స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-187

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుర్మార్గుల చరిత్ర ఆ ఆదర్శపురుషుల చరిత్రలతోబాటు ఇతిహాసపుటలలో వ్రాయబడినా వారు ప్రజల హృదయాలలో మాత్రం సజీవులైయుండలేదు. కాబట్టి మానవజాతి చరిత్రలో హింసకు అహింసకున్న గౌరవం, పూజ్యభావం లేనే లేదు.
అహింస పరమధర్మమని చెప్పిన మనిషిని ఎవరేమి చేసినా మిన్నకుండి స్తబ్ధుడిగా ఉండమని వేదం చెప్పలేదు. అహింసాధర్మాన్ని చెప్పిన వెంటనే జీవితంలో ‘దక్షితామహే’’ ‘‘ఘనమైన నీ మహత్వాన్ని ప్రకటించుకొనేందుకు నిత్యం ఉత్సాహంగా ఉండు’’అని ఆదేశించింది వేదం. లోకంలో సాధారణంగా మనుషులు తమ దక్షతను చాటుకొనేందుకు హింసామార్గాన్ని ఎన్నుకొంటారు. హింస చేయకు ‘మాస్రేధత’అని చెప్పిన వేదం ‘దక్షతామహే’అని చెప్పడంలోని ప్రధానోద్దేశ్యం హింసామార్గంలో కాక అహింసామార్గంలో నీ దక్షతను ప్రకటించుకొమ్మని (తెలియజేమని) యే. మరి దానికి మార్గాలను కూడ వేదమే నిర్ణయించింది. 1. సర్వవిధ శక్తియుక్తులు 2. పరిపూర్ణ ధనసంపద. ఈ రెండింటిని ‘కృణుధ్వం రాయ ఆతుజే’; రాయ= ధనంకొఱకు ఆతుజే= శక్తియుక్తుల కొఱకు కృణుధ్వం= ప్రయత్నంచేయి అని కంఠోక్తంగా చెప్పింది నిజమే మరి. ‘ఉద్యోగేనైవ సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః’ ‘‘కార్యసిద్ధి ప్రయత్నం చేతనే గాని కోరికలు కలిగియుండటం వలన సిద్ధింపదు’’ అన్న ఆర్యోక్తి కదా. అలా ఉత్సాహంతో ఉద్యమించి సంపాదించిన ధనం గాని బలం గాని దేనికి వినియోగించాలి? ఈ విషయం గూడ ఈ మంత్రంలో కాకున్నా మరొక సందర్భంలో ఋగ్వేదమే (ఋ.7-32-20) ‘తరణి రిత్సిషాసతి వాజం పురంధ్యా యుజా’ ‘‘దుర్బలులైన వారిపై దర్పం చూపక వారిని సంరక్షించే సద్బుద్ధి గలవాడు తమ బలాన్ని జ్ఞానాన్ని వారి సంరక్షణ కొఱకై వెచ్చిస్తారు’’ అని స్పష్టపరచింది. అట్టి వాడెన్నడు చెడిపోడు. ‘క్షేతి పుష్యతి’ ‘‘మూడు పూవులు ఆరుకాయలుగా వర్ధిల్లుతూ ఉంటాడు. అతడిని చూచి దేవతలు సహితం సంతుష్టులై ఆశీర్వదిస్తారని న దేవాసః కవత్నవే ‘‘నీచమైన ఆచార వ్యవహారాలకు పాల్పడేవాని ఎడల దేవతలు సుముఖులై యుండరు’’అని ఋగ్వేదం నిర్ద్వంద్వంగా చెప్పింది. కాబట్టి సర్వదేవతా సుముఖతకై మానవులు హింసామార్గాన్ని వీడుదురుగాక!
**
ఆ మహద్భూతమే మహాసృష్టిని చేసింది
యః పుష్పిణీశ్చ ప్రస్వచ్ఛ ధర్మణా- ధి దానే వ్యవనీరధారయః
యశ్చాసమా అజనో దిద్యుతో దివ ఉరురూర్వాన్ అభితః సాస్యుక్థ్యః॥
భావం:- ఎవడు స్వసామర్థ్యం చేత పుష్ప- ఫలసంభరితమైన భూమండలాలను జీవుల సుఖసంతోషాల కొఱకై సృష్టించాడో, ఏ మహిమాన్వితుడు సృష్ట్యాదిలోని హిరణ్మయాండం నుండి ప్రకాశమానమైన బృహత్తమ లోకాలను దశదిశల సృజించాడో అట్టి నీవు మాకు సర్వదా ప్రశంసనీయుడవయి యుంటివి.
వివరణ:- ఎవనిని స్తుతించాలి? ఎవనిని ప్రార్థించాలి? ఎందుకు ప్రార్థించాలి? ఈ ప్రశ్నలు సాధారణంగా అందరి మనస్సులలో కలుగుతూనే ఉంటాయి. అది చాల సహజం. ఈ మంత్రంలో దీనికి సమాధానం సయుక్తికంగా చెప్పబడింది. కార్యం అందరికి ప్రత్యక్షంగా కనబడుతుంది. కారణం కనిపించదు. కాని కారణం తప్పక ఉంటుంది. ఈ రెండింటిగల విడదీయరాని సంబంధానే్న శాస్త్రం కార్యకారణ సంబంధంగా పేర్కొంటుంది. ఈ సంబంధం నిత్యమైనది. ఉదాహరణకు ఒక చిన్న సూది ఉంది. దానిని తయారుచేసినవాడు (ఇతడే కారణం) మనకెదురుగా లేకపోయినా ఎక్కడో అక్కడ తప్పక ఉన్నాడు కదా. అలాగే మనకు ప్రత్యక్షంగా ఈ ప్రపంచం కనిపిస్తూంది కదా. మరి దీనికి కర్త ఒకడు ఉండాలి కదా. కనబడడే? దీనికి సమాధానంగా వేద సోదాహరణంగా ఇలా చెబుతూంది. ఓ మానవుడా! సూక్ష్మంగా పరిశీలించు. నీ కళ్ళముందు పుష్పించి ఫలించిన విశాల భూమండలముంది. దీని నెవరు నిర్మించారు? వనాలు, పర్వతాలు, నదులు, సముద్రాలు ఇలా ఎనె్నన్నో ఈ భూమి మీద ఉన్నాయి. మరి ఈ భూమంతా ఎక్కడుంది? దీని భారాన్నంతా ఎవర భరిస్తున్నారు?
అది సరే. ఇక ఆకాశంవైపుకు చూడు. మిలామిలా ప్రకాశిస్తూ ఎనె్నన్నో నక్షత్రాలు, జ్యోతిర్మండలాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. వానిలో కొన్ని చిన్నవి. కొన్ని పెద్దవి. కాని చిన్నగా ప్రకాశించే ఆ నక్షత్రాలు గాని జ్యోతిర్మండలాలు కంటికి కనబడుతున్నంత చిన్నవి మాత్రం కావు. వానిలోని ఒక్కొక్క దానిలోనే ఏబది లక్షల సూర్య గోళాలు సులభంగా అమరిపోగలిగినంత మహావిశాలమైనట్టివి. అయితే సూర్యుడు మాత్రం ఒక చిన్న గోళమా? అందులో మనమంతా నివసించే భూమండలం పదమూడు లక్షలు కూడినా అవలీలగా ఆ సౌరమండల మొక్కదానిలోనే ఇమిడిపోగల మహత్తరమైన మండలమట. అన్ని తేజో మండలాలను ఎవడు ఆ విధంగా నిర్మించాడు? అతడనేవాడు కార్యకారణ సంబంధ రూపంగా ఉండి ఉంటే అతడు ఎంతో మహా తేజః స్వరూపుడై ఉండాలి కదా. ఎవడూ తయారుచేయని వస్తువు ఈ లోకంలో కనబడదు కదా.
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు