋషి వాదానికి భిన్నంగా ఒక నాస్తికుడిలా ప్రత్యాఖ్యానం వినిపిస్తున్నాడు- దేవుడు దేవుడు అని అరచి గగ్గోలు పెడుతున్నావు అతడసలు లేనే లేడు. ఆయనే లేనప్పుడు ‘కమభిష్ఠవామ = స్తోత్రం ఎవరిని గురించిచేయాలి? అసలు ఆయనను ‘క ఈం దదర్శ’ ఎవడు చూచాడు అని యోగశాస్త్రంలో సంశయమూ ఒక పెద్ద విఘ్నకారి యని చెప్పబడింది.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు